CelebsbredcrumbUday Kiran
  ఉదయ్ కిరణ్

  ఉదయ్ కిరణ్

  Actor
  Born : 26 Jun 1980
  Birth Place : హైదిరాబాద్
  ఉదయ్ కిరణ్ తెలుగు మరియు తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. ఇతను తెలుగులో కథానాయకుడిగా మొదట వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కావటంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు సంపాదించుకున్నాడు. 2012లో అక్టోబరు 24న విషితను వివాహమాడారు. తేజ తీసిన... ReadMore
  Famous For
  ఉదయ్ కిరణ్ తెలుగు మరియు తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. ఇతను తెలుగులో కథానాయకుడిగా మొదట వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కావటంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు సంపాదించుకున్నాడు. 2012లో అక్టోబరు 24న విషితను వివాహమాడారు.

  తేజ తీసిన 'చిత్రం' సినిమా ద్వారా పరిచయమయిన ఉదయ్ కిరణ్, ఒక కొత్త పోకడను హీరోల్లోకి తెచ్చాడు.అంతేకాకుండ ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ పై వచ్చిన నువ్వు నేను ఇంకా మనసంతా నువ్వే ఈ సినిమాలన్ని వరుసగా హిట్ అయ్యాయి. నువ్వు నేను సినిమాలోని యువకుని పాత్రకు గానూ 2001 ఫిలింఫేర్ అవార్డ్ ఇతడ్ని వరించింది. తరువాత వచ్చిన కలుసుకోవాలని సినిమాలో తన నటనను ప్రదర్శించాడు కిరణ్. శ్రీరాం సినిమా ద్వారా ఒక పరిపక్వ నటనను...
  Read More
  • 1

   ఉదయ్ కిరణ్ వాజపేయాజుల జూన్ 26, 1980 న ఉదయ్ కిరణ్ జూన్ 26 1980 న హైదరాబాదులో పుట్టాడు
  • 2
   ఉదయ్ కిరణ్ తల్లితండ్రులు వీవీకే మూర్తి మరియు నిర్మల. ఉదయ్ కేవీ పికేట్ లో తన చదువును పూర్తి చేసాడు. ఆ పై వెస్లీ కాలేజీ నుండి బీకాంలో పట్టభద్రుడయ్యాడు.
  • 3
   ఉదయ్ కిరణ్ కి చిన్నప్పటి నుంచే సినిమాలు, నాటకాలు అంటే పిచ్చి వుండేది. చిన్నపుడు అన్ని ఫోటోలలో ముందుండేవాడు. తన రోల్ మోడల్ గా చిరంజీవి అని చేప్పుకొనేవాడు. చిరంజీవి సినిమాలు చూస్తూ వుండేవాడు.
  • 4
   2000 సం.. లో తేజ దర్శకత్వం లో చిత్రం సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ పరిచయం అయ్యారు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది.
  • 5
   ఆ తర్వాత వచ్చిన నువ్వు నేను, మనసంతా నువ్వే వరుస హిట్ అయ్యాయి. కథానాయకుడిగా వచ్చిన మొదటి మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కావటంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు సంపాదించుకున్నాడు
  • 6
   తరువాత వచ్చిన కలుసుకోవాలని సినిమాలో తన నృత్య ప్రతిభను కిరణ్ చూపాడు. శ్రీరాం సినిమా ద్వారా ఒక పరిపక్వ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
  • 7
   ఉదయ్ కిరణ్ లాస్ట్ తీసిన గుండె ఝల్లుమంది, ఏకలవ్యుడు, నువ్వెక్కడుంటే నేనక్కడుంటా, అల్లాడిస్తా , అబద్దం వంటి కొన్ని సినిమాలు ఫ్లాప్ లు వచ్చాయి.
  • 8
   తెలుగు లో ఉదయ్ కిరణ్ 20 సినిమాలు హీరోగా చేసారు. తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు. తరువాత మరో రెండు సినిమాలు, వంబు సందై, పెన్ సింగం అనే సినిమాలు తీసాడు
  • 9

   ఉదయ్ కిరణ్ కి చిరంజీవి కూతురు సుస్మితతో 2003లో నిశ్చితార్థం జరిగినా.. కొన్ని కారణాల వల్ల పెళ్ళి కార్యరూపం దాల్చలేదు
  • 10

   ఆతర్వాత 2012లో అక్టోబరు 24న విషితను వివాహమాడారు. ఉదయ్ కిరణ్ శ్రీనగర్‌కాలనీలో భార్య విషితతో కలిసి మూడు బెడ్ రూమ్ ఇంటిలో అద్దెకు ఉండేవారు.
  • 11
   2014 నూతన సంవత్సర వేడుకల నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఉదయ్ కిరణ్, విషిత 2014 జనవరి 2 న నగరానికి చేరుకున్నారు. ఫేస్‌బుక్ సంస్థలో పనిచేస్తున్న విషిత.. తన సహోద్యోగి, స్నేహితుడు రోహిత్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు జనవరి 5 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మణికొండ వెళ్లారు.
  • 12
   కొద్ది రోజులుగా డిప్రెషన్‌లో ఉంటున్న ఉదయ్ కిరణ్ పరిస్థితి గమనించిన ఆమె తనతో పాటు రమ్మనగా... ఉదయ్ నిరాకరించాడు. దీంతో తన తల్లిదండ్రుల్ని ఇంట్లో ఉంచి విషిత పార్టీకి వెళ్లారు.
  • 13
   ఆ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అత్త మేఘల, మామ గోవిందరాజన్‌లను మణికొండలోని వాళ్ల ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా ఉదయ్ చెప్పారు.
  • 14

   తాను రాత్రి 11 గంటలకు వచ్చి విషితను పికప్ చేసుకుంటానని చెప్పడంతో మేఘల, గోవిందరాజన్ వెళ్లిపోయారు. పుట్టినరోజు వేడుకలు ముగించుకున్న విషిత 11 గంటల ప్రాంతంలో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ఉదయ్ రాక కోసం వేచి చూశారు. పావు గంట గడచినా రాకపోయే సరికి ఫోన్ చేశారు. ఫోన్ మోగుతున్నా ఎత్తకపోవడంతో మరో మూడుసార్లు ప్రయత్నించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఉదయ్ రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆందోళన చెందిన విషిత... తన మేనమామ, తండ్రితో కలిసి మణికొండ నుంచి బయల్దేరారు.
  • 15
   జనవరి 6, 20తెలుగు మరియు తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. ఇతను తెలుగులో కథానాయకుడిగా వచ్చిన మొదటి మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కావటంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు సంపాదించుకున్నాడు
  • 16

   ఒంటి గంట ప్రాంతంలో శ్రీనగర్‌కాలనీలోని ప్లాట్‌కు వచ్చి తలుపు తట్టగా స్పందన లేకపోవడం, ఉదయ్ అంటూ పిలిచినా పలకకపోవడంతో మారుతాళం చెవితో తలుపులు తీసుకుని లోపలకు వెళ్లారు. లోపల నుంచి మూసి ఉన్న వ్యాయామశాల తలుపు ఎంతకూ తెరుచుకోకపోవడంతో వాచ్‌మన్లు మరికొందరితో కలసి బలవంతంగా తెరిచారు. అక్కడ ఉరివేసుకుని ఉదయ్ కిరణ్ కనిపించడంతో వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.
  • 17
   అనంతరం ఉరి వేసుకున్న తాడును తొలగించి కిందకు దింపారు. కొనప్రాణమైనా ఉంటుందని ఆశించి అపోలో ఆస్పత్రి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో అంబులెన్స్‌లో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఉదయ్ మృతి చెందినట్లుగా ప్రకటించారు.
  • 18
   ఉదయ్ కిరణ్ ఆత్మహత్యను పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు అందకపోవడంతో చార్జిషీట్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా ఉదయ్ కిరణ్ ది ఆత్మహత్యే అని పోలీసులు నిర్ధారించారు. ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించారని నివేదికలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు.
  ఉదయ్ కిరణ్ వ్యాఖ్యలు
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X