X
తెలుగు » సినిమాలు » బ్యాక్ బెంచ్ స్టూడెంట్
బ్యాక్ బెంచ్ స్టూడెంట్

బ్యాక్ బెంచ్ స్టూడెంట్

Patriotic | 15 Mar 2013 | U/A |
Telugu

2.7 /5 Users

1 /5 Filmibeat

బ్యాక్ బెంచ్ స్టూడెంట్ స్టోరీ

బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ ఇందులో మహత్‌ రాఘవేంద్ర, పియాబాజ్‌పాయ్‌, అర్చనా కవి, అలీ, బ్రహ్మానందం, శరత్‌బాబు, ప్రగతి, ఇన్సీ గుత్తా, చిన్మయి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మధుర శ్రీధర్‌ నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ వి కె రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సునీల్‌కాశ్యప్‌ స్వరాలు సమకుర్చారు. కథ పదహారు సబ్జెక్టుల్లో ఫెయిలై, ప్రేమించిన అమ్మాయి అమెరికా వెళ్లిపోతే, రెండోసారి ప్రేమలో పడ్డ కుర్రాడి జీవితంలోకి తిరిగి మొదటి ప్రేమికురాలు వస్తే ఏం జరిగిందనేది ఈ చిత్రంలోని ప్రధానాంశం. వైజాగ్ గీతాంజలి కాలేజీ ఇంజనీరింగ్‌ విద్యార్థి కార్తీక్‌ (మహత్‌ రాఘవేంద్ర). చదువులో వెనకపడ్డ కార్తీక్.. ఎథికల్ హ్యాకింగ్ లో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ లోగా కాలేజీలో ప్రియాంక (అర్చనా కవి)తో పరిచయం... కామన్ గా ప్రేమగా మారుతుంది. నాలుగో సంవత్సరం పూర్తయ్యేసరికి అన్ని సబ్జెక్టుల్లోనూ తప్పుతాడు. అదే సమయంలో ప్రియాంక అమెరికా వెళ్లి ఎం.ఎస్ చేయాలని నిర్ణయించుకుని, ఆ విషయమై విభేదాలు రాగా వదిలి వెళ్లిపోతుంది. కార్తీక్‌ నిరాశలో ఉన్న సమయంలో చైత్ర (పియా బాజ్‌పాయ్‌) అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ ఇద్దరి ప్రేమాయణం సాగుతున్న సమయంలో ప్రియాంక మళ్లీ కార్తీక్‌ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏమైందనేది మిగిలిన కథ.
Read More

బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కాస్ట్ & క్రూ

బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం మధుర శ్రీధర్ రెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సునీల్ కశ్యప్
నిర్మాత ఎమ్ వి కె రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బ్యాక్ బెంచ్ స్టూడెంట్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఏం బ్యాక్ బెంచ్ లో కూర్చునే వాళ్లు, క్లాసులో ఫెయిలయ్యే వారు జీవితంలో ఎదగలేరా...పరీక్షల్లో ఫెయిలైనంత మాత్రాన జీవితంలో ఫెయిలయినట్లు కాదు.. అని ఫెయిల్యూర్ బ్యాచ్ కి ధైర్యం చెపుతూ వచ్చిన చిత్రం 'బ్యాక్‌బెంచ్ స్టూడెంట్' . కాలేజీ ప్రేమ కథలు, ట్రైయాంగిల్ లవ్ స్టోరీలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. అయితే వాటిని ఎలా చెప్పి మెప్పించామన్నది ముఖ్యం. 'స్నేహగీతం', 'ఇట్స్ మై లవ్‌స్టోరీ' దర్శకుడు మధుర శ్రీధర్ తాజాగా 'బ్యాక్‌బెంచ్ స్టూడెంట్' అంటూ అదే తరహా కథతో ముందుకు వచ్చారు. రొటీన్ స్టోరీలైన్ తో పాటు అంతకన్నా పరమరొటీన్ మలుపులతో సినిమాను నడిపే ప్రయత్నం చేసాడు. మ్యూజిక్ తప్ప ఈ సినిమాలో చెప్పుకోవటానికి ఏమీ లేదు. దాంతో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అంతా పూనుకుని గెలిపించాల్సిన పరిస్దితి కనపడుతోంది.

బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

బ్యాక్ బెంచ్ స్టూడెంట్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+