bredcrumb

రకుల్ వీకెండ్ వైబ్స్... బ్లాక్ డ్రెస్‌లో మాయ చేస్తోన్న ముద్దుగుమ్మ!

By Siva Kodati
| Published: Saturday, January 31, 2026, 22:14 [IST]

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా స్టైలీష్ లుక్‌లో ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది.

rakul preet singh Photos
1/5

తెలుగు తెరపై ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు రకుల్ ప్రీత్ సింగ్. కానీ ఇప్పుడు బాలీవుడ్‌కే పరిమితమై హిందీలోనే తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. పెళ్లి తర్వాత ముంబైని దాటి బయటకు రావడం లేదు ఈ ముద్దుగుమ్మ. ఏం జరిగినా బాలీవుడ్‌లోనే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తన హాట్ ఫోటోలతో అభిమానులను పలకరిస్తున్నారు.

rakul preet singh Photos
2/5

2021లో కొండ పొలం సినిమా తర్వాత తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ నటించలేదు. తర్వాత బూ, ఇండియన్ 2 వంటి డబ్బింగ్ చిత్రాలతో ఆమె తెలుగు వారిని పలకరించారు. ప్రస్తుతం హిందీలోపతి పత్నీ ఔర్ వో దో, ఇండియన్ 3 సినిమాలలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాలపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

rakul preet singh Photos
3/5

బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగణ్‌కు జోడీగా ఇటీవల దే దే ప్యార్ దే 2లో నటించారు రకుల్ ప్రీత్ సింగ్. ఇందులో 55 ఏళ్ల హీరోతో రకుల్ లిప్ లాక్ సీన్స్‌లో నటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వీటికి రకుల్ తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. వృత్తిపరంగా తాను అంకిత భావంతో పనిచేస్తానని ఆమె పలుమార్లు చెప్పారు.

rakul preet singh Photos
4/5

ఇకపోతే.. ఇటీవల ముంబైలోని రకుల్ నివాసానికి ఓ విశిష్ట అతిథి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో బన్నీ నటిస్తోన్న ఏఏ 22 మూవీ ఎక్కువగా ముంబైలోనే షూటింగ్ జరుపుకుంటోంది. దాంతో నగరంలోని తన మిత్రులు, సన్నిహితులను కలుస్తున్నారు అల్లు అర్జున్. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్.. డిన్నర్ చేసి బయటకు వస్తోన్న వీడియో వైరల్ అవుతోంది. 

rakul preet singh Photos
5/5

గతంలో అల్లు అర్జున్ - రకుల్ ప్రీత్ సింగ్‌లు జంటగా నటించారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రకుల్ నటించిన సరైనోడ్ మూవీలో  వీరిద్దరూ జంటగా నటించారు. మెగా కుటుంబంలో రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లతో రకుల్ నటించారు. ముంబైలో ఉంటున్నప్పటికీ మెగా కుటుంబంతో తన ఫ్రెండ్‌షిప్ కొనసాగిస్తున్నారు రకుల్. 

X