twitter

    శివ ప్రసాద్ బయోగ్రఫీ

    శివ ప్రసాద్ భారతీయ చలనచిత్ర నటుడు / నిర్మాత, తెలుగు సినిమా పరిశ్రమలో ప్రధానంగా పనిచేశారు. సప్తగిరి ఎల్‌ఎల్‌బి, ఎటు చూసినా నువే, సై ఆట, నా ఊపిరి, ముఠామేస్త్రి వంటి ప్రముఖ సినిమాల్లో పనిచేశారు. ఆయన మునుపటి థియేటర్లలోకి వచ్చిన చిత్రం 2017 సంవత్సరంలో సప్తగిరి ఎల్‌ఎల్‌బి.

    శివప్రసాద్ సొంతూరు చిత్తూరు జిల్లాలోని పూటిపల్లి, 1951 జూలై 11న అప్పటి మద్రాస్ రాష్ట్రంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి. స్వతహాగా రంగస్థల నటుడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. ప్రేమ తపస్సు, టోపి రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.

    రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన నారమల్లి శివప్రసాద్ రెండుసార్లు చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. 2009, 2014లో ఆయన చిత్తూరు ఎంపీగా ఉన్నారు. 

    స్వతహాగా నటుడైన శివప్రసాద్ తన నిరసనలను కూడా అదే రీతిలో తెలిపారు. ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటూ పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ.. రకరకాల వేషధారణల్లో నిరసనలు తెలిపేవారు. దీంతో ఓ దశలో ఆయన జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X