For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Itlu Maredumilli Prajaneekam: నరేష్ మూవీకి రికార్డు బిజినెస్.. ఎన్ని థియేటర్లలో రిలీజ్ కాబోతుందంటే!

  |

  దిగ్గజ దర్శకుడి కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు విలక్షణ హీరో నరేష్. 'అల్లరి' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అతడు.. అప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చాడు. తద్వారా తక్కువ సమయంలోనే యాభై చిత్రాలను పూర్తి చేశాడు. ఇక, కామెడీ హీరోగా పేరొందిన ఈ టాల్ హీరో.. ఈ మధ్య పంథాను మార్చుకున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ బిజినెస్, థియేటర్స్ లెక్కను చూద్దాం పదండి!

  ఎలక్షన్ ఆఫీసర్‌గా అల్లరి నరేష్

  ఎలక్షన్ ఆఫీసర్‌గా అల్లరి నరేష్

  టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రమే 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్ మోహన్ తెరకెక్కించిన ఈ మూవీని హస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ నిర్మించారు. ఇందులో ఆనంది హీరోయిన్‌గా నటించింది. శ్రీచరణ్ పాకాల దీనికి సంగీతం అందించారు. ఇందులో ప్రవీణ్, వెన్నెల కిశోర్, సంపత్ రాజ్ సహా పలువురు కీలక పాత్రలు చేశారు.

  నాగశౌర్య కట్నం వివరాలు లీక్: అన్ని కోట్ల విలువైన కానుకలు.. అనూష పేరిట ఉన్న ఆస్తి ఎంతంటే!

  అలాంటి స్టోరీ... ఫన్, ఎమోషన్

  అలాంటి స్టోరీ... ఫన్, ఎమోషన్

  అటవీ ప్రాంతమైన మారేడుమిల్లికి ఎలక్షన్ ఆఫీసర్‌గా వెళ్లిన ఓ టీచర్.. అక్కడి వాళ్లు ఎదుర్కొంటోన్న సమస్యలపై ఎలాంటి పోరాటం చేశాడు? ఈ క్రమంలోనే ఎవరితో యుద్దానికి సిద్ధం అయ్యాడు? ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనే అంశాలతో 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ తెరకెక్కింది. ఇది ఫన్ అండ్ ఎమోషన్ కంటెంట్‌తో రాబోతుంది.

  ప్రమోషన్స్ పూర్తి.. సందడిగానే

  ప్రమోషన్స్ పూర్తి.. సందడిగానే

  అల్లరి నరేష్ నటించిన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు కూడా చేసింది. అలాగే, ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు చేసుకున్నారు. ఇక, శుక్రవారమే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  బీచ్‌లో అందాల తెర తీసేసిన శ్రీముఖి: అక్కడ ఆకును అడ్డుగా పెట్టి మరీ!

  అన్ని థియేటర్లలో నరేష్ ఫిల్మ్

  అన్ని థియేటర్లలో నరేష్ ఫిల్మ్

  అల్లరి నరేష్ నటించిన 'గాలోడు' సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. దీంతో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని నైజాంలో 150, సీడెడ్‌లో 60, ఆంధ్రా ప్రాంతంలోని అన్ని ఏరియాల్లో కలిపి 180 థియేటర్లలో విడుదల కాబోతుంది. అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 390, మిగిలిన ప్రాంతాల్లో కలిపి 510 థియేటర్లలో రాబోతుంది.

  నరేష్ మూవీ బిజినెస్ డీటేల్స్

  నరేష్ మూవీ బిజినెస్ డీటేల్స్

  ఫన్ అండ్ ఎమోషనల్ కంటెంట్‌తో రాబోతున్న 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీపై నరేష్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఫోకస్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలను కలుపుకుని మొత్తంగా ఈ సినిమాకు రూ. 4.00 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ సమాచారం.

  జాకెట్ తీసేసిన జబర్ధస్త్ వర్ష: హాట్ షోలో గీత దాటేసి మరీ రచ్చ

  ఎన్ని కోట్లు వస్తే హిట్ అంటే!

  ఎన్ని కోట్లు వస్తే హిట్ అంటే!

  నరేష్ నటించిన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాకు అతడి కెరీర్‌లోనే అత్యధికంగా రూ. 4.00 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు రూ. 4.50 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వసూలు చేస్తేనే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా విజయం సాధిస్తుంది. మంచి టాక్ వస్తే.. ఈ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.

  English summary
  Tollywood Talented Hero Allari Naresh Did Itlu Maredumilli Prajaneekam Movie Under A.R. Mohan Direction. Lets See This Movie Business and Theaters Count.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X