X
Home టాప్ లిస్టింగ్

కమెడియన్లు గా ఎంట్రీ ఇచ్చి ... హీరోలుగానూ సినిమాలు చేసిన వాళ్ళు

Author Administrator | Updated: Friday, May 31, 2024, 11:18 AM [IST]

టాలీవుడ్ లో ప్రస్తుత తరంలో అలీ, సునీల్‌, సప్తగిరి తోపాటు పలువురు కమెడియన్లు హీరోలుగా సినిమాలు చేశారు. కామెడీతో ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వించే కమెడియన్లు.. హీరోలుగా కూడా మెప్పించగలమని నిరూపించుకుంటున్నారు.


cover image
ఆలీ
1

కమెడియన్‌గా ప్రేక్షకులకు బాగా దగ్గరైన అలీ.. హీరోగా కూడా మంచి మార్కులే వేయించుకున్నారు. తన నటనతో నవ్వులు పూయించడమే కాదు.. ప్రేక్షకులతో కన్నీళ్లు కూడా పెట్టించగలనని నిరూపించుకున్నారు. మాయలోడు, పిట్టలదొర, అలీ బాబా అద్భుత దీపం, ఘటోత్కచుడు, సర్కస్ సత్తిపండు, యమలీల, అక్కుం బక్కుం, హంగామా, ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’తోపాటు పలు సినిమాల్లో హీరోగా నటించారు అలీ.  కొన్ని సినిమాలు సూపర్‌‌హిట్‌గా నిలిచాయి. 

వేణు మాదవ్
2

కమెడియన్‌గా వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే వేణుమాధవ్‌కు హీరోగా కూడద చేసే అవకాశాలు వచ్చాయి. హంగామా, భూకైలాస్, ప్రేమాభిషేకం వంటి సినిమాల్లో హీరోగా చేసి మంచిపేరు తెచ్చుకున్నారు.

బ్రహ్మనందం
3

కొన్ని సంవత్సరాలపాటు బ్రహ్మానందం లేకుండా సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన కోసమే సినిమాకు ప్రేక్షకులు వచ్చేవారు. అంతేకాదు, ఆయన కామెడీతోనే సూపర్‌‌హిట్‌ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. కామెడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం హీరోగా కూడా సినిమాలు చేశారు. బాబాయ్ హోటల్, జఫ్ఫా సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించి మెప్పించారు.

 

సునీల్
4

అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సునీల్ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టారు. అనంతరం చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్‌ను అందుకోలేదు. ప్రస్తుతం సినిమాలతోపాటు ఓటీటీలో కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు సునీల్.

ప్రియదర్శి
5

ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మొదటి సినిమా మల్లేశం. ఈ సినిమాకి మంచి గుర్తింపు వచ్చింది. మెయిల్, మిఠాయి సినిమాల్లో కూడా ప్రధాన పాత్రలు పోషించారు.  బలగం సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు 

సప్తగిరి
6

సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌ఎల్‌బీ, వజ్ర కవచ ధర గోవింద సినిమాల్లో హీరోగా నటించారు. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఎమోషన్ సీన్లలో కన్నీళ్లు పెట్టించారు. హీరోగా చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్‌ సాధించకపోవడంతో కమెడియన్‌గా కొనసాగుతున్నారు.

సప్తగిరి
7

సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌ఎల్‌బీ, వజ్ర కవచ ధర గోవింద సినిమాల్లో హీరోగా నటించారు. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఎమోషన్ సీన్లలో కన్నీళ్లు పెట్టించారు. హీరోగా చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్‌ సాధించకపోవడంతో కమెడియన్‌గా కొనసాగుతున్నారు.

షకలక శంకర్
8

కామెడీ షోలో నవ్వులు పంచుతూనే సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టారు శంకర్. కమెడియన్‌గా స్థిరపడే ప్రయత్నాలు చేశారు. కమెడియన్‌గా సినిమాల్లో నటిస్తూనే హీరోగా కూడా చేశారు షకలక శంకర్. శంభో శంకర్ సినిమాలో హీరోగా నటించారు.

Sudigali Sudheer
9

జబర్దస్త్ షోతో వచ్చిన పాపులారిటీతో మంచి ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకున్న సుధీర్.. తన డాన్స్, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ సుధీర్, గాలోడు, వాంటెడ్ పండుగాడ్ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో హీరోగా కొనసాగుతున్నారు. 

శ్రీనివాస్ రెడ్డి
10

 ఇడియట్‌,   సింహాద్రి, వెంకీ, దేశముదురు, ఢీ, పరుగు, బింబిసార, కార్తికేయ2 సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. జంబలకిడిపంబ, జయమ్ము నిశ్చయమ్మురా సినిమాల్లో హీరోగా నటించిన శ్రీనివాస రెడ్డి, ముగ్గురు మొనగాళ్లు, ఆనందోబ్రహ్మ సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించారు.

సత్య అక్కల
11

2010లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సత్య.. ఇప్పటివరకు దాదాపు 50కు పైగా సినిమాల్లో కమెడియన్‌గా నటించారు. ఇక, వివాహ భోజనంబు సినిమాతో హీరోగా కూడా పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలోని నటనకుగాను సత్యకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.

 

12

For Week 11, amidst eight contestants, Jinto emerged victorious by securing the highest number of votes, solidifying his position as a frontrunner in the competition. His consistent popularity among viewers reflected his strong support base and ensured his dominance in the voting process.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+