bredcrumb

హీరోయిన్‌గా రాను ముంబైకి రాను సాంగ్ బ్యూటీ.. డ్యాన్సే కాదు నటనలోనూ తగ్గేదే లే..

By Siva Kodati
| Published: Thursday, June 11, 2026, 19:48 [IST]

రాను ముంబైకి రాను ఫోక్ సాంగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న లిఖిత ఇప్పుడు హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. సాV3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Ranu Bombai Ranu Song Fame Likhitha
1/6

తెలుగునాట జానపద గీతాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి సాంగ్స్ చేసిన వారు ప్రజల అభిమానాన్ని సంపాదించి మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు. మంగ్లీ, రాము రాథోడ్ ఇలా ఎంతోమంది ఉంటారు. ఈ కోవలోకే వస్తారు లిఖిత. 

Ranu Bombai Ranu Song Fame Likhitha
2/6

రాము రాథోడ్ ఆధ్వర్యంలో వచ్చిన రాను ముంబైకి రాను అనే ఫోక్ సాంగ్‌లో తన డ్యాన్స్, అందంతో అలరించింది లిఖిత. రాముతో సమానంగా ఈమెకు కూడా క్రేజ్ దక్కింది. ఈ పాటను రాము రాథోడ్ రాయగా.. కళ్యాణ్ కీస్ స్వరకల్పన చేశారు. ప్రభ, రాము కలిసి ఆలపించారు. 

Ranu Bombai Ranu Song Fame Likhitha
3/6

కేవలం 3 లక్షల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన రాను ముంబైకి రాను సాంగ్ ఇప్పటి వరకు దాదాపు 853 మిలియన్ల వ్యూస్ దక్కించుకుని  సంచలనం సృష్టించింది. ప్రేక్షకుల ఆదరణతో పాటు కోట్ల రూపాయల ఆదాయాన్ని అందించి రికార్డ్ సృష్టించింది. ఈ ఒక్క సాంగ్‌తో రాము రాథోడ్‌కి బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం కల్పించింది. బిగ్‌బాస్‌తో రాముకి తెలుగునాట మరింత పాపులారిటీ దక్కింది. 

Ranu Bombai Ranu Song Fame Likhitha
4/6

ఇప్పుడు లిఖిత వంతు వచ్చింది. తాజాగా ఆమెకు హీరోయిన్‌గా అవకాశం దక్కింది. బిగ్‌బాస్ తెలుగు 9 ఫేమ్ డీమోన్ పవన్, సామ్రాట్‌లు హీరోలుగా సాV3 అనే అనే సినిమాలో లిఖిత హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కృష్ణమాయ దర్శకత్వం వహిస్తుండగా.. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. వీ విజయ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.

Ranu Bombai Ranu Song Fame Likhitha
5/6

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే లిఖిత ఎప్పటికప్పుడు తన పాటలు, ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. గ్లామర్ షోకు దూరంగా చీర, ఇతర సాంప్రదాయ దుస్తుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది లిఖిత. ఆమెకు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంది.  ఇన్‌స్టాగ్రామ్ పేజీకి దాదాపు లక్షా 83 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 

Ranu Bombai Ranu Song Fame Likhitha
6/6

హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుండటంతో లిఖిత చాలా సంతోషంగా ఉన్నారు. సినిమాలో ఆఫర్ రావడంతో ప్రస్తుతం ఫోక్ సాంగ్స్‌కి కొంత గ్యాప్ ఇచ్చినట్లు లిఖిత చెప్పింది. మరి హీరోయిన్‌గా లిఖిత ఎంత మేరకు ప్రజల ఆదరణను దక్కించుకుంటుందో చూడాలి. 

X