»   » అచ్చ తెలుగు బొమ్మే కానీ.. ('కుందనపు బొమ్మ' రివ్యూ)

అచ్చ తెలుగు బొమ్మే కానీ.. ('కుందనపు బొమ్మ' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

ప్రస్తుతం లోబడ్జెట్ సినిమాల సీజన్ నడుస్తోంది. బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి భారీ చిత్రాలు భాక్సాఫీస్ వద్ద బోర్లా పడిన ఈ సమయంలో చిన్న బడ్జెట్ చిత్రాలు ఏ మాత్రం బాగున్నా... సినిమా పెద్ద హిట్టయ్యే ఛాన్స్ ఉందని రీసెంట్ హిట్స్ ప్రూవ్ చేస్తున్నాయి. అయితే ఈ చిన్న చిత్రాల్లో స్టార్స్ ఎలాగూ ఉండరు. పోనీ అంత అద్బుతంగా కట్టిపారేసే కథ, కథనం అయినా ఉందా వెతుకుతారు. అదీ లేకపోతే ఆ బొమ్మ ..ఎక్సపైరీ డేట్ అయిపోయినట్లే.

ఎన్టీఆర్ తో నా అల్లుడు, అల్లరి నరేష్ తో విశాఖ ఎక్సప్రెస్ చిత్రాలు డైరక్ట్ చేసిన వరా ముళ్లపూడి గ్యాప్ తీసుకుని చేసి, దాదాపు కొత్తవాళ్లు వంటి కాస్టింగ్ తో చేసిన చిత్రం ఇది. రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందిన ఈ చిత్రం రొమాన్స్, కామెడీ రెండూ తక్కువే అనిపిస్తాయి. అయితే చాలాకాలం తర్వాత ఓ అచ్చ తెలుగు సినిమా చూసిన అనుభూతిని ఇవ్వాలనే ఆలోచనతో చేసిన ఈ ప్రయత్నం మాత్రం కొట్టిపారేయాల్సింది మాత్రం కాదు.


కథలోకి వెళితే.... విజయనగరం దగ్గర ఓ పల్లెటూళ్లో ఉండే... మహదేవరాజు (నాగినీడు)ది మాటంటే మాటే. ఆ ముద్దుల కుమార్తే సుచి (చాందిని చౌదరి) . ప్రాణానికి ప్రాణంలా చూసుకునే ఆమెను పుట్టినప్పుడే తన మేనల్లుడు గోపి (సుధాకర్‌)కి ఇచ్చి చేయాలని ఫిక్స్ చేసి ప్రకటించేస్తాడు. అయితే తండ్రి చాటు పిల్లలా బిల్డప్ ఇచ్చే సుచి బయిటకు వస్తే బస్తేమే సవాల్ అనే అల్లరి పిల్ల. అల్లరిలో భాగంగా ఓ దొంగతనం చేస్తూండగా వాసు (సుధీర్‌ వర్మ) చూస్తాడు.


kunda

అంతే అమాంతం అలాగే ప్రేమలో పడిపడి, ఆమెను పడేసే ప్రయత్నాలు చేస్తాడు. వీళ్ల ప్రేమ వ్యవహారం గమనించిన ఆమె బావ గోపి కూడా సపోర్ట్ చేస్తాడు. అంతవరకూ బాగానే ఉన్నా..హఠాత్తుగా ఓ ట్విస్ట్ వచ్చి ఈ ప్రేమ కథలో పడుతుంది. గోపీ ..ఎట్టిపరిస్దితుల్లో ...సుచినే చేసుకుంటాను అని ఇంట్లో ప్రకటిస్తాడు. అతను అలా అనటానికి కారణం ఏమిటి..అసలు ఈ ప్రేమ కథకు ముగింపు ఏమిటి...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ఈ సినిమాలో కొద్దిగానే నవ్వించినా కామెడీ ఉంది. రొమాన్స్ కూడా ఉంది. అయితే ఈ రెండింటిని నిలబెట్టే ఎమోషనే మిస్సైంది. అలాగే కథ,కధనం ఈ రోజుల్లో జరుగుతున్నట్లు అనిపించదు. రాజేంద్రప్రసాద్ సినిమాలు వస్తున్న రోజుల్లో రెడీ చేసిన సినిమాలా అనిపిస్తుంది. తెలుగుతనం గుప్పించాలని చుట్టూ ఉన్న ఆధునిక ప్రపంచాన్ని కథకు ముడేయకపోవటం వల్ల వచ్చిన సమస్య అయ్యిండవచ్చు.


పల్లెటూరు అందాలు అవీ చక్కగా చూపించిన ఈ సినిమా ..ఫస్టాఫ్ బాగానే ఉందనిపించినా సెకండాఫ్ లో నీరసపరుస్తుంది. ఎంతకీ అవదే అనే ఫీలింగ్ ని కొద్ది సేపు తీసుకువస్తుంది. కథలో ఏదైతే కాంప్లిక్ట్ ఉందో అది ఇంటర్వెల్ కు కూడా రాలేదు. సెకండాఫ్ లో రివీల్ అయ్యింది. కాంప్లిక్ట్ లేని కథని హీరో డ్రైవ్ చేయటం కష్టమే. అలాగే క్లైమాక్స్ ఊహకు అందేస్తుంది.


ఇక సినిమాలో హైలెట్స్ విషయానికి వస్తే చాందిని చౌదరి, తను షార్ట్ ఫిల్మ్ లు చేసిన అనుభవంతో కాబోలు ఎక్కడా కొత్త హీరోయిన్ అనే ఫీలింగ్ రాకుండా చేసుకుంటూ పోయింది. సుధాకర్ మంచి ఆర్టిస్టు అని ఆల్రెడీ ప్రూవ్ డ్. సుధీర్ వర్మ కూడా బాగా చేసాడు. అయితే షకలక శంకర్ కామెడీనే విసిగిస్తుంది. రాజీవ్ కనకాల ఎపిసోడ్స్ బాగానే పండాయి. కీరవాణి ఈ కథకు ఇన్సప్రైర్ అవలేదో ఏమో కానీ సంగీతం సోసో గా ఉంది.


సినిమా హైలెట్స్ లో కెమెరామె న్ గా ఎక్కువ మార్కులు పడతాయి. టెక్నికల్ గా కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ సెకండాఫ్ లో మరింత షార్ప్ గా ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. దర్శకుడుగా ముళ్లపూడి వరా...వంక పెట్టడానికి లేదు కానీ ప్రత్యేకంగా చెప్పుకునే మెరుపులు మాత్రం మెరిపించలేకపోయారు. నిర్మాణవిలువలు బాగున్నాయి.


సంస్థ: ఎస్‌.ఎల్‌.ఎంటర్టైన్‌మెంట్స్‌,
నటీనటులు: చాందిని చౌదరి, సుధాకర్‌ కొమాకుల, సుధీర్‌ వర్మ, నాగినీడు, షకలక శంకర్‌,రాజీవ్‌ కనకాల, ఝాన్సీ తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి,
ఛాయాగ్రహణం: ఎస్‌.డి.జాన్‌,
సంభాషణలు: అనురాధా ఉమర్జీ.గౌతమ్‌ కాశ్యప్‌,
సమర్పణ: కె.రాఘవేంద్రరావు,
నిర్మాతలు: జి.అనిల్‌ కుమార్‌ రాజు.. జి.వంశీకృష్ణ,
దర్శకత్వం: వర ముళ్లపూడి
విడుదల తేదీ: 24-06-2016.


ఫైనల్ గా సినిమా అద్బుతం కాదు కానీ ఓ సాయింత్రం.... హింస, అసభ్యత లేని సినిమా.. ఫ్యామిలీస్ తో చూడాలనుకుంటే ఓకే అనిపిస్తుంది. ఈ సినిమాకు పబ్లిసిటీ పెంచితే...కాస్త జనాల్లోకి వెళ్లే అవకాసం ఉంది.

English summary
Chandini Chowdary, Sudheer Varma, and Sudhakar Komakula as the main leads, the movie Kundanapu Bomma was directed by Vara Mullapudi. Under the production of K Raghavendra Rao, music is composed by MM Keeravani. Here is the review of the movie "Kundanapubomma".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu