X
హోమ్ » సెలెబ్స్ » నటరాజ్ మాస్టర్
నటరాజ్ మాస్టర్

నటరాజ్ మాస్టర్

బయోగ్రఫీ:  నటరాజ్ మాస్టర్ అనబడే నటరాజ్ కస్తూరి వృత్తి రీత్యా నటుడు, కొరియోగ్రాఫర్ మరియు నిర్మాత. ఆయన ప్రధానంగా తెలుగు పరిశ్రమలో పాపులర్ అయ్యారు. నటరాజ్ మాస్టర్ శుక్రవారం, ఏప్రిల్ 16, 1982 , భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, విజయవాడలో జన్మించాడు. అతను 10వ తరగతి వరకు అక్కడే చదువుకోగా ఆ తరువాత 1998 లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తన సత్తా చాటడానికి హైదరాబాద్ చేరాడు. ఇక ఇక్కడ సెటిల్ అవ్వడానికి కెరీర్ ప్రారంభంల అతను చాలా కష్టపడ్డాడు. ఆయనకు సినీ రంగంలోకి ఎంట్రీ అంత ఈజీగా అయితే దొరకలేదు. ఎందుకంటే అది అంత సులభం కాదు కదా, అందుకే ఆయన కొంత కాలం ఒక హోటల్‌ లో వెయిటర్‌ గా చేరాడు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ హోటల్ శ్రీహరి 'సాంబయ్య' చిత్రాన్ని నిర్మించిన నిర్మాత సత్యనారాయణకు చెందినది. ఒకరోజు సత్యనారాయణ నటరాజ్ నృత్య ప్రతిభను గుర్తించి, అతను శ్రీహరి భార్య డిస్కో శాంతి నృత్య సంస్థలో నటరాజ్‌ను చేర్చాడు. అలా హోటల్ వెయిటర్ నుంచి డాన్స్ ఇన్స్టిట్యూట్ కి చేరిన నటరాజ్ మాస్టర్ తర్వాత హైదరాబాద్‌లోని కొన్ని సంస్థలలో డ్యాన్సింగ్ టీచర్‌ గా కూడా పనిచేశారు. ఆ తర్వాత జెమిని టీవీలో 'డాన్స్ బేబీ డాన్స్' షోలో పాల్గొన్నారు. తరువాత, అతను 2001లో 'ఈ టీవీ డాన్స్ 2000' షోలో పాల్గొన్నాడు. 2006 లో, అతను 'వీధి' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత హైవే, సై, చక్రం మరియు గొడవ వంటి కొన్ని సినిమాల్లో నటించాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ లో పన్నెండవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు.
మరింత చదవండి

నటరాజ్ మాస్టర్:

నటరాజ్ మాస్టర్

పేరు నటరాజ్ మాస్టర్
పుట్టిన రోజు
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

నటరాజ్ మాస్టర్ ఆస్తి

ఆస్తి

ప్రముఖుల పుట్టినరోజులు

స్పాట్ లైట్ లో ఉన్న ప్రముఖులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+