»   » కేటీఆర్ పిలుపు... రామ్ చరణ్ హాజరు (కాదలి ఆడియో ఫంక్షన్ విశేషాలు)

కేటీఆర్ పిలుపు... రామ్ చరణ్ హాజరు (కాదలి ఆడియో ఫంక్షన్ విశేషాలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పూజా కె. దోషి, హ‌రీశ్ క‌ల్యాణ్‌, సాయి రోణ‌క్‌, సుద‌ర్శ‌న్‌, మోహ‌న్ రామ‌న్‌, డా. మంజేరి ష‌ర్మిల‌, గురురాజ్ మానేప‌ల్లి త‌దిత‌రులు న‌టించిన కాద‌లి మూవీ ఆడియో వేడుక మంగళవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.

ప‌ట్టాభి.ఆర్‌.చిలుకూరి స్వీయ నిర్మాణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇద్దరూ కలిసి ఆడియో రిలీజ్ చేసారు.


కేటీఆర్ మాట్లాడుతూ

కేటీఆర్ మాట్లాడుతూ

`ప‌ట్టాభి ఆర్‌. చిలుకూరి నా బాల్య మిత్రుడు. త‌న క‌ల ఈ చిత్రం. పొలిటిక‌ల్ లీడ‌ర్స్ వ‌స్తే ఈ సినిమా అంతగా జ‌నాల‌కు ఎక్క‌ద‌నే ఉద్దేశంతో మేం చ‌ర‌ణ్‌ని పిలిచాం. పిల‌వ‌గానే వ‌చ్చారు చ‌ర‌ణ్‌. సినిమా చాలా బాగా వ‌చ్చింది. అంతా కొత్త‌వారితో చేస్తున్న ఈ సినిమా చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. ట్రైల‌ర్ చాలా బావుంది. కొన్ని సినిమాలు ఇటీవ‌ల బాగా ఆడుతున్నాయి. పెళ్లిచూపులు లాంటివి బెంచ్ మార్క్ గా నిలుస్తున్నాయి. కంటెంట్ కింగ్‌లాగా ఉంది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాల‌ని భావిస్తున్నాం అన్నారు.


టాక్స్ తగ్గింపు కోసం...

టాక్స్ తగ్గింపు కోసం...

బాహుబ‌లి2 తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటింది. కేలిఫోర్నియాలో లోక‌ల్ గేమింగ్ కంపెనీ వాళ్లు ఆ సినిమా గురించి మాట్లాడ‌టం గ్రేట్‌. ఒక దేశానికి ఒక ట్యాక్స్ అనేది మంచిదే. కానీ సంస్కృతి, స్వ‌రూపాలు అనేవి కాపాడుకోవాలంటే 28 శాతం పెడితే కుద‌ర‌ద‌ని చాలా మంది అంటున్నారు. ఈ మ‌ధ్య క‌మల్‌హాస‌న్‌గారు కూడా దీని గురించి చెప్ప‌డం విన్నాను. ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ క‌లిసి అరుణ్‌జైట్లీగారిని క‌లుద్దాం, సినిమా రంగంపై జిఎస్టీ టాక్స్ తగ్గించేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుదామని కేటీఆర్ అన్నారు.


థాంక్స్ చెప్పిన రామ్ చరణ్

థాంక్స్ చెప్పిన రామ్ చరణ్

రామ్‌ఛ‌ర‌ణ్ మాట్లాడుతూ ``దాస‌రిగారు చ‌నిపోయిన త‌ర్వాత జ‌రుగుతున్న పెద్ద ఫంక్ష‌న్ ఇది కాబ‌ట్టి అంద‌రం ఒక నిమిషం మౌనం పాటిద్దాం. మిస్ యూ దాస‌రిగారు. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే న‌న్ను ఈ కార్య‌క్ర‌మానికి పిలిచిన కేటీఆర్‌గారికి ధ‌న్య‌వాదాలు. సురేశ్‌గారు జీఎస్‌టీ గురించి చెప్ప‌గానే స్పందించినందుకు కేటీఆర్‌గారికి ధ‌న్య‌వాదాలు. నా కెరీర్‌లో మోస్ట్ ఫేవ‌రేట్ చిత్రం నా కెరీర్‌లో ఆరంజ్‌. అలాంటి సినిమాను మ‌ర‌లా మ‌ర‌లా చేయాల‌ని అనుకుంటాను. అలాంటి క‌ళ‌, క‌ల‌ర్స్ ఉన్న ఈ సినిమా ఎక్కువ ఆద‌ర‌ణ పొందుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. ప్యాష‌న్‌ని న‌మ్మి చేస్తున్న ప‌ట్టాభికి కంగ్రాట్స్. నా తొలి సినిమాలో కూడా నేను ఇంత బాగా చేయ‌లేదేమో. వాళ్లు అంత బాగా చేశారు.`` అని చెప్పారు.


సురేశ్‌బాబు మాట్లాడుతూ...

సురేశ్‌బాబు మాట్లాడుతూ...

మేం ఏం అడిగినా కేటీఆర్‌గారు చేస్తారు. జీఎస్‌టీ ప్రాబ్ల‌మ్ ఉంద‌ని గ‌త సారి చెప్పిన‌ప్పుడు వెంటనే అరుణ్ జైట్లీ ద‌గ్గ‌రికి తీసుకెళ్లారు. ఇప్పుడు సినిమాకి జీఎస్‌టీని 28 శాతానికి పెంచారు. దీని వ‌ల్ల ప్రాంతీయ భాషా చిత్రాలకు ప‌లు ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఈ విష‌యంలో పెద్ద‌, చిన్న చిత్రాల‌కు ఒకే ర‌క‌మైన శాతం కాకుండా, ప్రాంతీయ చిత్రాల‌కు మ‌రోలా ఉంటే బావుంటుంది. తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ఎప్ప‌టినుంచో మ‌ద్ద‌తిస్తున్న కేటీఆర్‌గారు ఈ విష‌యంలోనూ స‌హ‌క‌రించాలి అన్నారు.English summary
Kaadhali Telugu Movie Audio Launch held at hyderabad. Starring Pooja K Doshi, Harish Kalyan, Sai Ronak, Sudarshan, Mohan Raman, Dr Manjeri Sharmila, Gururaj Manepalli, Pallavi Banothu, Bhanu Avirineni, C Suresh Kumar, Sandhya Janak, Ramadevi. Kaadhali is a triangular love story film written, directed and produced by Pattabhi R. Chilukuri while Prasan Praveen Shyam scored music for this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu