By
Siva Kodati
| Published: Tuesday, June 16, 2026, 19:12 [IST]
నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 15న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ ఫోటోలు మీ కోసం
1/7
రాజ్ నిడిమోరుతో సమంత సందడి.. మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు చూశారా? | Samantha, Raj Nidimoru And Sreemukhi Shine At Maa Inti Bangaram Pre-Release Event - Filmibeat Telugu
/photos/feature/samantha-raj-nidimoru-and-sreemukhi-shine-at-maa-inti-bangaram-pre-release-event-fb108264.html
అగ్రనటి సమంత రూత్ ప్రభు.. చాలాకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ సంస్థను స్థాపించి నిర్మాతగా రాణిస్తున్నారు. తొలుత శుభం అనే సినిమాను తీశారు. ఇందులో గెస్ట్ రోల్‌లో అలరించినప్పటికీ.. అభిమానులు ఆమె నుంచి పూర్తి స్థాయి సినిమాను కోరుకుంటున్నారు.
2/7
రాజ్ నిడిమోరుతో సమంత సందడి.. మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు చూశారా? | Samantha, Raj Nidimoru And Sreemukhi Shine At Maa Inti Bangaram Pre-Release Event - Filmibeat Telugu
/photos/feature/samantha-raj-nidimoru-and-sreemukhi-shine-at-maa-inti-bangaram-pre-release-event-fb108264.html#photos-1
ఈ క్రమంలోనే సమంత ఫుల్ లెంగ్త్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అదే మా ఇంటి బంగారం. తను నటిస్తూ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. సమంత స్నేహితురాలు బీవీ నందినీ రెడ్డి మా ఇంటి బంగారం మూవీకి దర్శకత్వం వహించారు. సమంత భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు స్క్రిప్ట్ పనులతో పాటు, క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరించారు.
3/7
రాజ్ నిడిమోరుతో సమంత సందడి.. మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు చూశారా? | Samantha, Raj Nidimoru And Sreemukhi Shine At Maa Inti Bangaram Pre-Release Event - Filmibeat Telugu
/photos/feature/samantha-raj-nidimoru-and-sreemukhi-shine-at-maa-inti-bangaram-pre-release-event-fb108264.html#photos-2
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వూరులు కలిసి మా ఇంటి బంగారం సినిమాను నిర్మించారు. శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహించగా.. ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌గా వ్యవహరించారు.
4/7
రాజ్ నిడిమోరుతో సమంత సందడి.. మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు చూశారా? | Samantha, Raj Nidimoru And Sreemukhi Shine At Maa Inti Bangaram Pre-Release Event - Filmibeat Telugu
/photos/feature/samantha-raj-nidimoru-and-sreemukhi-shine-at-maa-inti-bangaram-pre-release-event-fb108264.html#photos-3
జూన్ 19న మా ఇంటి బంగారం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో జూన్ 15న హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి సమంత, రాజ్ నిడిమోరుతో పాటు మొత్తం చిత్ర యూనిట్ తరలివచ్చి సందడి చేసింది. సమంత చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడంతో అభిమానులు పోటెత్తారు.
5/7
రాజ్ నిడిమోరుతో సమంత సందడి.. మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు చూశారా? | Samantha, Raj Nidimoru And Sreemukhi Shine At Maa Inti Bangaram Pre-Release Event - Filmibeat Telugu
/photos/feature/samantha-raj-nidimoru-and-sreemukhi-shine-at-maa-inti-bangaram-pre-release-event-fb108264.html#photos-4
సమంత మాట్లాడుతూ.. నటిగా ఎంతో సౌకర్యవంతంగా సినిమాలు చేశాను. కానీ ఇప్పుడు నటిగా, నిర్మాతగా కాస్త కష్టంగా మారింది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇందులో నేను చారలోనే ఫైట్లు చేశా. అందరూ అద్భుతంగా నటించారు అని సమంత అన్నారు.
6/7
రాజ్ నిడిమోరుతో సమంత సందడి.. మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు చూశారా? | Samantha, Raj Nidimoru And Sreemukhi Shine At Maa Inti Bangaram Pre-Release Event - Filmibeat Telugu
/photos/feature/samantha-raj-nidimoru-and-sreemukhi-shine-at-maa-inti-bangaram-pre-release-event-fb108264.html#photos-5
నందినీ రెడ్డి మాట్లాడుతూ.. నా జీవితంలో ఏ సినిమాకు కూడా ఈ మూవీ కోసం పడినంత కష్టం పడలేదు. సమంత, రాజ్‌లు నాకు ఇచ్చిన బాధ్యతను, నమ్మకాన్ని నిలబెట్టుకున్నా. ఈ నెల 19న సమంత గారిని తెరపై అద్భుతంగా చూస్తారని అన్నారు.
7/7
రాజ్ నిడిమోరుతో సమంత సందడి.. మా ఇంటి బంగారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు చూశారా? | Samantha, Raj Nidimoru And Sreemukhi Shine At Maa Inti Bangaram Pre-Release Event - Filmibeat Telugu
/photos/feature/samantha-raj-nidimoru-and-sreemukhi-shine-at-maa-inti-bangaram-pre-release-event-fb108264.html#photos-6
శ్రీముఖి మాట్లాడుతూ.. నన్ను ఇన్నిరోజులు ఓపికగా భరించి, మా ఇంటి బంగారంగా తీర్చిదిద్దిన నందినీ రెడ్డికి ధన్యవాదాలు. సమంత గారి గురించి వినడమే కానీ దగ్గరి నుంచి చూడటం, ఆమెతో కలిసి పనిచేయడం చాలా బాగుంది. స్టార్ హీరోయిన్ అయ్యుండి కూడా సామ్ చాలా సింపుల్‌గా ఉంటారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా.. పనిలో పనిగా నా పెళ్లి కూడా జరిగిపోతే బాగుండు అని శ్రీముఖి సరదాగా వ్యాఖ్యానించారు.