For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: ఆ ఎమ్మెల్యే వేధిస్తున్నాడు.. ఆ హీరోకు అమ్మాయిల పిచ్చి.. అనసూయ జబర్దస్త్ నుంచి అవుట్

  |

  మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో యూట్యూబ్ సంచలనం సింగర్ బేబీ.. అంబరీష్ మృతితో కంటతడిపెట్టిన చిత్రలోకం.. సినిమాలు మానేసి అడుక్కోవాలా అంటున్న పవన్.. ఆ హీరోకు అమ్మాయిల పిచ్చి అంటూ ఘాటుగా శ్రీరెడ్డి.. వ్యాపారవేత్తతో పెళ్లి అంటూ వస్తున్న ఊహాగానాలపై త్రిష క్లారిటీ.. నాలుగు చిత్రాల బరువు బాధ్యతలు మోస్తున్న రాంచరణ్.. రజని 2.0 సందడి.. జనసేనలోకి ఆ ముగ్గురు సినీ ప్రముఖులు అంటూ ఊహాగానాలు.. జబర్దస్త్ నుంచి తప్పుకున్న అనసూయ.. ఇలాంటి హాట్ హాట్ వార్తలు ఈ వారం ట్రెండింగ్ గా నిలిచాయి. ఆ వివరాలు మీ కోసం!

   ఆ ఎమ్మెల్యేతో వేధింపులు.. నాకు కులగజ్జి లేదు.. పవన్ నిజమైన హీరో.. నటి అపూర్వ

  ఆ ఎమ్మెల్యేతో వేధింపులు.. నాకు కులగజ్జి లేదు.. పవన్ నిజమైన హీరో.. నటి అపూర్వ

  తెలుగు చిత్ర సీమలో నటి అపూర్వ సహాయ పాత్రల్లో కనిపించి మెప్పిస్తున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో నెలకొన్న వివాదాలపై తీవ్రంగా స్పందిస్తూ సంచలనం రేపారు. తాజాగా ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేశారు.. ఆమె ఏమన్నారంటే..

  ఆ హీరోకు అమ్మాయిల పిచ్చి.. పబ్లిక్ టాయిలెట్ కంటే హీనంగా, బ్రతకాలా వద్దా.. శ్రీరెడ్డి!

  ఆ హీరోకు అమ్మాయిల పిచ్చి.. పబ్లిక్ టాయిలెట్ కంటే హీనంగా, బ్రతకాలా వద్దా.. శ్రీరెడ్డి!

  రెడ్డి మరోమారు తన మాటలకు పదును పెట్టింది. ప్రస్తుతం చెన్నైలో ఉంటూ కొన్ని తమిళ చిత్రాల్లో నటిస్తున శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. కాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రిరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒక్కసారిగా శ్రీరెడ్డి జాతీయ మీడియాని సైతం ఆకర్షించింది. అనేక వివాదాలు, విమర్శల తరువాత శ్రీరెడ్డి ప్రస్తుతం మాటల దూకుడు కాస్త తగ్గించింది. తాజాగా శ్రీరెడ్డి ఓ తమిళ హీరోని ఉద్దేశిస్తూ.. నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

  నేను మాత్రం సినిమాలు మానేసి రోడ్డు మీద అడుక్కోవాలా?: పవన్ కళ్యాణ్ ఫైర్

  నేను మాత్రం సినిమాలు మానేసి రోడ్డు మీద అడుక్కోవాలా?: పవన్ కళ్యాణ్ ఫైర్

  పవన్ కళ్యాణ్ మళ్లీ మేకప్ వేసుకుంటున్నారా? సినిమాల్లోకి వస్తున్నారా? అంటూ ఇటీవల మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని పత్రికల్లో కూడా ఈ వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని, తాను ప్రస్తుతం ప్రజాసేవకే అంకితం అయ్యానని, సినిమాలు చేసే సమయం కానీ, నటించే ఆలోచన కానీ లేదని జనసేన పార్టీ అధ్యక్షుడుగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
  తాజాగా ఏపీలో కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన పవన్ కళ్యాణ్‌కు ఇందుకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఓ విద్యార్థి ఈ విషయం ప్రస్తావిస్తూ ఓ వర్గం మీడియా మీరు సినిమాల వైపు వెళుతున్నారని దుష్ఫ్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

  జబర్దస్త్ నుంచి యాంకర్ అనసూయ తప్పుకుందా? అసలు నిజం ఇదే!

  జబర్దస్త్ నుంచి యాంకర్ అనసూయ తప్పుకుందా? అసలు నిజం ఇదే!

  తెలుగు టెలివిజన్ రంగంలో పాపులర్ అయిన జబర్దస్త్ షో పేరు వినగానే కడుపుబ్బా నవ్వించే కామెడీ స్కిట్లు మాత్రమే కాదు... యాంకర్ అనసూయ గ్లామర్ సైతం కళ్ల ముందు మెదలుతుంది. జబర్దస్త్ ఇంత పెద్ద హిట్టవ్వడంలో అనసూయ అందం, ఆమె చేసే చలాకీ యాకరింగ్ పాత్ర కూడా ఎంతో కొంత ఉందని చెప్పక తప్పదు. గత ఐదేళ్లుగా అనసూయ 'జబర్దస్త్ కామెడీ షో' హోస్ట్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో ఎంతో పాటు మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ ఆమె 'జబర్దస్త్'ను వదిలిపెట్టలేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

  మెగాస్టార్ చిరంజీవిని చూడగానే కాళ్ల మీద పడిపోయిన బేబీ, భావోద్వేగం

  మెగాస్టార్ చిరంజీవిని చూడగానే కాళ్ల మీద పడిపోయిన బేబీ, భావోద్వేగం

  సోషల్ మీడియా పుణ్యమా అని అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు కూడా జరుగుతున్నాయి. ఎంతో టాలెంట్ ఉండి దాన్ని ఉపయోగించుకోలేని ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నారు. ఇటీవల బేబీ అనే ఒక లేడీ సింగర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.పొలం పనులు చేసుకుంటూ జీవించే తూర్పుగోదావరి జిల్లా వడిసెలేరు గ్రామానికి చెందిన 40 సంవత్సరాల బేబీకి అద్భుతమైన సింగింగ్ టాలెంట్ ఉన్న విషయం... వీడియో వైరల్ అయ్యే వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియదు. ఏఆర్ రెహమాన్ ఆమె వీడియో షేర్ చేయడంతో విషయం అందరికీ తెలిసింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సంగీత దర్శకుడు కోటి ద్వారా ఆమెను తన ఇంటికి పిలిపించి అభినందించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

  నా కోసమే పుట్టాడు.. చైతూను ముద్దులతో ముంచెత్తిన సమంత.. రొమాంటిక్‌గా..

  నా కోసమే పుట్టాడు.. చైతూను ముద్దులతో ముంచెత్తిన సమంత.. రొమాంటిక్‌గా..

  టాలీవుడ్‌లో చూడముచ్చటైన జంటల్లో నాగచైతన్య, సమంత అక్కినేని ఒకటి. వారిద్దరి మధ్య ప్రేమానురాగాలు ఆకట్టుకొనేలా కనిపిస్తాయి. తాజాగా నాగచైతన్య 32 పడిలోకి ప్రవేశించాడు. ఈ సందర్భంగా సమంత షేర్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

  అంబరీష్ మృతదేహాన్ని చూసి రజనీ కంటతడి, చిరంజీవి భావోద్వేగం, సుమలతకు ఓదార్పు!

  అంబరీష్ మృతదేహాన్ని చూసి రజనీ కంటతడి, చిరంజీవి భావోద్వేగం, సుమలతకు ఓదార్పు!

  ప్రముఖ కన్నడ నటుడు, సాండల్‌వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ మరణం సౌత్ సినీ ప్రముఖులను విషాదంలో ముంచెత్తింది. అంబి ఇక లేరు అనే విషయం తెలియగానే సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవితో పాటు సౌత్ సినీ ప్రముఖులు బెంగుళూరు చేరుకున్నారు.తన ఆప్తమిత్రుడు మరణించిన విషయాన్ని రజనీకాంత్, చిరంజీవి జీర్ణించుకోలేకపోతున్నారు. అంబరీష్ మృతదేహాన్ని చూడగానే ఇద్దరూ భావోద్వేగాలను ఆపుకోలేక పోయారు. కన్నడిగులకు మాత్రమే కాదు.... ఇతర ఇండస్ట్రీకలు చెందిన నటులకూడా ఎంతో ఆప్తుడిగా అంబరీష్ పేరు తెచ్చుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

  ప్లీజ్ భయ్యా... మీ టార్చర్ ఆపకపోతే ఆత్మహత్యే గతి: జబర్దస్త్ అవినాష్ ఆవేదన!

  ప్లీజ్ భయ్యా... మీ టార్చర్ ఆపకపోతే ఆత్మహత్యే గతి: జబర్దస్త్ అవినాష్ ఆవేదన!

  జబర్దస్త్‌లో రకరకాలు గెటప్స్ వేస్తూ ఫన్ క్రియేట్ చేయడానికి సమాజంలో జరిగే ఏదో ఒక టాపిక్ తీసుకుని నవ్విస్తుంటారు కమెడియన్స్. అయితే కొన్ని సార్లు వారు చేసే స్కిట్లు వివాదాస్పదం అవుతున్నాయి. ఇదే తరహాలో ఇటీవల జబర్దస్త్ ముక్కు అవినాష్ చేసిన కామెడీ స్కిట్ పెద్ద వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. గల్ఫ్ వెళ్లే కుటుంబాలకు చెందిన మహిళలను అవమానపరిచే విధంగా అవినాష్ చేసిన స్కిట్ ఉందంటూ అతడి సొంత ప్రాంతమైన జగిత్యాల ప్రజల నుంచే వ్యతిరేక వ్యక్తం అవ్వడం, దీనిపై అప్పట్లో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

   బండ్ల గణేష్ సూసైడ్‌ను అడ్డుకోవాలి.. పోలీసులకు చెప్పి.. పృథ్వీ ఆందోళన

  బండ్ల గణేష్ సూసైడ్‌ను అడ్డుకోవాలి.. పోలీసులకు చెప్పి.. పృథ్వీ ఆందోళన

  రాజకీయ నేతగా మారిన సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఓ టెలివిజన్ ఛానెల్లో కాంగ్రెస్ పార్టీ గెలువకపోతే బ్లేడ్‌తో కోసుకొని ఆత్మహత్య చేసుకొంటానని ఓ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ సవాల్‌పై కమెడియన్, థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ స్పందించారు. ఆయన ఏమన్నారంటే

  వ్యాపారవేత్తతో త్రిష పెళ్లి.. నయనతారతో, గొడవలకు కారణం ఇదే!

  వ్యాపారవేత్తతో త్రిష పెళ్లి.. నయనతారతో, గొడవలకు కారణం ఇదే!

  ఒకప్పుడు ఒకప్పుడు త్రిష సౌత్‌లో తిరుగులేని హీరోయిన్. త్రిష కెరీర్‌లో బోలెడన్ని విజయాలు ఉన్నాయి. త్రిష గతంలో వరుస చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపింది. ప్రస్తుతం త్రిష పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమాలు చేస్తోంది. వయసు మూడు పదులు దాటడం, కొత్త హీరోయిన్లు చిత్ర పరిశ్రమకు రావడంతో త్రిష రేసులో వెనుకబడింది. చాలా రోజులుగా త్రిష వివాహం గురించి అనేక వార్తలు వస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

  రాంచరణా.. మజాకా.. ఒకేసారి నాలుగు, ఇంత ఒత్తిడిలో ఎలా సాధ్యం!

  రాంచరణా.. మజాకా.. ఒకేసారి నాలుగు, ఇంత ఒత్తిడిలో ఎలా సాధ్యం!

  మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నాడు. రంగస్థలం భారీ హిట్ తరువాత రాంచరణ్ సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి. అభిమానుల అభిరుచికి అనుగుణంగానే చరణ్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ధృవ లాంటి అద్భుత చిత్రంతో రూటు మార్చిన చరణ్ కమర్షియల్ చిత్రాలతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత బిజీగా గడుపుతున్నది రాంచరణే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

  2.0 బ్లాస్టింగ్ మొదలైంది.. యునానిమస్ బ్లాక్‌బస్టర్.. రాజమౌళి, ఇంకా ఇతర సెలబ్రిటీల ట్వీట్స్!

  2.0 బ్లాస్టింగ్ మొదలైంది.. యునానిమస్ బ్లాక్‌బస్టర్.. రాజమౌళి, ఇంకా ఇతర సెలబ్రిటీల ట్వీట్స్!

  దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం 2.0 నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విదేశాల్లో ప్రీమియర్స్ షోలు ప్రారంభమయ్యాయి. తమిళనాడు వ్యాప్తంగా రజనీకాంత్ అంభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇక థియేటర్ వద్ద అయితే అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రధాన నగరాలలో ఇప్పటికే సినిమా ప్రదర్శన ప్రారంభమైంది. అభిమానులతో పాటు సెలెబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా 2.0 చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రీమియర్ షోలు ముగిసిన కొన్ని ప్రాంతాల నుంచి ఈ చిత్రానికి యునానిమస్ బ్లాక్ బస్టర్ అంటూ రిపోర్ట్స్ వస్తుండడం విశేషం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

  వివి వినాయక్, అలీ, శ్రీకాంత్ జనసేనలోకి.. ఊహాగానాలపై క్లారిటీ, ఒకసారి దిగితే!

  వివి వినాయక్, అలీ, శ్రీకాంత్ జనసేనలోకి.. ఊహాగానాలపై క్లారిటీ, ఒకసారి దిగితే!

  కుటుంబ కథ చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీకాంత్ ఇప్పటి వరకు 125 చిత్రాల్లో నటించారు. శ్రీకాంత్ నటించిన 125 వ చిత్రం 'ఆపరేషన్ 2019'. 2007 లో వచ్చిన ఆపరేషన్ దుర్యోధన చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పొలిటికల్ సెటైరికల్ మూవీగా ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఓ ఇంటర్వ్యూ లో శ్రీకాంత్ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి వెళుతున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

  నాకు కుల పిచ్చి.. అయ్యా.. నీ కాళ్ల మీద పడిపోతా.. రాంగోపాల్ వర్మ

  నాకు కుల పిచ్చి.. అయ్యా.. నీ కాళ్ల మీద పడిపోతా.. రాంగోపాల్ వర్మ

  భైరవగీతం మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో సందడి సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాంగోపాల్ వర్మ యాంకర్‌గా మారారు. వేదికపైన తనదైన స్టయిల్లో సెటైర్లు, కామెంట్లు చేస్తూ ఆకట్టుకొన్నాడు. ఈ వేడుకలో వర్మ చేసిన సందడి ఏమిటంటే..

  మెగా అల్లుడు కల్యాణ్ దేవ్‌కి కుర్ర హీరోయిన్ షాక్.. ఏం జరిగిందంటే..!

  మెగా అల్లుడు కల్యాణ్ దేవ్‌కి కుర్ర హీరోయిన్ షాక్.. ఏం జరిగిందంటే..!

  మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ తన రెండో సినిమాకు సిద్దమవుతున్నాడు. తన మొదటి సినిమా విజేత తర్వాత మళ్లీ సరికొత్త సినిమాతో ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే కుర్ర హీరోయిన్ కల్యాణ్ దేవ్ పక్కన నటించడానికి ఒప్పుకోకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే..

  English summary
  Srireddy Once again made sensational comments on Tamil Hero. shoking news about Anasuya
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X