Brahmamudi భాస్కర్, కావ్యలకు షాకిచ్చిన రాజ్... స్వప్నకు ఆస్తి రాసిచ్చిన సీతారామయ్య..!
బ్రహ్మముడి సీరియల్ ఈ వారం మొత్తం ఆసక్తిగా సాగింది. మార్చి 4వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు అనేక ట్విస్టులతో సీరియల్ ప్రేక్షకులను అలరించింది. ఇక ఇందిరాదేవి సాయంతో కావ్య, ఆమె బావ భాస్కర్ కలిసి నాటకం స్టార్ట్ చేశారనే సంగతి తెలిసిందే. అయితే వీరి డ్రామా డోస్ మరింత పెంచి రాజ్ ను ముప్పు తిప్పలు పెట్టారు. మరోవైపు అనామికను పూర్తిగా కల్యాణ్ పక్కనపెట్టేశారు. ఇక తన బతుకుదెరువు కోసం స్వప్న మోడలింగ్ మొదలుపెట్టబోయింది. ఈలోపు సీతారామాయ్య బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇక ఈ వారం మొత్తం సీరియల్ లో ఏం జరిగిందో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
మార్చి 4వ సీరియల్లో ఆఫీసులో ఇన్సురెన్స్ చేయించకపోవడంతో సుభాష్ 50లక్షలు నష్టపోతాడు. దీంతో సుభాష్.. తమ్ముడు ప్రకాశం మీద అరుస్తాడు. పిలిచిమరీ భార్య ముందే తిడుతాడు. దీంతో ధాన్యలక్ష్మికి కోపం వచ్చేస్తుంది. నా మొగుడిని తిట్టే అధికారం ఎవరికి ఇచ్చారు అంటూ సీరియస్ అవుతుంది. అపర్ణ వద్దని వాదించినా కూడా సుభాష్ మీద మరదలు అరుస్తుంది. దీంతో ప్రకాశం కూడా ధాన్యలక్ష్మిని తిడుతాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మార్చి 5వ సీరియల్లో అత్తింటికి వెళ్లిన రాజ్ తిప్పలు పడుతూ ఉంటాడు. రాజ్ లోని ప్రేమను బయటపెట్టేందుకు కావ్య ఆమె బావ కలిసి నాటకం ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక రాజ్ ను మరింత కుల్లుకునేందుకు కావ్య, ఆమె బావ ఆరు బయట ఫైరింగ్ వేసుకుని డ్యాన్స్ చేస్తుంటారు. ఇక కావ్య కాలు కింద నిప్పు చేరబోతుంటే రాజ్ చూసి దాన్ని పక్కకు నెట్టుతాడు. అది కాస్త భాస్కర్ కాలు కింద పడుతుంది. ఆయన కాలు కాలుతుంది. మరోవైపు రాజ్ చేతి కూడా కాలుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మార్చి 6వ సీరియల్లో కల్యాణ్ కవితలు పబ్లిష్ చేయించడానికి వెళ్లి ఇంటికి వస్తాడు. ఏమైందని ప్రకాశం అడిగితే.. నా కవితలు ఎవరు పబ్లిష్ చేయడం లేదని చెప్తాడు కల్యాణ్. దీంతో అనామిక వచ్చి సెటైర్స్ వేస్తుంది. నువ్వు ఎప్పటికి సాధించలేవని హేళన చేస్తుంది. దీంతో కల్యాణ్ సాధిస్తాను నా మీద నాకు నమ్మకం ఉందని చెప్తాడు. మరోవైపు కావ్యకు ఆమె బావను వేరు చేయాలని రాజ్ ప్లాన్స్ వేస్తుంటాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మార్చి 7వ సీరియల్లో స్వప్నకు క్రెడిట్ కార్డు బిల్ వస్తుంది. అది చూసి షాక్ అవుతుంది. దీంతో రుద్రాణి దగ్గరకు వెళ్లి అడుగుతుంది. నా దగ్గర లేవని చెప్తుంది రుద్రాణి. రాహుల్ కూడా అదే మాట చెప్తాడు. దీంతో నేను ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసు అని చెప్పి వెళ్లిపోతుంది. ఇక తాను మోడలింగ్ చేస్తున్నట్లు చెప్తుంది. ఫోటో గ్రాఫర్స్ వచ్చి ఫోటోస్ తీసుకుంటారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మార్చి 8వ సీరియల్లో కల్యాణ్.. అనామిక తన గదిలోకి రాగానే బయటకు వెళ్లేందుకు దిండు దుప్పటి తీసుకుంటాడు. ఎందుకు ఏమైందని అడిగితే.. జైలులో ఉన్నట్లే ఉందని చెప్పి వెళ్లిపోతాడు. ఇక హాల్ లో పడుకోవడం ధాన్యలక్ష్మి చూసి.. ప్రకాశం కు చెప్తుంది. ప్రకాశం వచ్చి కొడుక్కి సర్ది చెప్పి పంపిస్తాడు. మరోవైపు రాజ్ హ్యాపీగా ఉంటాడు. కావ్య బావను కనకం ఇంట్లోనే వదిలి వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు శ్వేతకు కాల్ చేసి చెప్తాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మార్చి 9వ సీరియల్లో స్వప్న మళ్లీ మోడలింగ్ అంటూ వెళ్తుంది. అది చూసి రుద్రాణి అడ్డుపడుతుంది. నా కొడుక్కి ఓ భరోసా ఉండేందుకు వెళ్తున్నా అని చెప్తుంది. ఇంతలో సీతారామాయ్య వచ్చి స్వప్నకు ఆస్తి పేపర్లు ఇస్తాడు. అది చూసి ధాన్యలక్ష్మి రచ్చ చేస్తుంది. అనామిక సైతం అడ్డుపడుతుంది. మరోవైపు రాజ్ .. కావ్య భాస్కర్ లకు షాకిస్తాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications










