»   » రీమేక్ చేయటంలేదంటూ కమల్

రీమేక్ చేయటంలేదంటూ కమల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కమల్ హాసన్ రీసెంట్ గా... 'పీకే' రీమేక్ కమిటయ్యాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చేయటం లేదని సమాచారం. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ వారు కలిసి ఆఫర్ చేసారు కానీ కమల్ తిరస్కరించారని తెలుస్తోంది. కమల్ గతంలో మున్నాభాయ్ ఎంబిబియస్ ని వసూలు రాజా ఎమ్.బి.బిస్ అంటూ చేసారు. అయితే అప్పట్లో అది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత ఆయన లగేరహో మున్నాభాయ్ చిత్రం రీమేక్ సైతం ఆసక్తి చూపలేదు.

కమల్ తాజా చిత్రం విషయానికి వస్తే...

తెయ్యమ్‌ కళాకారుడిగా, సినిమా నటుడిగా కమల్‌హాసన్‌ రెండు పాత్రల్లో నటించిన సినిమా ‘ఉత్తమ విలన్‌'. ఈ చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. లింగుస్వామి నిర్మిస్తున్నారు. పూజాకుమార్‌, ఆండ్రియా, పార్వతి హీరోయిన్లు. రమేష్‌ అరవింద్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా ఇది. ఏప్రియల్ 2 న ‘ఉత్తమ విలన్‌'ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను కేరళలో శ్రీ కాళి ఈశ్వరి ఫిల్మ్స్‌ విడుదల చేస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత లింగు స్వామి అఫీషియల్ గా ఖరారు చేసారు. ఈ చిత్రం ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని ఆయన చెప్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ చిత్రలో కమల్‌హాసన్‌ గురువైన స్వర్గీయ బాలచందర్‌తో పాటు కళాతపస్వీ కె.విశ్వనాథ్‌లు ముఖ్య పాత్ర పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్‌ తెయ్యమ్‌ కళాకారుడిగా, నటుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. బాలచందర్‌ నటించిన చివరిచిత్రం కావడంతో ఈ చిత్రం ఆయనకు అంకితం ఇస్తున్నారు. కమల్‌ నటిస్తున్న మరో చిత్రం ‘విశ్వరూపం-2' కూడా దాదాపు షూటింగు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమౌతుంది.

Kamal not interested on PK

చిత్ర దర్శకుడు రమేష్‌ అరవింద్‌ మాట్లాడుతూ ‘‘ఇందులో కమల్‌హాసన్‌గారు రెండు పాత్రల్లో కనిపిస్తారు. ఎనిమిదో శతాబ్దానికి చెందిన తెయ్యమ్‌ ఆర్టిస్ట్‌ (ప్రత్యేకమైన మేకప్‌తో కేరళలో ప్రదర్శించే పురాతన కళ)గా, సినిమా ఆర్టిస్ట్‌గా రెండు పాత్రల్లోనూ మెప్పిస్తారు. తెయ్యమ్‌ ఆర్టిస్ట్‌గా నటించడానికి ఆయన ఎక్కువగా శ్రమించారు. ఆ పాత్రకు మేకప్‌ వేసుకోవడానికి దాదాపు నాలుగు గంటలు పట్టేది. కె.బాలచందర్‌, కె.విశ్వనాథన్‌ ఇందులో కీలక పాత్రలను పోషించారు. వాళ్లను దర్శకత్వం వహిస్తూ చాలా విషయాలను నేర్చుకున్నాను'' అని తెలిపారు.

యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌ నటనకు పెట్టింది పేరు. కమల్‌ నటనను చూసిన ఎవరైనా ముక్కున వేలు వేసుకోవాల్సిందే. యాక్టింగే ప్రాణంగా భావించే కమల్‌ ప్రస్తుతం ‘ఉత్తమవిలన్‌' చిత్రంలో విభిన్న పాత్రలు పోషించారు. తాజాగా సంక్రాంతి కానుకగా ‘ఉత్తమవిలన్‌' ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో కమల్‌హాసన్‌ దాదాపు ఆరు వేషాలతో కనిపించి అలరించాడు. ఈ సినిమాలో ఆయన గురువు క్రీ.శే. బాలచందర్‌గారు కీలకపాత్రలో నటించినట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది.

సినిమానే ఊపిరిగా భావించే కమల్‌ ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించాలనే ప్రయత్నం చేస్తారు. ఆయన నటించిన ‘విశ్వరూపం', ‘దశవతారం' చిత్రాల్లో ఎలాంటి పాత్ర పోషించారో చెప్పాల్సిన పనిలేదు. ఈ లోకనాయకుడు వేసిన ప్రతి పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ‘ఉత్తమవిన్‌'' చిత్రంలో బాలచందర్‌తోపాటు కళాతపస్వీ కె.విశ్వనాథ్‌ కూడా ఓ పాత్రలో నటించారు. ఈ చిత్రానికి కమల్‌ మిత్రుడు, నటుడు రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహించారు. గిబ్రన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

అంతర్జాతీయ స్థాయిలో బ్రహ్మాండంగా రూపొందుతున్న కమల్ హాసన్ చిత్రం ఉత్తమ విలన్. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, సౌండ్ మిక్సింగ్ పనుల కోసం సినీ బృందం అంతా విదేశాలకు వెళ్లింది. అక్కడ ఈ చిత్రానికి సౌండ్ మిక్సింగ్ చేసేందుకు హాలీవుడ్ ఇంజనీర్ క్రైగ్ మాన్‌ను ఎంపిక చేశారు. క్రైగ్ మాన్ ఈ ఏడాది హాలీవుడ్ సినిమా విప్ షెల్ సినిమాకి గాను బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కేటగిరిలో ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్నారు. ఉత్తమ విలన్ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్, సౌండ్ మిక్సింగ్ పనులు లాస్ ఏంజిల్స్‌లో ఉన్న హాలీవుడ్ స్టూడియోలో జరుగుతున్నాయి. కాగా షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు తుది మెరుగులు దిద్దే పనిలో కమల్ హాసన్ బిజీ బిజీగా ఉన్నారు.

కమల్‌హాసన్‌ నటించిన ‘విశ్వరూపం-2' త్వరలో విడుదల కానుంది. ‘పాపనాశనం'ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుసగా మూడు సినిమాలకు సంబంధించి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతుండటంతో కమల్‌హాసన్‌ బిజీగా ఉన్నారు.

English summary
Kamal Haasan, finally, quashed all those gossips and made it clear that he was not interested on remaking 'PK'. Kamal was very choosy while remaking the films from other languages. Kamal Haasan is currently busy with three movies 'Papanasham', 'Vishwaroopam 2' and 'Uthama Villain'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu