X
తెలుగు » సినిమాలు » కుందనపు బొమ్మ
కుందనపు బొమ్మ

కుందనపు బొమ్మ

Comedy | Romance | 24 Jun 2016 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

కుందనపు బొమ్మ స్టోరీ

కుందనపు బొమ్మ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు చాందిని చౌదరి, సుధాకర్ కొమకుల, సుధీర్ వర్మ, రాజివ్ కనకాల, నాగినీడు, శకలక శంకర్, జాన్సీ తదిరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వర ముళ్ళపూడి నిర్వహించారు మరియు నిర్మాతలు జి అనిల్ కుమార్ రాజు, జి వంశి కృష్ణా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చరు. కథ విజయనగరం దగ్గర ఓ పల్లెటూళ్లో ఉండే... మహదేవరాజు (నాగినీడు)ది మాటంటే మాటే. ఆ ముద్దుల కుమార్తే సుచి (చాందిని చౌదరి) . ప్రాణానికి ప్రాణంలా చూసుకునే ఆమెను పుట్టినప్పుడే తన మేనల్లుడు గోపి (సుధాకర్‌)కి ఇచ్చి చేయాలని ఫిక్స్ చేసి ప్రకటించేస్తాడు. అయితే తండ్రి చాటు పిల్లలా బిల్డప్ ఇచ్చే సుచి బయిటకు వస్తే బస్తేమే సవాల్ అనే అల్లరి పిల్ల. అల్లరిలో భాగంగా ఓ దొంగతనం చేస్తూండగా వాసు (సుధీర్‌ వర్మ) చూస్తాడు. అంతే అమాంతం అలాగే ప్రేమలో పడిపడి, ఆమెను పడేసే ప్రయత్నాలు చేస్తాడు. వీళ్ల ప్రేమ వ్యవహారం గమనించిన ఆమె బావ గోపి కూడా సపోర్ట్ చేస్తాడు. అంతవరకూ బాగానే ఉన్నా..హఠాత్తుగా ఓ ట్విస్ట్ వచ్చి ఈ ప్రేమ కథలో పడుతుంది. గోపీ ..ఎట్టిపరిస్దితుల్లో ...సుచినే చేసుకుంటాను అని ఇంట్లో ప్రకటిస్తాడు. అతను అలా అనటానికి కారణం ఏమిటి..అసలు ఈ ప్రేమ కథకు ముగింపు ఏమిటి...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.   
Read More

కుందనపు బొమ్మ కాస్ట్ & క్రూ

కుందనపు బొమ్మ సిబ్బంది సమాచారం

దర్శకత్వం వర ముల్లపూడి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి
నిర్మాత జి అనిల్ కుమార్ రాజు, జి వంశి కృష్ణా
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కుందనపు బొమ్మ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఈ సినిమాలో కొద్దిగానే నవ్వించినా కామెడీ ఉంది. రొమాన్స్ కూడా ఉంది. అయితే ఈ రెండింటిని నిలబెట్టే ఎమోషనే మిస్సైంది. అలాగే కథ,కధనం ఈ రోజుల్లో జరుగుతున్నట్లు అనిపించదు. రాజేంద్రప్రసాద్ సినిమాలు వస్తున్న రోజుల్లో రెడీ చేసిన సినిమాలా అనిపిస్తుంది. తెలుగుతనం గుప్పించాలని చుట్టూ ఉన్న ఆధునిక ప్రపంచాన్ని కథకు ముడేయకపోవటం వల్ల వచ్చిన సమస్య అయ్యిండవచ్చు. పల్లెటూరు అందాలు అవీ చక్కగా చూపించిన ఈ సినిమా ..ఫస్టాఫ్ బాగానే ఉందనిపించినా సెకండాఫ్ లో నీరసపరుస్తుంది. ఎంతకీ అవదే అనే ఫీలింగ్ ని కొద్ది సేపు తీసుకువస్తుంది. కథలో ఏదైతే కాంప్లిక్ట్ ఉందో అది ఇంటర్వెల్ కు కూడా రాలేదు. సెకండాఫ్ లో రివీల్ అయ్యింది. కాంప్లిక్ట్ లేని కథని హీరో డ్రైవ్ చేయటం కష్టమే. అలాగే క్లైమాక్స్ ఊహకు అందేస్తుంది.

కుందనపు బొమ్మ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కుందనపు బొమ్మ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+