twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బండ్ల గణేష్ సూసైడ్‌ను అడ్డుకోవాలి.. పోలీసులకు చెప్పి.. పృథ్వీ ఆందోళన

    |

    రాజకీయ నేతగా మారిన సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ తనదైన శైలిలో పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఓ టెలివిజన్ ఛానెల్లో బ్లేడ్‌తో కోసుకొని ఆత్మహత్య చేసుకొంటానని ఓ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ సవాల్‌పై కమెడియన్, థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ స్పందించారు. ఆయన ఏమన్నారంటే

    బండ్ల గణేష్ ప్రవర్తనపై

    బండ్ల గణేష్ ప్రవర్తనపై

    రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బండ్ల గణేష్ ప్రవర్తన చాలా చిత్రంగా ఉంది. తెలంగాణలో మహాకూటమి పరాజయం పాలైతే గొంతు కోసుకొంటాననడం సరికాదు. పాలిటిక్స్‌లో ఆవేశంగా నిర్ణయాలు, సవాళ్లు చేయవద్దు అని పృథ్వీ అన్నారు.

    పోలీసులకు చెప్పాలి

    పోలీసులకు చెప్పాలి

    బ్లండ గణేష్ చేసిన సవాల్‌ను పోలీసుల దృష్టికి తీసుకురావాలి. ఆయనను కాపాడమని పోలీసులకు చెప్పాలి. ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకోవాలి అని పృథ్వీ పరోక్షంగా సెటైర్లు వేశారు. ఆరోగ్యకరమైన సవాళ్లు ఉండాలని, ప్రాణాల మీదకు తీసుకొనే విధంగా ఉండకూడదు అని హితవు పలికారు.

    బండ్ల గణేష్ మంచి మిత్రుడు

    బండ్ల గణేష్ మంచి మిత్రుడు

    బండ్ల గణేష్ మంచి నిర్మాత. నాకు మంచి మిత్రుడు. రాజకీయాల్లోకి ఆయన రావడం ఆశ్చర్యకరంగా ఉంది అనే అభిప్రాయాన్ని పృథ్వీ వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కూడా ఫొటో తీయించుకునే సత్తా ఉంది. కానీ తనకు ఆ శక్తి లేదన్నారు అని పృథ్వీ అన్నారు.

    అత్యుత్సాహంతో బండ్ల

    అత్యుత్సాహంతో బండ్ల

    కాగా, పవన్‌కు వీరాభిమాని అయిన బండ్ల గణేష్ ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరడం సెన్సేషనల్‌గా మారింది. అంతేకాకుండా కాంగ్రెస్ సీటు ఇవ్వకుండానే ఓ టెలివిజన్ చానెల్లో ప్రమాణం చేసి అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. చివరకు సీటు రాకపోవడంతో మీడియాలో అభాసుపాలయ్యాడు.

    English summary
    Comedian Prithvi responds over Bandla Ganesh suicide Challenge. As politician Bandla was very confident over Congress party victory. If not congress wins, He said, He will attmept suiced with a blade.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X