Just In
- 36 min ago
‘పుష్ప’లో మిస్ ఇండియా: ఆఖరికి ఆమెనే ఫైనల్ చేసిన సుక్కూ.. భారీగానే ఇస్తున్నారు
- 51 min ago
Acharya Teaser అప్డేట్.. చిరు స్టైల్లో సుప్రీమ్ హీరో రిప్లై
- 53 min ago
వామ్మో.. గెస్ట్ రోల్ కోసం అన్ని కోట్ల రూపాయల.. బుట్టబొమ్మ రేటు మామూలుగా లేదు
- 59 min ago
తెలంగాణ బొగ్గు గనుల్లోకి ప్రభాస్: అక్కడి నుంచే యాక్షన్ షురూ చేయనున్న రెబెల్ స్టార్
Don't Miss!
- Finance
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఆల్ టైమ్ గరిష్టానికి, ముంబైలో రూ.92 క్రాస్
- Lifestyle
ఇలాంటి భయంకరమైన లైంగిక కోరికలు మీ మతిని పోగొట్టేస్తాయట..! కానీ ఇలా ఉండకూడదట...!
- News
జైల్లోనూ నేనే శివుడిని అంటూ పద్మజ పిచ్చి కేకలు , చికిత్స కోసం దంపతులను స్విమ్స్ కు తరలింపు
- Sports
సిక్సర్ కోసం ఎలాంటి ప్లాన్ వేయలేదు.. బయటకి వచ్చి బాదానంతే! అర్ధ శతకం పూరైంది: శార్దూల్
- Automobiles
మేడ్ ఇన్ ఇండియా 'ప్రాణ' ఈ-బైక్ విడుదల; తయారు చేసింది ఎవరో తెలుసా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ ఎమ్మెల్యేతో వేధింపులు.. నాకు కులగజ్జి లేదు.. పవన్ నిజమైన హీరో.. నటి అపూర్వ
తెలుగు చిత్ర సీమలో నటి అపూర్వ సహాయ పాత్రల్లో కనిపించి మెప్పిస్తున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో నెలకొన్న వివాదాలపై తీవ్రంగా స్పందిస్తూ సంచలనం రేపారు. ఈ మధ్యకాలంలో సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నారు. తాజాగా ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేశారు.. ఆమె ఏమన్నారంటే..

నా తల్లికి గుండె జబ్బు
నా వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నాను. నా తల్లి గుండె జబ్బుతో బాధపడుతున్నారు. అందుకే ఆఫర్లు వచ్చిన నటించడం లేదు. నా తల్లి ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత మళ్లీ నటిస్తాను. నటించడమంటే నాకు చాలా ఇష్టం అని అపూర్వ తెలిపారు.
టాలీవుడ్‌లో మరో కలకలం, ఆ వెబ్ సైట్లో హీరోయిన్స్‌తో పాటు యాంకర్స్ కూడా.. కంగుతిన్న నటి అపూర్వ!

మాది పొలిటికల్ ఫ్యామిలీ
మాది రాజకీయ నేపథ్య కుటుంబం. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలపై అవగాహన ఉంది. మేము టీడీపీకి చెందిన వాళ్లం. 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలిస్తే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయడనే అనుమానం ఉండేది. కానీ ప్రస్తుతం అలాంటి అనుమానాలు తొలిగిపోయాయి. చంద్రబాబు రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు అని అపూర్వ అన్నారు.

నాకు కులగజ్జి లేదు
మేము కమ్మ కులానికి చెందిన వాళ్లం. కానీ నాకు కులగజ్జి లేదు. కులాన్ని పెద్దగా పట్టించుకోం. కానీ టీడీపీకే ఓట్లు వేస్తాం. మాది దెందులూరు నియోజకవర్గం. అక్కడ మా ఎమ్మెల్యే ఎన్నికైనప్పుడు సంతోషం కలిగింది. కానీ అతడి వల్ల నేను చాలా కష్టపడ్డాను అని అపూర్వ చెప్పారు.

ఎమ్మెల్యేతో సమస్యలు
మాకు ఎదురైన ఓ వివాదంలో ఎమ్మెల్యే మమ్మల్ని చాలా సమస్యలు సృష్టించారు. మేము ఓటేసిన ఎమ్మెల్యే మాకు నరకం చూపిస్తున్నారు. ఒకవేళ అలానే ఇబ్బందులు పెడితే ఆస్తులు అమ్ముకొని తెలంగాణకు వచ్చేస్తాం. తెలంగాణలో ప్రతీ ఒక్కరికి భద్రత ఉంది.

పవన్ కల్యాణ్ రాజకీయాల్లో
జనసేనతో పవన్ కల్యాణ్ రాజకీయాల్లో తనదైన రీతిలో దూసుకెళ్తున్నాడు. అధికార ప్రభుత్వాన్ని నిలదీస్తూ హీరోగా మారాడు. అలాంటి వ్యక్తిపై శివాజీ విమర్శలు చేస్తున్నాడు. అధికార పార్టీ అవినీతిని ఆయన ప్రశ్నించడం లేదు.