By
Siva Kodati
| Published: Sunday, June 7, 2026, 20:05 [IST]
ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా, భైరవి హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త మలుపు సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి విడుదల చేశారు.
1/6
Kotha Malupu: కొత్త సినిమాతో వస్తోన్న సింగర్ సునీత కొడుకు.. కొత్త మలుపు ట్రైలర్ చూశారా? | Akash Goparaju's Kotha Malupu Movie Trailer Launch Event Photos - Filmibeat Telugu
/photos/feature/akash-goparajus-kotha-malupu-movie-trailer-launch-event-photos-fb108022.html
ప్రముఖ సింగర్ సునీత తన కుమారుడు ఆకాష్‌ని హీరోగా నిలబెట్టాలని కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆకాష్ నటిస్తోన్న మూవీ కొత్త మలుపు. ఈ సినిమాలో ఆకాష్ సరసన భైరవి ఆర్ధ్యా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
2/6
Kotha Malupu: కొత్త సినిమాతో వస్తోన్న సింగర్ సునీత కొడుకు.. కొత్త మలుపు ట్రైలర్ చూశారా? | Akash Goparaju's Kotha Malupu Movie Trailer Launch Event Photos - Filmibeat Telugu
/photos/feature/akash-goparajus-kotha-malupu-movie-trailer-launch-event-photos-fb108022.html#photos-1
కొత్త మలుపు చిత్రానికి కే. శివప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేందర్, ప్రభావతి, రఘుబాబు, పృథ్వీ, కిట్టయ్య తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తథాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తాటి బాలకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. మునుగాల అనూష సమర్పిస్తున్నారు. యశ్వంత్ నాగ్ సంగీతం అందిస్తుండగా.. సుమంత్ కాచర్ల, జవహార్ రెడ్డి సినిమాటోగ్రాఫర్, శివ శర్వాణీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
3/6
Kotha Malupu: కొత్త సినిమాతో వస్తోన్న సింగర్ సునీత కొడుకు.. కొత్త మలుపు ట్రైలర్ చూశారా? | Akash Goparaju's Kotha Malupu Movie Trailer Launch Event Photos - Filmibeat Telugu
/photos/feature/akash-goparajus-kotha-malupu-movie-trailer-launch-event-photos-fb108022.html#photos-2
ఇటీవల ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త మలుపు సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు భానుచందర్, సింగర్ సునీత, నిర్మాత సీ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. గ్రామీణ వాతావరణంలో లవ్, సస్పెన్స్ కలయికగా రూపొందించిన ఈ సినిమాలో కోనసీమ అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ పేర్కొన్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూన్ 12న కొత్త మలుపు మూవీని విడుదల చేయనున్నారు.
4/6
Kotha Malupu: కొత్త సినిమాతో వస్తోన్న సింగర్ సునీత కొడుకు.. కొత్త మలుపు ట్రైలర్ చూశారా? | Akash Goparaju's Kotha Malupu Movie Trailer Launch Event Photos - Filmibeat Telugu
/photos/feature/akash-goparajus-kotha-malupu-movie-trailer-launch-event-photos-fb108022.html#photos-3
తాజాగా జూన్ 7వ తేదీన హైదరాబాద్‌లో కొత్త మలుపు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. లెజెండరీ డైరెక్టర్ ఏ. కోదండరామిరెడ్డి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను లాంచ్ చేసి చిత్ర యూనిట్‌ను అభినందించి... హీరో ఆకాష్, హీరోయిన్ భైరవిలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కోదండరామిరెడ్డిని చిత్ర యూనిట్ సత్కరించింది.
5/6
Kotha Malupu: కొత్త సినిమాతో వస్తోన్న సింగర్ సునీత కొడుకు.. కొత్త మలుపు ట్రైలర్ చూశారా? | Akash Goparaju's Kotha Malupu Movie Trailer Launch Event Photos - Filmibeat Telugu
/photos/feature/akash-goparajus-kotha-malupu-movie-trailer-launch-event-photos-fb108022.html#photos-4
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. బావా మరదళ్ల మధ్య జరిగే ప్రేమకథ, ఇద్దరి మధ్య చోటు చేసుకునే చిన్నచిన్న గొడవలు, పెద్దల పంతాలతో సాగే కథగా తెలుస్తోంది. బావా మరదళ్ల మధ్య ఏం జరిగింది? మరదలిని చివరికి హీరో పెళ్లి చేసుకున్నాడా? వీరి ప్రేమ కథలో చోటు చేసుకున్న మలుపులే ఈ సినిమాగా తెలుస్తోంది.
6/6
Kotha Malupu: కొత్త సినిమాతో వస్తోన్న సింగర్ సునీత కొడుకు.. కొత్త మలుపు ట్రైలర్ చూశారా? | Akash Goparaju's Kotha Malupu Movie Trailer Launch Event Photos - Filmibeat Telugu
/photos/feature/akash-goparajus-kotha-malupu-movie-trailer-launch-event-photos-fb108022.html#photos-5
కోనసీమ అందాలను సినిమాలో అద్భుతంగా చూపించారు. కొబ్బరి తోటలు, గోదావరి అందాలు, అందమైన గ్రామాలను కెమెరాలో బంధించారు. హీరోయిన్ భైరవి అందంగా కనిపిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఆమె ఫోటోలు కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి.