X
తెలుగు » సినిమాలు » ఖైదీ నెంబర్ 150
ఖైదీ నెంబర్ 150

ఖైదీ నెంబర్ 150

Action | Romance | 11 Jan 2017 | U/A | 147 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

ఖైదీ నెంబర్ 150 స్టోరీ

ఖైదీ నెంబర్ 150 సినిమా తమిళంలో విజయం సాధించిన 'కత్తి' చిత్రానికి రీమేక్‌ ఈ సినిమా ఇది యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్, తరుణ్ అరోర, వెన్నెల కిశోర్, సునిల్, అలీ, రాయ్ లక్ష్మి, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి  తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం వి వి వినాయక్ నిర్వహిస్తున్నారు మరియు కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ పతాకంపై రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చురు. కథ కోల్‌కతా సెంట్రల్‌జైల్‌లో ఉన్న కత్తి శీను(దొంగ పాత్రలో చిరంజీవి) అక్కడి నుంచి తప్పించుకుని హైదరాబాద్‌కి వస్తాడు. (జైల్లో చిరంజీవి ఇంట్రడక్షన్ అదిరింది).అక్కడి నుంచి బ్యాంకాక్‌కు వెళ్లిపోవాలని స్కెచ్ వేసుకుంటాడు. కానీ ఎయిర్ పోర్ట్ లో ... ల‌క్ష్మి (కాజల్)ని చూస్తాడు. లవ్ ఎట్ పస్ట్ సైట్ అంటూ ప్రేమలో పడిపోతాడు. తను ప్రేమించిన అమ్మాయి లక్ష్మి కోసం ఆగిపోతాడు. తన దిల్‌కా దడ్కన్‌ కోసం విదేశం వెళ్లకుండా వెనక్కి వచ్చేసిన కత్తి శీను. ఆ సమయంలోనే ఓ వ్యక్తిని హత్య చేయబోవడాన్ని చూస్తాడు. అప్పుడే అచ్చం తనలాగే ఉన్న వ్యక్తి శీను కంటపడతాడు. అతడే శంకర్‌ (చిరంజీవి ద్విపాత్రాభినయం). అతను తనలానే ఉండటంతో ఆశ్చర్యానికి గురి అవుతాడు. తనలాగే ఉన్న శంకర్‌ని పోలీసులు దొంగ అనుకునేలా చేసి, వాళ్లకు పట్టిస్తాడు కత్తిశీను. శంకర్ ఎవరంటే.. ఓ సోషల్ యాక్టివిస్ట్. రైతుల పక్షాన నిలిచి వారి కోసం పోరాడే రైతు నాయకుడు అని తెలుస్తుంది. మళ్లీ ఫారిన్ వెళ్లటానికి ప్రయత్నాలు చేసుకుంటున్న వేళ.. కత్తి శీనును శంకర్ గా భావించిన కలెక్టర్ అతన్ని రైతులున్న వృద్ధాశ్రమానికి తీసుకొస్తాడు. మరో ప్రక్క విలన్ ఎంట్రీ...ఓ ఎమ్ ఎన్ సి కంపెనీ ఓనర్ అగర్వాల్(తరుణ్ అరోరా) రైతుల భూముల్ని కాజేసి.. అక్కడో కూల్ డ్రింక్స్ కంపెనీని పెట్టాలనుకుంటాడు. కత్తి శీనును చూసిన అగర్వాల్ అతన్ని రైతు నాయకుడు శంకర్ గా భావించి.. రైతుల భూముల్ని తనకిచ్చేలా చేస్తే రూ.25కోట్లు ఇస్తామని బేరం పెడతాడు. దీనికి ఓకే అంటాడు శంకర్ రూపంలో ఉన్న కత్తి శీను. అయితే శంక‌ర్‌కు సన్మాన కార్యక్రమంతో.. అతడి ఎవరు ఏంటి అనే విషయాలు కత్తి శీనుకు తెలుస్తాయి. రైతుల క్షేమం కోసం శంకర్ ఎంతగా ఆలోచిస్తున్నాడు.. తపిస్తాడన్నది తెలీటంతో పాటు.. విలన్ అగర్వాల్ కుట్ర,దాని వల్ల అన్నదాతలకు జరుగుతున్న నష్టం ఏమిటో అర్థమవుతుంది. రైతుల పక్షాన నిలిచి.. శంకర్ ఆశయాల్ని అమలు చేయాలని కత్తిశీను అనుకుంటాడు. రైతుల భూముల్ని కాజేయాలనుకున్న అగర్వాల్ కుట్రకు చెక్ చెబుతూ.. రైతుల పక్షాన నిలిచే ప్రయత్నం చేస్తాడు. దీంతో కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్ కు.. రైతు నాయకుడు శంకర్ గా మారిన కత్తి శీనుకు మధ్య యద్దంమొదలవుతుంది. విలన్ అగర్వాల్ కార్పోరేట్ కుట్రను ఏ విధంగా అడ్డుకున్నాడు? రైతుల పంట భూములు కోల్పోకుండా చేశాడా? అగర్వాల్ కు చెక్ పెట్టేందుకు కత్తి శీను వేసిన స్కెచ్ ఫలించిందా? శంకర్ ఏమయ్యాడు? లక్ష్మీ.. కత్తి శ్రీనుల లవ్ స్టోరీ ఏమైంది? కత్తి శీను ఫారిన్ ప్రయాణం ఏమైంది? అన్నవి తెలుసుకోవాలంటే వెండితెర మీద సినిమాను చూడాల్సిందే.
Read More

