అందరి కాళ్లపై పడ్డా.. రోడ్లపై పిచ్చోడిలా తిరిగా.. అవినాష్ ఎమోషనల్

బుల్లితెరపై తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కమెడియన్ ముక్కు అవినాష్. జబర్దస్త్‌తో గుర్తింపు తెచ్చుకుని, బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమవుతున్న పలు షోలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆదివారం విత్ స్టార్ మా పరివారం, కుకు విత్ జాతిరత్నాలు ఇలా షోలతో ప్రేక్షకుల్ని నవ్విస్తున్నాడు. స్క్రీన్‌పై ఎప్పుడూ నవ్వులు పంచే అవినాష్.. తాజాగా తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత విషాదకర సంఘటనను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇంతకీ ఏం జరిగింది?

Also Read
OTT Releases This Week: 'పెద్ది' నుంచి 'ఇక్కా' వరకు.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే!
OTT Releases This Week: 'పెద్ది' నుంచి 'ఇక్కా' వరకు.. ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే!

తాజాగా 'కాకమ్మ కథలు సీజన్-3' ఏడో ఎపిసోడ్‌కు ముక్కు అవినాష్ అతిథిగా హాజరయ్యారు. ఈ షోలో తనదైన శైలిలో కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులను నవ్వించిన అవినాష్.. నటి సునయనతో కలిసి పలు సరదా గేమ్స్‌లో పాల్గొన్నారు. యాంకర్ తేజస్వి అడిగిన ప్రశ్నలకు ఫన్నీగా సమాధానాలు ఇస్తూ షోను సందడిగా మార్చేశారు. తన కెరీర్ గురించి అడగగా.. "2000లోనే నా కెరీర్ మొదలైంది" అంటూ నవ్వులు పూయించాడు.

Mukku Avinash Recalls Painful Loss of First Child in kakamma Kathalu show

వెంటనే "మొదట ఓ మ్యూజిక్ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేశాను" అంటూ అసలు విషయాన్ని చెప్పాడు. అనంతరం నిర్వహించిన ఓ గేమ్‌లో యాంకర్‌కు చైన్ ఇవ్వబోతున్నట్లు నటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తర్వాత అది చైన్ కాదని, మంగళసూత్రమని చెప్పి మరోసారి నవ్వులు పూయించాడు. "నాకు ఇప్పటికే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు" అంటూ యాంకర్ అన్నారు.

Recommended For You
 Nagabandham Day 4 Collections: నాగబంధంకు షాకింగ్ కలెక్షన్లు.. 4 వ రోజు ఎన్ని కోట్లంటే?
Nagabandham Day 4 Collections: నాగబంధంకు షాకింగ్ కలెక్షన్లు.. 4 వ రోజు ఎన్ని కోట్లంటే?

ఇక ఓ ఫోటో చూయించి, దానికి అనుగుణంగా ఓ కథ చెప్పమని అడగగా..'నేను యుఎస్ లోని లాస్ వేగాస్ కు వెళ్లాను. ఆ సమయంలో నా ఫ్రెండ్ ఓ రూమ్ బుక్ చేశాడు. నా రూమ్ నెంబర్ 420. అమ్మాయి రూమ్ నెంబర్ 402. అనుకోకుండా అమ్మాయి రూంలోకి నేను వెళ్లాను. ఆమెతో నాకు నాన్ స్టాప్ గా అంటూ.. మధ్యలో కథ ఆపేశారు. అయితే.. తరువాత ఏం జరిగిందో చెప్పకుండా ఊరించారు. ఆ ఎగ్జిట్ మెంట్ తట్టుకోలేక ఏం చేశావురా అని తేజస్వి ప్రశ్నించింది.దీంతో ' నాన్ స్టాఫ్ గా మా ఇద్దరి మధ్య బీభత్సమైన గొడవ జరిగింది'అంటూ నవ్వులు పూయించారు.

You May Also Like
ఇండస్ట్రీలోకి రాకముందే స్టార్ హీరోతో డేటింగ్.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
ఇండస్ట్రీలోకి రాకముందే స్టార్ హీరోతో డేటింగ్.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

అయితే షోలో అత్యంత భావోద్వేగ క్షణం.. యాంకర్ అడిగిన ఒక ప్రశ్నతో వచ్చింది. "మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని విషాదకర సంఘటన ఏదైనా ఉందా?"అని అడగగా.. అవినాష్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. కొన్ని క్షణాలు మౌనంగా ఉండి ఈ మధ్య కాలంలో నా జీవితంలో జరిగిన అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

Bandla Ganesh vs Prakash Raj: తాగుతావు..వాగుతావు.. ప్రకాశ్ రాజ్ కు బండ్ల కౌంటర్
Bandla Ganesh vs Prakash Raj: తాగుతావు..వాగుతావు.. ప్రకాశ్ రాజ్ కు బండ్ల కౌంటర్

నా మొదటి బిడ్డను కోల్పోయిన రోజు నేను పూర్తిగా కుప్పకూలిపోయాను. ఆ రోజు ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సులు కనిపించిన ప్రతివారి కాళ్లపై పడ్డాను. నా బిడ్డను కాపాడాలని ఎంతగానో వేడుకున్నాను. కానీ ఏమీ చేయలేకపోయాను. ఆస్పత్రి బయట పిచ్చోడిలా అటూ ఇటూ తిరిగాను. రోడ్డుపై పడుకుని మట్టిలో దొర్లాను. ఆ సమయంలో నేను ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియలేదు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఆ విషయంలో చాలా భయపడ్డా.. అఖిల్‌పై నాగార్జున కామెంట్స్
ఆ విషయంలో చాలా భయపడ్డా.. అఖిల్‌పై నాగార్జున కామెంట్స్

తన బాధను తట్టుకోలేక చాలా రోజుల పాటు బయట ప్రపంచానికి దూరంగా ఉన్నానని అవినాష్ తెలిపారు. తన పరిస్థితిని అర్థం చేసుకున్న షూటింగ్ యూనిట్ సభ్యులు మరుసటి రోజు షూటింగ్‌ను కూడా రద్దు చేశారని చెప్పారు. అవినాష్ భార్య మొదటి గర్భాన్ని కోల్పోయిన విషయం అప్పట్లో అభిమానులను కూడా తీవ్రంగా కలిచివేసింది. ఆ సంఘటన నుంచి కోలుకోవడానికి ఇద్దరికీ చాలా సమయం పట్టింది.

అలా అంటే రామ్ చరణ్ కొడుతాడు.. పెద్దిపై అఖిల్ అక్కినేని కామెంట్స్!
అలా అంటే రామ్ చరణ్ కొడుతాడు.. పెద్దిపై అఖిల్ అక్కినేని కామెంట్స్!

అనంతరం వారికి పండంటి బాబు జన్మించగా, అతనికి 'అద్వైత్'అనే పేరు పెట్టారు. ఇటీవలే కుమారుడు అద్వైత్ తొలి పుట్టినరోజును కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఆ ఆనంద క్షణాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు కూడా. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా, పూర్తి ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X