Brahmamudi మళ్లీ పిజ్జా డెలవరీ పనికి అప్పు... బిడ్డ కోసం వారసత్వం వదులుకున్న రాజ్!
బ్రహ్మముడి సీరియల్ ఈ వారం అనేక ట్విస్టులతో ఆసక్తికరంగా సాగింది. ఇక రాజ్ తన కొడుకు అంటూ ఓ బాబును తీసుకురావడంతో... ఇంట్లో కల్లోలం స్టార్ట్ అవుతుంది. బాబును అయినా వదులుకో లేదంటే వారసత్వం వదులుకో అని అపర్ణ కండిషన్ పెడుతుంది. మరోవైపు అప్పు పోలీస్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా ఓ సమస్య రావడంతో పోలీసు అవ్వనని నిర్ణయం తీసుకుంటుంది. అసలు ఆ బాబు తండ్రి ఎవరు... అతని తల్లి ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ వారం మార్చి 25వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు సీరియల్ లో ఏం జరిగిందో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
మార్చి 25వ తేదీ ఎపిసోడులో రాజ్ ఓ బాబును తీసుకురాగా.. ఆ బాబుకు కావ్య పాలు తీసుకువచ్చేందుకు వంటింట్లోకి వెళ్తుంది. అది చూసిన రుద్రాణి బ్యాచ్ అపర్ణకు చెప్తారు. ఆ బాబుకు, రాజ్ కు సాయం చేయొద్దని చెప్పా కదా అంటుంది. నేను మానవత్వంతో చేస్తున్నా.. అసలు ఆ బాబు ఏం తప్పు చేశారని కావ్య అత్తకు ఎదురుతిరుగుతుంది. మరోవైపు ఇందిరాదేవి సపోర్ట్ ఇస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మార్చి 26వ తేదీ ఎపిసోడులో బాబును ఇంటికి తీసుకురావడంతో ఇంట్లోని వారంతా అవమానిస్తూ ఉంటారు. రుద్రాణి అయితే అడుగడుగునా అవమానిస్తూ ఉంటుంది. అయినా బాబు కోసం రాజ్ భరిస్తూ ఉంటాడు. మరోవైపు ఇంట్లో రాజ్ తినకుండా పోవడంతో ఎవరు తినరు. రుద్రాణి బ్యాచ్ కూడా తినకుండా చేస్తాడు ప్రకాశం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మార్చి 27వ తేదీ ఎపిసోడులో బాబు ఏడుస్తూ ఉంటే.. ఉగ్గు తినిపించాలని కావ్య చెప్తుంది. అదేలా ఉంటుందని రాజ్ అంటాడు. తెస్తాను అని బయటకు వెళ్లేందుకు రెడీ అవుతుంది. అది చూసిన కల్యాణ్ నేను తీసుకువస్తా అని వెళ్తాడు. ఇంతలో అనామిక చూసి.. ఇంట్లో వాళ్లకు చెప్పి రచ్చ చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

మార్చి 28వ తేదీ ఎపిసోడులో రాజ్ బాబు కోసం ఊయల ఆర్డర్ చేస్తాడు. అది చూసిన రుద్రాణి వెటకారం చేస్తుంది. కాల్ వచ్చిందని రాజ్ పక్కకు వెళ్తే అప్పుడే బాబు ఏడుస్తాడు. ఎవరు ఎత్తుకోరు. అప్పుడే స్వప్న వచ్చి.. ఆ బాబును ఎత్తుకుంటుంది. ఎవరి బాబు అని అడుగుతుంది. రాజ్ బాబు అని చెప్తే.. సరిగ్గా చెప్పండి రాహుల్ కొడకా, రాజ్ కొడకా అంటూ డౌట్ పడుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మార్చి 29వ తేదీ ఎపిసోడులో అప్పు పోలీస్ ఇంటర్వ్యూకు వెళ్తుంది. అక్కడ అప్పుకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది కాల్ వస్తుందని చెప్తారు. ఇక బయటకు వచ్చిన అప్పుతో ఓ వ్యక్తి తప్పుగా ప్రవర్తిస్తాడు. కోరిక తీర్చితే జాబ్ నీదే అన్నట్లుగా మాట్లాడుతాడు. ఇక అప్పు వాడికి వార్నింగ్ ఇస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మార్చి 30వ తేదీ ఎపిసోడులో రాజ్ కావ్య బాబుతో కలిసి ఆఫీసుకు వెళ్తారు. అక్కడ అందరూ షాకింగ్ గా చూస్తుంటారు. శృతి వచ్చి ఈ బాబు ఎవరు అని అడుగుతుంది. పని చూసుకోమని రాజ్ సిరీయస్ అవుతాడు. మరోవైపు ఆఫీసులో అంతా రాజ్ కొడుకే అని మాట్లాడుకుంటారు. అది విని కావ్య తిడుతుంది. ఇక శ్వేత వచ్చి రాజ్ కు వార్నింగ్ ఇస్తుంది. నీలాంటి వాడికంటే నా మొగుడు నయం అంటూ చెప్పేసి వెళ్లిపోతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications











