»   » అందంగా ఉంది: 'కుందనపు బొమ్మ' ట్రైలర్‌ విడుదల (వీడియో)

అందంగా ఉంది: 'కుందనపు బొమ్మ' ట్రైలర్‌ విడుదల (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: చాందినీ చౌదరి, సుధాకర్‌ కొమాకుల ప్రధాన పాత్రల్లో వార ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కుందనపు బొమ్మ'. ఈ చిత్రం ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఎస్‌.ఎల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఆ ట్రైలర్ ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఎస్.ఎల్.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ముళ్లపూడి వర దర్శకత్వంలో జి.అనీల్‌కుమార్‌రాజు, జి.వంశీకృష్ణ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘కుందనపు బొమ్మ'.

సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ.... ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించే కథ, కథనంతో ఈ చిత్రం రూపొందిందని, ఆ కుందనపుబొమ్మ ఎవరిని వరిస్తుంది అన్న ఆసక్తికర అంశంతో సినిమా సాగుతుందని తెలిపారు.

బాపు రమణల కుటుంబ సభ్యులు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని, ఈ సినిమా పేరు చూస్తే బాపు బొమ్మ కదిలివచ్చినట్లు ఉందని దర్శకుడు కె.రాఘవేంద్రరావు తెలిపారు.

Mullapudi Vara's Kundanapu Bomma Theatrical Trailer

సంవత్సరంన్నర కాలంగా ఈ చిత్రం కోసం కృషి చేస్తున్నామని, 43కథలు చెప్పినా రాఘవేంద్రరావుకు నచ్చకపోతే ఈ కథ 44వ కథగా చెప్పానని, ఆయన సమర్పణలో ఈ చిత్రం రావడం ఆనందంగా ఉందని దర్శకుడు ముళ్లపూడి వర తెలిపారు. ఓ పల్లెటూరి కుటుంబ ప్రేమకథా చిత్రంగా బొబ్బిలి, విజయనగరం, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

కుటుంబ కథాచిత్రంగా రూపొందిన కుందనపు బొమ్మ అందరికీ మంచి పేరు తెస్తుందన్న నమ్మకం ఉందని సుధాకర్ కొమాకుల తెలిపారు.

హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ- ఓ గొప్ప సంస్థతో తెలుగుతెరకు హీరోయిన్ గా పరిచయం కావడం ఆనందంగా ఉందని తెలిపారు.

ఈ చిత్రానికి మాటలు: అనురాధ ఉమర్జీ, గౌతమ్ కశ్యప్, పాటలు: ఆరుద్ర, శివశక్తిదత్త, అనంత్ శ్రీరామ్, కెమెరా: ఎస్.డి.జాన్, నిర్మాతలు: జి.అనీల్‌కుమార్ రాజు, జి.వంశీకృష్ణ,దర్శకత్వం: ముళ్ళపూడి వర.

English summary
The trailer of the latest upcoming film ‘Kundhanapu Bomma’ was released with legendary director K. Raghavendra Rao as a presenter . Sudhakar Komakula, Sudhir Varma and Chandini Chowdary are playing the lead roles for the film. This film is a good youthful love story on a village backdrop.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu