X
కాదలి

కాదలి

Romance | 16 Jun 2017 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

కాదలి స్టోరీ

కాదలి సినిమా ట్రైయాంగులర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం ఇందులో నటించిన వారు పూజ కె. దోషి, హరీష్ కళ్యాణ్, సాయి రోహన్, డా మంజరి షర్మిల, గురురాజ్, మానేపల్లి, పల్లవి బానోత్, భాను అవిరినేని, సి సురేష్ కుమార్, సంధ్యా జనక్, రమాదేవి ముఖ్యపాత్రలు పోహిస్తున్నారు. ఈ సినిమాకి రచన-నిర్మాణం-దర్శకత్వం: పట్టాభి ఆర్ చిలుకూరి వహించారు మరియు సంగీతం ప్రసన్, ప్రవీణ్, శ్యామ్ కలిసి అందించారు.  కథ బాంధవి వరదరాజన్ (పూజా కే దోషి) ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో ఫిజియో థెరపిస్ట్. బాంధవికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన పెళ్లి చూపుల కార్యక్రమం బెడిసి కొడుతుంది. మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన పెళ్లిచూపులే చేదు అనుభవాన్ని మిగిల్చడంతో నిరాశకు గురవుతుంది. ఈ క్రమంలో కార్తీక్ (హరీష్ కల్యాణ్), క్రాంతి (సాయి రోనక్) అనే ఇద్దరు యువకులతో ఏర్పడిన పరిచయం గాఢమైన స్నేహంగా మారుతుంది. బాంధవి అంటే ఇద్దరికి ప్రేమ ఏర్పడుతుంది. వారిద్దరూ తమ ప్రేమను బాంధవికి వ్యక్తీకరించాలని ప్రయత్నాలు చేస్తారు. ఆ క్రమంలో కార్తీక్, క్రాంతి ఒకరిపై మరొకరు ద్వేషం పెంచుకొంటారు. బాంధవికి కార్తీక్, క్రాంతి తమ ప్రేమను ఎలా చెప్పారు. బాంధవిని ఒప్పించడానికి వారు చేసిన ప్రయత్నాలు ఏంటీ? ఈ వ్యవహారంలో బాంధవి, కార్తీక్, క్రాంతి పడిన మానసిక సంఘర్షణ ఏమిటీ. చివరికి బాంధవి కార్తీక్, క్రాంతిలలో ఎవరి ప్రేమను గెలుచుకొన్నది? ఇలాంటి ప్రశ్నలకు పరిష్కారమే కాదలి చిత్రం.
Read More

కాదలి కాస్ట్ & క్రూ

కాదలి సిబ్బంది సమాచారం

దర్శకత్వం పట్టాభి ఆర్ చిలుకూరి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ప్రసన్నన్, ప్రవీణ్ , ష్యామ్
నిర్మాత పట్టాభి ఆర్ చిలుకూరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కాదలి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కాదలి చిత్రం చాలా రెగ్యులర్ స్టోరీనే. ఇద్దరు స్నేహితుల ప్రేమ మధ్య నలిగిన ఓ అమ్మాయి ప్రేమ కథ. పెళ్లి చూపులు బెడిసి కొట్టిన ఓ అమ్మాయి తన నాన్నమ సలహా మేరకు తనకు నచ్చిన వరుడిని వెతుక్కునే సింగిల్ లైన్ కథను దర్శకుడు పట్టాభి సాగదీసి సాగదీసి చెప్పాడు. అయితే గతంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ ప్రేమకథ ప్రభావంతో దర్శకుడు కథ రాసుకొన్న విధానం బాగానే ఉంది. కానీ ఆయన ఎంచుకొన్న నటీనటుల ఎంపికే సరిగా లేదు. పెళ్లిచూపులు మాదిరిగా పేరులేని నటీనటులతో హిట్ కొడుదామనే ప్రయత్నం పట్టాభిలో కనిపిస్తుంది. ప్రతీ రోజు పండుగ కాదు అన్నట్టే.. తీసిన ప్రతీ సినిమా పెళ్లి చూపులు కాదు గదా. పెళ్లి చూపుల్లో ఇద్దరి మధ్య సంఘర్షణ ఉంటుంది. ప్రేమలో ఉద్వేగం, ఫీల్ ఉంటుంది. అందుకే పెళ్లి చూపులు చిత్రాన్ని తెరమీద చూడగానే ప్రేక్షకుడు కూడా లీనమైపోయాడు. కానీ కాదలి చిత్రంలో అలాంటి అంశాలు కనిపించవు. రెండో భాగానికి క్లిష్టమైన సమస్యను చూపించకుండానే ఇంటర్వెల్ కార్డు వేసేశాడు దర్శకుడు. రెండో భాగంలో ప్రేమికుల మధ్య సంఘర్షణను గొప్పగా చూపించాడా అంటే అదీ ఉండదు. పేలవమైన సీన్లు, నాసిరకమైన యాక్షన్ సీన్లు, ఆకట్టుకొని కథనం, హాస్యం ఇలాంటి అంశాలను కాదలిని సాదాసీదాగా మార్చేసాయి. రెండో భాగం ప్రారంభం కాగానే క్లైమాక్స్‌లో ఏమవుతుందో అనే విషయం సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమవుతుంది. దాంతో ఇక ఎండ్ టైటిల్ కార్డు ఎప్పుడు పడుతుందా అని వేచిచూడటం ప్రేక్షకుడి వంతుగా మారుతుంది. చివరకు ఇది సినిమాల కాకుండా షార్ట్ ఫిలిం చూసిన ఫిలింగ్ కలుగుతుంది.

కాదలి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కాదలి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+