twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Itlu Maredumilli Prajaneekam: పాపం అల్లరి నరేష్.. 4 రోజుల్లో వచ్చింది అంతే, ఇక అది కష్టమేనా?

    |

    స్టార్ డైరెక్టర్, దివంగత ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా హీరోగా పరిచయం అయ్యాడు అల్లరి నరేష్. మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు ఈ కామేడీ హీరో. కామెడీ సినిమాలతో విశేషమైన గుర్తింపు సంపాదించుకున్న అల్లరి నరేష్ విభిన్నమైన చిత్రాలలో నటించి పాపులర్ అయ్యాడు. ఆయన నటించిన నేను, నాంది సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది.

    హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇప్పటికీ 50కిపైగా చిత్రాల్లో నటించి తనదైన శైలీలో సత్తా చాటుతున్నాడు. ఇక ఇటీవల కాలంలో కామేడీ చిత్రాలు తగ్గించి వైవిధ్యమైన కథలో ముందుకు వస్తున్నాడు. అలా వచ్చిందే 'ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం'. నవంబర్ 25న విడుదలైన ఈ సినిమా 4 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ పై ఓ లుక్కేద్దామా!

    అల్లరి నరేష్ విలక్షణ చిత్రం..

    అల్లరి నరేష్ విలక్షణ చిత్రం..

    కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా ప్రత్యేకమైన పాపులారిటీ సంపాందించుకున్నాడు అల్లరి నరేష్. ఆయ తాజాగా నటించిన విలక్షణ చిత్రమే 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని హస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ నిర్మించారు. ఇందులో ఆనంది హీరోయిన్‌గా నటించింది. శ్రీచరణ్ పాకాల దీనికి సంగీతం అందించగా ఇందులో ప్రవీణ్, వెన్నెల కిశోర్, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.

    ప్రీబిజినెస్ వివరాలు..

    ప్రీబిజినెస్ వివరాలు..

    అల్లరి నరేష్‌కు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రా, తెలంగాణలో మంచి మార్కెట్ ఉంది. దీనికితోడు 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 3.65 కోట్లు మేర బిజినెస్ అయింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను అన్ని ఏరియాల్లోనూ అత్యధిక థియేటర్లలో ప్రేక్షకుల కోసం ముందుకు తెచ్చారు.

    నాలుగో రోజు వచ్చిన వసూళ్లు..

    నాలుగో రోజు వచ్చిన వసూళ్లు..

    అల్లరి నరేష్ నటించిన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చిత్రానికి మంచి టాక్‌ వస్తోంది. అయితే అందుకు అనుగుణంగా కలెక్షన్లు మాత్రం రావడం లేదు. ఇలా మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 90 లక్షలు గ్రాస్, రెండో రోజు రూ. 81 లక్షలు, మూడో రోజు రూ. 70 లక్షలు గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం.. సోమవారం అయిన నాలుగో రోజు సగానికి తక్కువగా రూ. 30 లక్షలు గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

    4 రోజుల్లో కలెక్ట్ చేసింది..

    4 రోజుల్లో కలెక్ట్ చేసింది..

    కామెడీ స్టార్ అల్లరి నరేష్ మరోసారి విలక్షణ కథతో వచ్చిన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ వీకెండ్‌లో నిరాశ పరిచే వసూళ్లనే రాబట్టిందని చెప్పొచ్చు. ఏరియాల పరంగా చూస్తే.. 4 రోజుల్లో ఇది నైజాంలో రూ. 1.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 1.41 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా 4 రోజుల్లో ఈ చిత్రం రూ. 2.70 కోట్లు గ్రాస్, రూ. 1.42 కోట్లు షేర్ రాబట్టింది.

    ప్రపంచవ్యాప్తంగా వచ్చింది ఎంతంటే..

    ప్రపంచవ్యాప్తంగా వచ్చింది ఎంతంటే..

    నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 2.70 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు లేని కారణంగా పెద్దగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి దీనికి రూ. 16 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇలా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో రూ. 2.84 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 1.43 కోట్లు షేర్‌ వచ్చింది.

    ఇంకా ఎన్ని రోజులు పడుతుందో..

    ఇంకా ఎన్ని రోజులు పడుతుందో..

    అల్లరి నరేష్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చిత్రానికి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.65 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 4 రోజుల్లో రూ. 1.43 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 2.57 కోట్లు షేర్‌ను రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది. మరి ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇట్లు మారేడుపల్లి ప్రజానీకానికి కష్టమే అనిపిస్తోంది.

    English summary
    Allari Naresh Itlu Maredumilli Prajaneekam Movie 4 Days World Wide Box Office Collection Is Rs. 1.43 Cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X