X
తెలుగు » సినిమాలు » ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

Action | Drama | 25 Nov 2022 |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం స్టోరీ

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, ఆనంది తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి ఏఆర్‌ రాజమోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్‌, హర్ష మూవీస్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  కథ తెలుగు టీచర్‌గా పనిచేసే శ్రీనివాస్ శ్రీపాద (అల్లరి నరేష్) రంపచోడవరం నియోజకవర్గానికి జరిగే అసెంబ్లీ ఎన్నిక కోసం మారేడుమిల్లి ప్రాంతానికి ఎన్నికల అధికారిగా వెళ్తారు. అయితే అక్కడి ప్రజలు ఎన్నికలను బహిష్కరించుకోవాలని నిర్ణయించుకొంటారు. ప్రపంచానికి అంటి ముట్టనట్టు ఉండే గిరిజన ప్రాంతంలోని కష్టాలు ప్రత్యక్ష్యంగా చూస్తాడు. అయితే ఓటు హక్కు వినియోగించుకొంటే.. రవాణ, ఆరోగ్యం, విద్య సదుపాయాలు సమకూరుతాయని మారేడుమిల్లి గ్రామస్థులకు శ్రీనివాస్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో శ్రీనివాస్, ఇంగ్లీష్ టీచర్ (అల్లరి నరేష్), ప్రభుత్వ అధికారి (ప్రవీణ్) కిడ్నాప్ అవుతారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని శ్రీనివాస్ శ్రీపాద చేసిన రిక్వెస్ట్‌కు మారేడుమిల్లి ప్రజలు సానుకూలంగా స్పందించారా? శ్రీనివాస్ సలహాతో ఓటు హక్కు వినియోగించుకొన్నారా? శ్రీనివాస్‌తోపాటు ఇతర సిబ్బందిని ఎవరు కిడ్నాప్ చేశారు? కిడ్నాప్‌కు గురైన ప్రభుత్వ ఉద్యోగులను విడిపించడానికి కలెక్టర్ అర్జున్ త్రివేది (సంపత్ రాజ్) చేసిన ప్రయత్నాలు ఏమిటి? ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించిన కలెక్టర్‌ త్రివేది ఎలాంటి గుణపాఠం నేర్చుకొన్నారు. చివరకు ప్రజల డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గిందా అనే ప్రశ్నలకు సమాధానమే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా కథ.
Read More

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కాస్ట్ & క్రూ

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఏఆర్‌ రాజమోహన్‌
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఓటు విలువ, మారుమూల గిరిజన ప్రాంతాలకు జరుగుతున్న అన్యాయం, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతల బాధ్యతారాహిత్యం లాంటి అంశాలను ఎమోషనల్‌గా చేప్పేందుకు చేసిన ప్రయత్నం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. నేటివిటి, గిరిజనులు ఆచారాలు, సెంటిమెంట్ కథకు బలంగా నిలిచాయి. అయితే కథ సింగిల్ పాయింట్‌తో ఒకే నోట్‌లో వేరియేషన్స్ లేకుండా చెప్పడం ఫస్టాప్‌లో కొంత రోటీన్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ భావోద్వేగానికి గురిచేసేలా ఉంటుంది. తెలుగు భాష ఔన్నత్యం, ఉపాధ్యాయుల వృత్తికి మరింత గౌరవం తెచ్చేలా చెప్పిన డైలాగ్స్ కేక పట్టిస్తాయి. క్యాలెండర్‌లో టీచర్లకు ఒక రోజు ఉంది.. కలెక్టర్లకు ఒక రోజు ఉందా? ఆలోచింపజేసే డైలాగ్స్ హృదయాన్ని ఉల్లాసంగా మారుస్తాయి.ఇంగ్లీష్ మీడియం బూచీ చూపించి తెలుగు భాషను భ్రష్టుపట్టించే వారికి ఈ సినిమా ఒక చెంపపెట్టు. ఇట్లు మారేడుమిల్లి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ సినిమానే కాకుండా మార్పు, ప్రశ్నించే తత్వంపై ఆధారంగా వ్యవస్థ గురించి ఆలోచింపజేసే చిత్రం. అభ్యుదయ భావాలు ఉన్న కథలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్

Video Thumbnail

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+