X
తెలుగు » సినిమాలు » ఇంటింటి రామాయణం
ఇంటింటి రామాయణం

ఇంటింటి రామాయణం

Drama | 09 Jun 2023 | U/A | 132 Mins
Telugu

2.5 /5 Users

0 /5 Filmibeat

ఇంటింటి రామాయణం స్టోరీ

ఇంటింటి రామాయణం సినిమా ఫ్యామిలీ, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, సురభి ప్రభావతి, గంగవ్వ, అంజి మామ మిల్కురి, చేవెళ్ల రవి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సురేష్ నారెడ్ల వహించారు. నిర్మతలు వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి కలిసి నిర్మించారు. సంగీతం కళ్యాణి మాలిక్ అందించారు.  రిలీజ్  ఈ మూవీ జూన్ 9 న థియేటర్లలో విడుదల అయ్యింది.  కథ తెలంగాణలోని కమలాపూర్ గ్రామంలో నిజాయితీపరుడైన వ్యక్తి రాములు (వీకే నరేష్) అందర్నీ ప్రేమానురాగాలతో చూసుకొంటాడు. తన కంటూ పెద్ద కుటుంబాన్ని ఏర్పరుచుకొంటాడు. తన ప్రాణ స్నేహితుడు చనిపోతే ఆయన కొడుకు శ్రీను (రాహుల్ రామకృష్ణ)ను ఆదరించడమే కాకుండా కొడుకు కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకొంటాడు. రాములు కూతురు సంధ్య (నవ్య స్వామి), శ్రీను ఒకరినొకరు ప్రేమించుకొంటారు. శ్రీను ఉద్యోగం కోసం భారీగా డబ్బు అవసరం అవుతుంది. ఈ క్రమంలో రాములు ఇంట్లో బంగారం పోతుంది. ఇంట్లో బంగారం పోయిన తర్వాత రాములు కుటుంబంలో ఎలాంటి సంఘనలు చోటుచేసుకొన్నాయి? సంధ్య, శ్రీను ప్రేమ వ్యవహారం తెలిసిన తర్వాత రాములు ఎలా రియాక్ట్ అయ్యాడు? సంధ్యతో లవ్ అఫైర్ కొనసాగిస్తున్నాడనే విషయం తెలిసిన తర్వాత శ్రీనును ఎలా దూషించాడు? రాములు ఆగ్రహం చెందడంతో శ్రీను ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? శ్రీను, సంధ్య ప్రేమ వ్యవహారం రాములు కుటుంబంలో ఎలాంటి విభేదాలు సృష్టించింది? బంగారాన్ని ఎవరు కొట్టేశారు? బంగారం చివరికి ఎలా దొరికింది? రాములు, శ్రీను, ఇతర కుటుంబ సభ్యులు మళ్లీ ఎలా కలిశారు అనే ప్రశ్నలకు సమాధానమే ఇంటింటి రామాయణం సినిమా కథ. ట్రైలర్ విలేజ్‌ డ్రామా నేపథ్యంలో వివిధ పాత్రల చుట్టూ తిరిగే ఫన్‌ అండ్ కూల్‌ ఎలిమెంట్స్ తో సినిమా సాగుతుంది. మూవీ లో రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి లవ్ ట్రాక్ కూడా బాగానే వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది. సరదాగా సాగుతున్న వాళ్లందరి జీవితాల్లోకి ఒక ట్విస్ట్ ఎదురవుతుంది. ఓ రోజు హీరోయిన్ నవ్యస్వామి ఇంట్లో బంగారం దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనాన్ని ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ ఒకరిపై ఒకరు అనుమానం వ్యక్తం చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏమైంది? బంగారం ఎవరు కొట్టేశారు? చివరికి ఏమైంది? రాహుల్, నవ్య పెళ్లి చేసుకున్నారా లేదా అనేది మూవీలో చూడాలి.  మొత్తానికి ట్రైలర్ మాత్రం ఆకట్టుకునేలా వుంది. 
Read More

ఇంటింటి రామాయణం కాస్ట్ & క్రూ

ఇంటింటి రామాయణం సిబ్బంది సమాచారం

దర్శకత్వం సురేష్ నారెడ్ల
సినిమాటోగ్రఫీ ఎస్ బి ఉద్ధవ్
సంపాదకుడు పిసి మౌళి
సంగీతం కళ్యాణి మాలిక్
నిర్మాత వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఇంటింటి రామాయణం విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
తెలంగాణ యాస, భాష, సాంప్రదాయాలు, ఆచారాలు కళ్లకు కట్టినట్టు చూపిన చిత్రం ఇంటింటి రామాయణం. కుటుంబ విలువలు, భావోద్వేగాలు ఈ సినిమాకు బలంగా మారాయి. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. తెలంగాణ నేటివిటితో వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. తీరిక వేళలో మంచి అనుభూతిని పొందడానికి ఈ సినిమా చూడండి.

ఇంటింటి రామాయణం ట్రైలర్

Video Thumbnail

ఇంటింటి రామాయణం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఇంటింటి రామాయణం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+