X
తెలుగు » సినిమాలు » ప్రిన్స్
ప్రిన్స్

ప్రిన్స్

Comedy | Romance | 21 Oct 2022 | U | 143 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ప్రిన్స్ స్టోరీ

ప్రిన్స్ మూవీ కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో  శివకార్తికేయన్‏, ఉక్రెయిన్ బ్యూటీ మారియా,. సత్యరాజ్, ప్రేమ్ జీ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. కథ విశ్వనాథం (సత్యరాజ్) కుల మతాలు తేడా చూపకుండా అందరూ కలిసి మెలిసి ఉండాలి అనుకునే వ్యక్తి. ఇక స్కూల్ టీచర్ గా వర్క్ చేసే ఆయన కుమారుడు ఆనంద్ (శివకార్తికేయన్) తన స్కూల్ లోనే టీచర్ గా ఉన్న జెస్సిక (మరియా ర్యాబోషప్కా) అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. అయితే ఇంగ్లండ్ కు చెందిన జెస్సిక తండ్రి మాత్రం ఇండియన్స్ ని ఏ మాత్రం ఇష్టపడడు. ఆయన మరోవైపు సత్యరాజ్ గ్రామానికి చెందిన వ్యక్తితో ఒక విషయంలో గోడవపడుతూ ఇండియన్స్ పై మరింత ద్వేషాన్ని పెంచుకుంటాడు. జెస్సిక కూడా ఆనంద్ ను లవ్ చేయడంతో ఆమె తండ్రి ఏ మాత్రం ఒప్పుకొడు. ఆనంద్ తో జెస్సిక ఎందుకు ప్రేమలో పడుతుంది? అలాగే జెస్సిక తండ్రి కూడా అసలు ఇండియన్స్ అంటేనే ఎందుకు ఇష్టపడడు?. జెస్సిక ఆనంద్ ప్రేమను మొదట ఒప్పుకున్న విశ్వనాథం (సత్యరాజ్) ఒక విషయం తెలుసుకున్న తరువాత మాత్రం ఒప్పుకొడు. ఒకవైపు జెస్సిక తండ్రి మరోవైపు ఆనంద్ తండ్రి ఇద్దరు కూడా వారి ప్రేమ విషయాన్ని అంగీకరీంచారు. అసలు రెండు వర్గాలకు ఉన్న ప్రాబ్లం ఏమిటి? ఇక శివకార్తికేయన్ ను వారి గ్రామం నుంచి వెలివేయడానికి కారణం ఏమిటి? అనేది ఈ సినిమాలోని అసలైన ట్విస్టులు.
Read More

ప్రిన్స్ కాస్ట్ & క్రూ

ప్రిన్స్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం అనుదీప్ కెవి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత సునీల్ నారంగ్, సురేష్ బాబు డి, పుస్కూర్ రామ్ మోహన్ రావు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ప్రిన్స్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్, తమిళ్ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ కాంబినేషన్ వరకు సినిమాలో చాలా వరకు కామెడీ సీన్స్ ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతాయి. కానీ విలేజ్ బ్యాక్ డ్రాప్ కామేడి సీన్స్ అంత కొత్తగా ఏమి లేవు. కథకు సంబంధం లేని సన్నివేశాలు డైలాగ్స్ కొంత బోరింగ్ అనిపించవచ్చు. ఇక సినిమా పై పెద్దగా అంచనాలు లేకుండా వెళితే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ కోసం చూడవచ్చు. కానీ జాతిరత్నాలు అనుదీప్ రేంజ్ కు తగ్గట్టుగా ఉంటుందని థియేటర్స్ కు వెళితే మాత్రం అంచనాలను అందుకోకపోవచ్చు.

ప్రిన్స్ ట్రైలర్

Video Thumbnail

ప్రిన్స్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ప్రిన్స్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+