X
తెలుగు » సినిమాలు » ఈటి-ఎవరికీ తలవంచడు
ఈటి-ఎవరికీ తలవంచడు

ఈటి-ఎవరికీ తలవంచడు

Action | Thriller | 10 Mar 2022 | U/A | 151 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఈటి-ఎవరికీ తలవంచడు స్టోరీ

ఈటి-ఎవరికీ తలవంచడు సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూర్య శివకుమార్, ప్రియక అరుళ్ మోహన్, సత్యరాజ్, శరణ్య, ఇళవరసు, ఎమ్ ఎస్ భాస్కర్, దివ్య దురైస్వామి, వినయ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పాండిరాజ్ వహించారు. నిర్మాత కళానిధి మారన్ నిర్మించారు. సంగీతం డి ఇమ్మాన్ అందించారు.  కథ సైంటిస్ట్‌గా కావాలనుకొన్న కృష్ణ మోహన్ (సూర్య) లాయర్‌‌గా సమాజంలో మహిళలపై జరిగే అక్రమాలను, అన్యాయాలను ఎదుర్కొంటుంటాడు. సాంప్రదాయ కుటుంబానికి చెందిన కృష్ణ మోహన్ తన పక్క ఊరికి చెందిన అధీరా (ప్రియాంక అరుల్ మోహన్)ను ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు. అయితే అమ్మాయిలను మాయమాటలతో లొంగ దీసుకొనే ముఠా చేతిలో లైంగిక దాడి గురైన సొంత చెల్లెలిని రక్షించుకోలేకపోతాడు. అమ్మాయిలపై అసభ్య వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్‌ చేసే మంత్రి కుమారుడు (వినయ్ రాయ్) చేసే అక్రమాలను కృష్ణ మోహన్ ఎదురిస్తాడు. ఓ దశలో ఏడుగురిని కృష్ణ మోహన్ చంపివేస్తాడు. లాయర్‌గా కోర్టులో న్యాయం కోసం వాదించే కృష్ణమోహన్ ఎందుకు హంతకుడిగా మారాడు. ఏడు హత్యలకు ప్రేరణగా ఎందుకు నిలిచాడు? అమ్మాయిలపై అఘాయిత్యాలు చేసే ముఠా చేతిలో తన సోదరినికి ఎలాంటి అన్యాయం జరిగింది? తన చెల్లెలే కాకుండా మోసానికి ఎంతో మంది మహిళలకు ఎలా అండగా నిలిచాడు. తన భార్యను టార్గెట్ చేసిన ముఠాకు ఎలా బుద్ది చెప్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే ET (ఎవరికి తలవంచడు) సినిమా కథ.
Read More

ఈటి-ఎవరికీ తలవంచడు కాస్ట్ & క్రూ

ఈటి-ఎవరికీ తలవంచడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం పాండిరాజ్
సినిమాటోగ్రఫీ ఆర్ రత్నవేలు
సంపాదకుడు రుబెన్
సంగీతం డి ఇమ్మాన్
నిర్మాత కళానిధి మారన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఈటి-ఎవరికీ తలవంచడు విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఆధునిక ప్రపంచంలో సాంకేతికతను ఆసరాగా చేసుకొని అమ్మాయిలను వేశ్యవృత్తిలోకి లాగడం, వారు ఎదురిస్తే.. అశ్లీల, అసభ్య వీడియోలను యూట్యూబ్‌లో పోస్టు చేయడం లాంటి అనాగరిక చర్యలు భారీ సంఖ్యలోనే కనిపిస్తున్నాయి. అలాంటి కథను బేస్ చేసుకొని వచ్చిన చిత్రం ఈటీ.. ఎవరికి తలవంచడు సినిమా. తమిళ వాసనలు, మసాలు దట్టించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మంచి ఎమోషనల్ పాయింట్‌ను ఆసక్తికరంగా, ప్రేక్షకుడి హృదయానికి హత్తుకొనేలా చెప్పలేకపోవడం ఈ సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. సూర్య చిత్రాలను ఆదరించే వారికి కూడా ఈ సినిమా నచ్చడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈటీ నచ్చుతుంది.

ఈటి-ఎవరికీ తలవంచడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఈటి-ఎవరికీ తలవంచడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+