ఖైదీ నెంబర్ 150 కాస్ట్ & క్రూ

ఖైదీ నెంబర్ 150 సిబ్బంది సమాచారం

దర్శకత్వం వి వి వినాయక్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత రామ్ చరణ్ తేజ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఖైదీ నెంబర్ 150 విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఓ పక్క ప్రేమ, మరోపక్క చకచకా సాగే మాస్‌ సన్నివేశాలతో ఫస్టాఫ్ సాగుతుంది. చిరంజీవి ద్విపాత్రాభినయంతో ఆకట్టుకుంటారు. ఫస్ట్‌ హాఫ్‌లో వచ్చే ‘రత్తాలూ...'. ‘సన్నజాజిలా పుట్టేసిందిరో, మల్లెతీగలా చుట్టేసిందిరో' పాటలు కుర్రకారుని హుషారెక్కిస్తాయి. లుక్‌ పరంగా చిరంజీవి... ఒకప్పటిలానే కనిపించి ‘ఆహా పదేళ్ల తరవాత కూడా అదే ఫిజిక్‌తో కనిపిస్తున్నారే' అని ఆశ్చర్యపోయేలా చేస్తారు. డ్యాన్సుల పరంగానూ ఒకప్పటి స్పీడే ఇప్పుడూ కనిపిస్తుంది. ఫస్టాఫ్ ఫన్, ఎంటర్టైన్మెంట్ తో సాగిపోయిన ఈ చిత్రం సెకండాఫ్ కు వచ్చేసరికి కాస్తంతం నెమ్మిదించిందనే చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ రొటీన్ గా ఉండి, లెంగ్తీగా ఉన్న ఫీల్ వచ్చింది. అఫ్ కోర్స్ నిజానికి సెంకడాఫ్ లోనే వాస్తవానికి కథలోకి వచ్చారు. కానీ సామాజిక సమస్య చుట్టూ అల్లిన కథనం కావటంతో కాస్త డ్రైగా నిపించింది. ఫస్టాఫ్ లాగే సెకండాఫ్ ఉంటే సినిమా భాక్స్ లు బ్రద్దలయ్యేవనటంలో సందేహం లేదు.

ఖైదీ నెంబర్ 150 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఖైదీ నెంబర్ 150

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+