Just In
- 27 min ago
మాస్ మహారాజా బర్త్ డే గిఫ్ట్.. ఖిలాడితో మరో హిట్ కొట్టేలా ఉన్నాడు
- 42 min ago
Box office: ఇదే ఆఖరి రోజు.. ఆ ఇద్దరికి తప్పితే అందరికి లాభాలే, టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
- 2 hrs ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 2 hrs ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
Don't Miss!
- Finance
మిసెస్ బెక్టార్స్ అధినేతకు, జోహో వ్యవస్థాపకుడికి పద్మశ్రీ
- News
శకటాల పరేడ్ వర్సెస్ ట్రాక్టర్ల నిరసన ప్రదర్శన: గణతంత్ర చరిత్రలో తొలిసారిగా: అసలు నిర్వచనం
- Sports
పంత్ 2.O: 4 నెలల్లో 10 కిలోలు తగ్గి.. గేమ్, మైండ్‌సెట్ మార్చుకున్న రిషభ్!
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరణించిన హీరో ని మళ్ళీ బతికించాడు..... ట్రైలర్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది
అమ్మోరు, అరుంధతి వంటి విజువల్ వండర్స్‌ని రూపొందించిన శత చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న మరో అద్భుత చిత్రం 'నాగభరణం'. కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్థన్‌ను ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌తో క్రియేట్ చేయడం అనేది ఒక వండర్ అని అందరూ ప్రశంసించడం విశేషం. 40 కోట్ల భారీ బడ్జెట్‌తో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పెన్ మూవీస్, ఇన్‌బాక్స్ పిక్చర్స్, బ్లాక్‌బస్టర్ స్టూడియో పతాకాలపై జయంతి లాల్ గాడా, సాజిద్ ఖురేషి, సొహైల్ అన్సారీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సొంతం చేసుకున్నారు. స్టూడియో గ్రీన్ కె.ఇ. జ్ఞానవేల్‌రాజా సమర్పణలో 'నాగభరణం' చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో గ్రాండ్‌గా రిలీజ్‌కి రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఉపేంద్ర హీరోగా రీమేక్ చేశారు:
ఏడేళ్ల క్రితం మరణించిన కన్నడ స్టార్ హీరో విష్ణు వర్ధన్ హీరోగా ఓ సినిమాను రూపొందించాడు కోడి రామకృష్ణ. 2009 లో చనిపోయిన కన్నడ హీరో విష్ణువర్థన్ తో మూవీ చేస్తున్నాడు అన్న మాటే అందర్నీ ఆశ్చర్యం లో ముంచెత్తింది. ఈ మూవీని కన్నడంలోనే తీస్తున్నాడు. విష్ణువర్థన్ కన్నడలో అప్పట్లో స్టార్ హీరో. 1972లో విష్ణువర్థన్ హీరోగా నాగర హావు సినిమా వచ్చింది. ఆ తరువాత అదే మూవీని ఉపేంద్ర హీరోగా రీమేక్ చేశారు.

నాలుగు భాషల్లో :
ఇప్పుడు మరోసారి అదే సినిమాను మళ్ళీ విష్ణవర్థన్ హీరోగా నాగరాహువు అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నాడు కోడి రామకృష్ణ . తెలుగులో నాగభరణం అనే టైటిల్ తో ఈ చిత్రం విడుదల కానుంది. నటి రమ్య, డిగంత్, రాజేశ్, వివేక్ ఉపాధ్యాయ్, ముకుల్ దేవ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గురుకిరణ్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, కన్నడం భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని తమిళం, హిందీ భాషల్లోనూ అనువాదం చేసి ఏకకాలంలో నాలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

576 మంది గ్రాఫిక్స్ నిపుణులు :
మరణించిన వారితో సినిమా ఎలా తీస్తారు? అనే అనుమానం అందరికీ రావచ్చు. అయితే ఈ అద్భుతాన్ని, ఈ సాహసాన్ని కోడి రామకృష్ణ గ్రాఫిక్స్ సహాయంతో చేయబోతున్నాడు. విష్ణువర్ధన్ రూపాన్ని మళ్లీ తెర మీద చూపించడానికి ఏడు దేశాలకు చెందిన 576 మంది గ్రాఫిక్స్ నిపుణులు 730 రోజుల పాటు కష్టపడ్డారట. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

24 గంటల్లో రెండు లక్షల మంది:
కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్థన్‌ను ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌తో క్రియేట్ చేయడం అనేది ఒక వండర్ అని అందరూ ప్రశంసించడం విశేషం. రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్ వండర్‌గా రూపొందిందీ చిత్రం. ఈ సినిమా తెలుగులో నాగభరణం పేరుతో రిలీజవుతోంది. లేటెస్టుగా కొత్త ట్రైలర్ ఆన్‌లైన్‌లోకొచ్చింది. ఈ ట్రైలర్‌ను కేవలం 24 గంటల్లో రెండు లక్షల మంది వీక్షించారని నిర్మాతలు చెబుతున్నారు.

మకుట గ్రఫిక్సే
బాహుబలి "మకుట" నే: సాండల్ వుడ్ గ్లామర్ బ్యూటి రమ్య, సాయికుమార్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో గ్రాఫిక్స్, సాహస సింహ విష్ణువర్దన్ లుక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.'బాహుబలి' చిత్రానికి అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌ని క్రియేట్ చేసిన మకుట ఈ చిత్రానికి కూడా వండర్‌ఫుల్ విజువల్ ఎఫెక్ట్స్‌ని చేస్తున్నారు.

40 కోట్ల భారీ బడ్జెట్:
ఆ విజువల్ ఎఫెక్ట్స్ చాలా అద్బుతంగా ఉండనున్నాయని టాక్. కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్థన్‌ను ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌తో క్రియేట్ చేయడం ఓ వండర్ అని అందరూ ప్రశంసించడం విశేషం. 40 కోట్ల భారీ బడ్జెట్‌తో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్ వండర్‌గా కన్నడ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ మధ్యనే విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది, ఇప్పుడు ట్రైలర్ కూడా అదే బాటలో ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

తెలుగు, కన్నడం భాషల్లో :
తెలుగులో నాగభరణం అనే టైటిల్ తో ఈ చిత్రం విడుదల కానుంది. నటి రమ్య, డిగంత్, రాజేశ్, వివేక్ ఉపాధ్యాయ్, ముకుల్ దేవ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గురుకిరణ్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, కన్నడం భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని తమిళం, హిందీ భాషల్లోనూ అనువాదం చేసి ఏకకాలంలో నాలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.
120 అడుగుల శివనాగం:
ఇక ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడు చూడనటువంటి 120 అడుగుల శివనాగం అబ్బుర పరుస్తుందని అంటున్నారు. తాజాగా నాగభరణం సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేయగా ఇందులోని గ్రాఫిక్స్ అభిమానులని ఆశ్యర్యచకితులన్ని చేస్తుంది. అరుంధతి, అమ్మోరు, అంజి వంటి సినిమాలు ప్రయోగాత్మక దర్శకుడిగా కోడి రామకృష్ణ కెరీర్ లో కీర్తి కిరీటాలు. ఇప్పుడు ఈ డైరెక్టర్ చనిపోయిన ఒక హీరోతో కొత్త ప్రయోగం చేస్తున్నాడు.. మరి ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.