X
తెలుగు » సినిమాలు » ఉత్తమ విలన్
ఉత్తమ విలన్

ఉత్తమ విలన్

Comedy | Romance | 02 May 2015 |
Telugu

2.6 /5 Users

2 /5 Filmibeat

ఉత్తమ విలన్ స్టోరీ

ఉత్తమ విలన్ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కమల్ హాసన్, ఆండ్రియా జరెమైహ్, పూజా కుమార్, పార్వతి మీనన్, కె బాలచందర్, కె విశ్వనాథ్, జయరామ్, పర్వథ్య నాయర్, నాజర్, ఎమ్ ఎస్ భాస్కర్, ఉర్వసి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రమేష్ అరవింద్ నిర్వహించారు మరియు నిర్మాత సి కళ్యాణ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గిబ్రాణ్ స్వరాలు సమకుర్చారు. కథ మనోరంజన్(కమల్ హాసన్) ఓ పెద్ద స్టార్. అతని కెరీర్ వెనక...మార్గదర్శి (కె.బాలచందర్), తనని స్టార్ ని చేసిన నిర్మాత పూర్ణ చంద్రరావు(కె విశ్వనాధ్) ఉంటారు. మనోరంజన్...ఓ దశలో తను ప్రేమించిన యామినని కాదని, పూర్ణ చంద్రరావు కుమార్తె వరలక్ష్మి(ఊర్వశి)ని వివాహం చేసుకుంటాడు. జీవతం పూలవానలా సాగిపోతున్న సమయంలో ఊహించని విధంగా అతనికి బ్రెయిన్ ట్యూమర్ అనే విషయం బయిటపడుతుంది. ఎంతో కాలం బ్రతకలేనని తెలుసుకున్న మనోరంజన్..చివరగా తన మార్గదర్శి దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలని కోరుకుంటాడు. ఆ ఆఖరి చిత్రం చూసినవారు సంతోషంగా బయిటకువెళ్లాలని అడుగుతాడు. అలా తెయ్యమ్ కళ నేపధ్యంలో మృత్యుంజయుడిగా మారిన ఉత్తముడు కథ తెరకెక్కించాలని నిర్ణయించుకుంటారు. సినిమాలో సినిమా మొదలవుతుంది. మరణానికి దగ్గరవుతున్న మనోరంజన్...మృత్యుంజయుడి కథని ఎలా పూర్తి చేసాడు. ఆ క్రమంలో ఎదురైన సవాళ్లు ..అనుభవాలు ఏమిటి..ఇంతకీ ఆ ఉత్తముడు కథేంటి...అనేది తెలుసుకోవాలంటి ఈ చిత్రం చూడాల్సిందే.
Read More

ఉత్తమ విలన్ కాస్ట్ & క్రూ

ఉత్తమ విలన్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం రమేష్ అరవింద్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గిబ్రాన్
నిర్మాత సి కళ్యాణ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఉత్తమ విలన్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ప్రతి ఒక్కరిలోనూ విలన్‌ ఉంటారు. ఆయా పరిస్థితులే వాళ్లని విలన్‌లుగా మారుస్తాయి. ఎవరి దృష్టిలో ఎప్పుడెవరు ఎలా కనిపిస్తారన్నదే జీవితం. ముఖ్యంగా కళాకారుడు మృత్యుంజయుడు అని కమల్ చెప్పాలన్న తాపత్రయం ఇందులో కనపడుతుంది. ఈ సినిమాలో ఉత్తమన్‌ అనే 8వ శతాబ్ధం నాటి కళాకారుడి పాత్రలో, మనోరంజన్‌ అనే 21వ శతాబ్ధపు సినిమా స్టార్‌ పాత్రలో కమలహాసన్‌ ఒదిగిపోయి నటించారు. అందుకు కమల్ కి ఎవరూ సాటి రారు అని మరోసారి విజిల్ వేసి మరీ చెప్పాలనిపిస్తుంది. అయితే వచ్చిన చిక్కల్లా ఆయన గెటప్ ల మీద, స్టోరీ ఐడియా మీద పెట్టి శ్రద్ద కథనం పై పెట్టలేకపోతున్నారు. తను అనుకున్న లేదా తన దగ్గర ఉన్న లేదా తను పోగుచేసిన అనేకానేక అంశాలను తన దగ్గర ఉన్న కథలో కలిపేసి, ఒకదానికొకటి ముడిపెట్టాలని చూడటం, వాటిని ఓ ఐడియా ద్వారా కలిపి ఉంచాలని ప్రయత్నం ప్రతీసారి చేస్తున్నారు. అయితే అది విజయవంతంగా జరగటం లేదు.

ఉత్తమ విలన్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

ఉత్తమ విలన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+