bredcrumb

చీరకట్టులో మెరిసిన రాశి సింగ్.. వైరల్‌గా మారిన ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఈవెంట్ ఫొటోలు..

By Rajesh Karampoori
| Updated: Sunday, June 14, 2026, 07:02 [IST]

Rashi Singh: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో  చీరకట్టులో మెరిసిన టాలీవుడ్ నటి రాశి సింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ కట్టుతో ఆకట్టుకున్న ఈ అందాల భామ లేటెస్ట్ ఫోటో గ్యాలరీపై మీరు కూడా చూసేయండి.  

Rashi Singh in Transfer Trimurthulu Event
1/6

టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్న యువ కథానాయిక రాశి సింగ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె సందడి చేసింది. ఆరెంజ్ చీరలో సాంప్రదాయ కట్టుతో హాజరైన రాశి సింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rashi Singh in Transfer Trimurthulu Event
2/6

ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన రాశి సింగ్ సినీ పరిశ్రమలోకి రాకముందు ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేశారు. దాదాపు మూడేళ్ల పాటు క్యాబిన్ క్రూ ఉద్యోగం చేసిన ఆమె, నటనపై ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగాన్ని వదిలి సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తన కలను నిజం చేసుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చి అవకాశాల కోసం కృషి చేశారు.

Rashi Singh in Transfer Trimurthulu Event
3/6

2021లో ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కిన ‘శశి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాశి సింగ్, తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత ‘పోస్టర్’, ‘జెమ్’, ‘భూతద్దం భాస్కర్ నారాయణ’, ‘ప్రసన్న వదనం’ వంటి చిత్రాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా ‘ప్రసన్న వదనం’లో ఏసీపీ వైదేహి పాత్ర ఆమెకు ప్రశంసలు తెచ్చిపెట్టింది.

Rashi Singh in Transfer Trimurthulu Event
4/6

కేవలం సినిమాలకే పరిమితం కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ రాశి తన సత్తా చాటుతున్నారు. ‘పాపం పసివాడు’, ‘త్రీ రోజెస్-2’ వంటి వెబ్ సిరీస్‌ల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పాత్రలకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.

Rashi Singh in Transfer Trimurthulu Event
5/6

ప్రస్తుతం రాశి సింగ్ చేతిలో పలు ఆసక్తికర ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ప్రత్యేకంగా నిలుస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత హీరో వడ్డే నవీన్ ఈ చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తుండగా, ఇందులో రాశి సింగ్ కథానాయికగా నటిస్తోంది. ఈ నెల 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Rashi Singh in Transfer Trimurthulu Event
6/6

ఇక తాజాగా విడుదలైన ఫొటోల్లో రాశి సింగ్ సాంప్రదాయ లుక్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. “అందం, అభినయం కలిసిన నటి”, “టాలీవుడ్‌లో మరో స్టార్ హీరోయిన్ అవుతుంది” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

X