For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేను మాత్రం సినిమాలు మానేసి రోడ్డు మీద అడుక్కోవాలా?: పవన్ కళ్యాణ్ ఫైర్

  |

  పవన్ కళ్యాణ్ మళ్లీ మేకప్ వేసుకుంటున్నారా? సినిమాల్లోకి వస్తున్నారా? అంటూ ఇటీవల మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని పత్రికల్లో కూడా ఈ వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని, తాను ప్రస్తుతం ప్రజాసేవకే అంకితం అయ్యానని, సినిమాలు చేసే సమయం కానీ, నటించే ఆలోచన కానీ లేదని జనసేన పార్టీ అధ్యక్షుడుగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

  తాజాగా ఏపీలో కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన పవన్ కళ్యాణ్‌కు ఇందుకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఓ విద్యార్థి ఈ విషయం ప్రస్తావిస్తూ ఓ వర్గం మీడియా మీరు సినిమాల వైపు వెళుతున్నారని దుష్ఫ్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

  సినిమాలు ప్లాపైతే ఆస్తులు పోయాయి

  సినిమాలు ప్లాపైతే ఆస్తులు పోయాయి

  విద్యార్థి ప్రశ్నకు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ... ''ఒక కొత్త మార్పు వస్తున్నపుడు ఇలాంటివి ఉంటాయి. నేను పాలిటిక్స్‌కు రాగానే మీకూ ఒక న్యూస్ పేపర్ ఉండాలి, మీకూ ఒక ఛానల్ ఉండాలి అన్నారు. కానీ నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? దానికి వందల కోట్లు కావాలి. నా వద్ద కాంట్రాక్టుల మీదో, దోపిడీ చేసి సంపాదించిన డబ్బు లేదు. సినిమా టిక్కెట్ల మీద వచ్చిన డబ్బులే. సినిమాలు హిట్టయినపుడు డబ్బు వచ్చింది. ప్లాపైన తర్వాత ఆస్తులు కూడా పోయాయి. నాకు అంత శక్తి ఎక్కడ ఉంటుంది? '' అన్నారు.

  Pawan Kalyan Will Act In Movies Again...? | Filmibeat Telugu
  అప్పట్లో నా ఫోటోలు పేపర్లలో వేసేవారు కాదు

  అప్పట్లో నా ఫోటోలు పేపర్లలో వేసేవారు కాదు

  నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నా ఫోటోలు ఎవరూ వేసేవారు కాదు. అప్పుడున్న సినిమా పత్రికలు మిగతా వాళ్లవి వేసేవారు కానీ, నా ఫోటోలు వేసేవారు కాదు. నేను అందుబాటులో లేక పోవడమో లేక నేను వారికి నచ్చకనో తెలియదు. నేనూ పెద్దగా పట్టించుకునే వాడినికాదు. ఒక రైతు కూలి పని చేసేపుడు గుర్తింపు కోసం చూసుకుంటాడా? అలాగే నేనూ ఒక యాక్టర్ గా పని చేసుకుంటూ వెళ్లిపోయేవాడిని. సినిమాలు బావుంటే చూస్తారు.. లేదంటే చూడరు. అంతకు మించి పట్టించుకునే వాడిని కాదు.

  సర్కార్ చిత్రాన్ని టార్గెట్ చేయకుండా ఊరుకుంటారా.. సినిమాలపై హింట్ ఇచ్చిన పవన్!

  సినిమాల్లోకి రాక ముందు తిట్టారు, ఇప్పుడూ తిడుతున్నారు

  సినిమాల్లోకి రాక ముందు తిట్టారు, ఇప్పుడూ తిడుతున్నారు

  నా గురించి రకరకాల న్యూస్. సినిమాల్లోకి రాక ముందు తిట్టేవారు. ఎవడో ఎమ్మెల్యే తీసుకెళ్లి నన్ను కొట్టారంటారు. వాళ్లే రాసుకుంటారు. వాళ్లే చప్పట్లు కొట్టుకుంటారు. నన్ను ఎవరూ అడగరు. నన్ను చూడగానే వారికి చిరాకొచ్చేదేమో. నా ఇండిపెండెంట్ నేచర్ అందుకు కారణం కావొచ్చు లేదా భవిష్యత్తులో వీడు ఇబ్బంది పెడతాడు అనే భయం ఏమో? తెలియదు. నేను ఎవరి జోలికి వెళ్లలేదు.

  సినిమాలు చేస్తే చేస్తానని చెబుతాను, నాకేం భయం..

  సినిమాలు చేస్తే చేస్తానని చెబుతాను, నాకేం భయం..

  సినిమాలు చేస్తే నేను సినిమాలు చేస్తాను అని చెబుతాను. నాకు భయం ఏమిటి? పేపర్లో వేసేపుడు నా పర్మిషన్ అడిగారా? సినిమాలు వదిలేసి వచ్చాను అని నేను ఒక వైపు మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నాడని వార్తలు వేస్తే కన్ ఫ్యూజ్ క్రియేట్ చేయడమే. ఇతడు సీరియస్ నాయకుడు కాదని చెప్పడానికే నాపై ఇలాంటి ప్రచారం చేస్తున్నారు.

  పవన్ కళ్యాణ్ ఏ పనులు చేయకుండా రోడ్డు మీద అడుక్కుతింటూ ఉండాలా?

  పవన్ కళ్యాణ్ ఏ పనులు చేయకుండా రోడ్డు మీద అడుక్కుతింటూ ఉండాలా?

  చంద్రబాబు నాయుడు హరిటేజ్ వ్యాపారం, జగన్ రెడ్డి భారతి సిమెంట్ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించొచ్చు.... పవన్ కళ్యాణ్ ఏ పనులు చేయకుండా రోడ్డు మీద అడుక్కుతింటూ ఉండాలా? అంటూ పవర్ స్టార్ ఫైర్ అయ్యారు.

  అందుకే ప్రొడక్షన్ హౌస్ పెట్టుకున్నాను

  అందుకే ప్రొడక్షన్ హౌస్ పెట్టుకున్నాను

  నేను ఏమనుకున్నానంటే...‘‘రాజకీయాల్లో ఉంటే సినిమా యాక్టింగ్ కుదరదు. అందుకే సినిమా ప్రొడక్షన్ పెట్టుకున్నాను. జగన్ రెడ్డిలా కాంట్రక్టుల్లో డబ్బులు తీసుకోలేను, లోకేష్ మాదిరిగా ఇసుక ర్యాంపుల్లో డబ్బులు తీసుకోలేను. నాకు సినీ ఇండస్ట్రీలో స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. వాళ్లను అడుగుతాను సినిమాలు చేయమని... నేను సినిమాల్లో యాక్ట్ చేయడానికి కాదు.'' అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

  అభిమానులే నా పేపర్, ఛానల్

  అభిమానులే నా పేపర్, ఛానల్

  రాజకీయాలు చేయడానికి పేపర్ ఉండాల్సిన అవసరం లేదు. మహాత్మా గాంధీకి ఏ పేపర్ ఉంది? బ్రిటిష్ వారితో గొడవ పెట్టుకున్నపుడు ఆయన వెంట ఎవరు ఉన్నారు? అభిమానులే మా పేపర్స్, మా చానల్స్. మీ ఒక్కొక్క వాట్సాఫ్ గ్రూపు ఒక పబ్లిక్ కేషన్, మీ ఫేస్ బుక్ గ్రూపు ఒక ఛానల్.

  నా గురించి ఎవరూ మంచిగా రాయొద్దు

  నా గురించి ఎవరూ మంచిగా రాయొద్దు

  నేను భయపడుతూ నా గురించి మంచిగా రాయండి అని అడగను. నా గురించి ఎవరూ మంచిగా రాయకండి.. నన్ను ఎవరు నమ్ముతారో వారే నమ్ముతారు. ఎవరు తిడతారో తిట్టుకుంటారు. మీరు మార్ఫింగులు చేసుకుంటారో చేసుకోండి. ద్రోహం చేసేవారు, దోపిడీలు చేసేవారు భయపడాలి కానీ నాకు భయం అవసరం లేదు.

  English summary
  "I do not act in movies anymore. That's why I started own film production." Power Star Pawan Kalyan about his Film Career.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X