By
Rajesh Karampoori
| Published: Monday, June 8, 2026, 12:22 [IST]
Bhola Balayya Song Launch: నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా విడుదలైన ‘భోళా బాలయ్య’ సిగ్నేచర్ సాంగ్ లాంచ్ జరిగింది. ఈ ఈవెంట్ బోయపాటి శ్రీను చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్ సంబంధించిన ఫోటో గ్యాలరీ ఇది.
1/6
Bhola Balayya Song: నందమూరి బాలకృష్ణ బర్త్‌డే ట్రీట్.. భోళా బాలయ్య సిగ్నేచర్ సాంగ్ విడుదల | Bhola Balayya Song Launch: Grand Birthday Celebrations Of Nandamuri Balakrishna - Filmibeat Telugu
/photos/feature/bhola-balayya-song-launch-grand-birthday-celebrations-of-nandamuri-balakrishna-fb108038.html
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఈసారి మరింత ప్రత్యేకంగా మారాయి. కేవలం సినీ నటుడిగానే కాకుండా సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన బాలయ్య వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ‘భోళా బాలయ్య’ సిగ్నేచర్ సాంగ్‌ను హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
2/6
Bhola Balayya Song: నందమూరి బాలకృష్ణ బర్త్‌డే ట్రీట్.. భోళా బాలయ్య సిగ్నేచర్ సాంగ్ విడుదల | Bhola Balayya Song Launch: Grand Birthday Celebrations Of Nandamuri Balakrishna - Filmibeat Telugu
/photos/feature/bhola-balayya-song-launch-grand-birthday-celebrations-of-nandamuri-balakrishna-fb108038.html#photos-1
‘ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్’ ఆధ్వర్యంలో జూన్ 1 నుంచి 10 వరకు బాలకృష్ణ జన్మదిన వేడుకలను పండుగలా నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, పలు సామాజిక సేవా కార్యక్రమాలతో బాలయ్య సేవా స్ఫూర్తిని అభిమానులు కొనసాగించడం విశేషం.
3/6
Bhola Balayya Song: నందమూరి బాలకృష్ణ బర్త్‌డే ట్రీట్.. భోళా బాలయ్య సిగ్నేచర్ సాంగ్ విడుదల | Bhola Balayya Song Launch: Grand Birthday Celebrations Of Nandamuri Balakrishna - Filmibeat Telugu
/photos/feature/bhola-balayya-song-launch-grand-birthday-celebrations-of-nandamuri-balakrishna-fb108038.html#photos-2
‘భోళా బాలయ్య’ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను విడుదల చేయడం ఈ ఈవెంట్‌కు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. బాలకృష్ణ సేవా దృక్పథాన్ని అభిమానులు ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
4/6
Bhola Balayya Song: నందమూరి బాలకృష్ణ బర్త్‌డే ట్రీట్.. భోళా బాలయ్య సిగ్నేచర్ సాంగ్ విడుదల | Bhola Balayya Song Launch: Grand Birthday Celebrations Of Nandamuri Balakrishna - Filmibeat Telugu
/photos/feature/bhola-balayya-song-launch-grand-birthday-celebrations-of-nandamuri-balakrishna-fb108038.html#photos-3
ఈ పాటలో బాలయ్య మాస్ ఇమేజ్‌తో పాటు ఆయన అభిమానులతో ఉన్న అనుబంధం, సేవా కార్యక్రమాల పట్ల ఉన్న నిబద్ధతను హైలైట్ చేశారు. సాహిత్య రచయిత దివాకర్ అమిలినేని, గాయకుడు కరీముల్లా, సంగీత దర్శకుడు ఈశ్వర్ దత్తు కలిసి ఈ గీతాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
5/6
Bhola Balayya Song: నందమూరి బాలకృష్ణ బర్త్‌డే ట్రీట్.. భోళా బాలయ్య సిగ్నేచర్ సాంగ్ విడుదల | Bhola Balayya Song Launch: Grand Birthday Celebrations Of Nandamuri Balakrishna - Filmibeat Telugu
/photos/feature/bhola-balayya-song-launch-grand-birthday-celebrations-of-nandamuri-balakrishna-fb108038.html#photos-4
సిగ్నేచర్ సాంగ్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. నందమూరి అభిమానులు ఈ పాటను విస్తృతంగా షేర్ చేస్తూ బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను మరింత గ్రాండ్‌గా మార్చుతున్నారు. దీంతో ‘భోళా బాలయ్య’ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
6/6
Bhola Balayya Song: నందమూరి బాలకృష్ణ బర్త్‌డే ట్రీట్.. భోళా బాలయ్య సిగ్నేచర్ సాంగ్ విడుదల | Bhola Balayya Song Launch: Grand Birthday Celebrations Of Nandamuri Balakrishna - Filmibeat Telugu
/photos/feature/bhola-balayya-song-launch-grand-birthday-celebrations-of-nandamuri-balakrishna-fb108038.html#photos-5
మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని, కొరటాల శివ దర్శకత్వాల్లో రూపొందుతున్న చిత్రాలతో బిజీగా ఉన్నారు. జూన్ 10న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాల నుంచి ప్రత్యేక అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.