By
Siva Kodati
| Published: Friday, June 5, 2026, 18:30 [IST]
రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా భారీ ఓపెనింగ్స్‌తో సక్సెస్ అందుకుంది. బుచ్చిబాబు సానా, చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌లో అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
1/4
Peddi Movie Success Celebrations: పెద్ది సక్సెస్ సెలబ్రేషన్స్... బాణాసంచా పేల్చి బుచ్చిబాబు సంబరాలు | Ram Charan’s Peddi Creates Box Office Storm, Team Celebrates Massive Success. Here Is Photos - Filmibeat Telugu
/photos/feature/ram-charans-peddi-creates-box-office-storm-team-celebrates-massive-success-here-is-photos-fb108008.html
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, జాన్వీకపూర్ జంటగా నటించిన మూవీ పెద్ది. జూన్ 5న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజైంది. ప్రీమియర్స్ నుంచే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులకు బ్రహ్మరథం పడుతున్నారు. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల రూపాయలకు పైగా ఓపెనింగ్స్ రాబట్టి చరిత్ర సృష్టించింది పెద్ది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాతలు వెంకట సతీష్ కిలారు, మైత్రీ రవిశంకర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బుచ్చిబాబు స్వయంగా బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఆ తర్వాత నిర్మాతలతో కలిసి కెక్ కట్ చేశారు.
2/4
Peddi Movie Success Celebrations: పెద్ది సక్సెస్ సెలబ్రేషన్స్... బాణాసంచా పేల్చి బుచ్చిబాబు సంబరాలు | Ram Charan’s Peddi Creates Box Office Storm, Team Celebrates Massive Success. Here Is Photos - Filmibeat Telugu
/photos/feature/ram-charans-peddi-creates-box-office-storm-team-celebrates-massive-success-here-is-photos-fb108008.html#photos-1
బుచ్చిబాబు మాట్లాడుతూ.. ప్రేక్షకులు చాలా పెద్ద విజయం ఇచ్చారు. ప్రీమియర్స్ నుంచే నా ఫోన్ రింగ్ అవ్వడం ఆగలేదు. ఉప్పెన కంటే 10 రెట్లు రియాక్షన్ వచ్చింది. అందరూ కాల్ చేసి, పెద్ద పెద్ద మెసేజ్‌లు పెట్టి చాలా పెద్ద హిట్ అవుతుందని చెబుతున్నారు. పెద్ది సినిమా చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యామని చెబుతున్నారు. పెద్ది చాలా ఇన్‌స్పిరేషనల్ క్యారెక్టర్ అండీ.. మీ పిల్లలందరినీ తీసుకుని వెళ్లండి. ఈ సినిమాను మీరు ఇంటికి తీసుకెళ్తారని నేను ఏదైతే నమ్మానో అదే జరిగింది. నా టీమ్ అందరినీ మెచ్చుకుంటున్నారు, చరణ్ గారు పడ్డ కష్టాన్ని అందరూ గుర్తిస్తున్నారు. చరణ్ సార్‌కి నా టీమ్ నుంచి థ్యాంక్స్ చెబుతున్నా.. వచ్చే పదిరోజులు కూడా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నానని బుచ్చిబాబు అన్నారు.
3/4
Peddi Movie Success Celebrations: పెద్ది సక్సెస్ సెలబ్రేషన్స్... బాణాసంచా పేల్చి బుచ్చిబాబు సంబరాలు | Ram Charan’s Peddi Creates Box Office Storm, Team Celebrates Massive Success. Here Is Photos - Filmibeat Telugu
/photos/feature/ram-charans-peddi-creates-box-office-storm-team-celebrates-massive-success-here-is-photos-fb108008.html#photos-2
నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున 135 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టింది పెద్ది. చూసినవాళ్లంతా మెచ్చుకుంటున్నారు. రామ్ చరణ్ గారికి కెరీర్ బెస్ట్. టికెట్ రేట్లు పెంచి సహకరించిన ఆంధ్రపదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు. సినిమా కోసం చాలా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి తీశాం.. దానికి వారు సిన్సియర్‌గా సపోర్ట్ చేశారు
4/4
Peddi Movie Success Celebrations: పెద్ది సక్సెస్ సెలబ్రేషన్స్... బాణాసంచా పేల్చి బుచ్చిబాబు సంబరాలు | Ram Charan’s Peddi Creates Box Office Storm, Team Celebrates Massive Success. Here Is Photos - Filmibeat Telugu
/photos/feature/ram-charans-peddi-creates-box-office-storm-team-celebrates-massive-success-here-is-photos-fb108008.html#photos-3
మైత్రీ రవిశంకర్ మాట్లాడుతూ.. పెద్ది సైక్లోన్ వచ్చేసింది. ప్రతి ఏరియా నుంచి పాజిటివ్ రిపోర్ట్ వస్తోంది. లాస్ట్ ఇయర్ ఓ పెద్ద హీరో సినిమా సెకండ్ డేకి చేసిన నెంబర్ కంటే పెద్ది 30 శాతం ఎక్కువగా చేసింది. ఆంధ్రాలో బాగా స్ట్రాంగ్‌గా వెళ్తోంది.. నైజాంలోనూ అదే ఊపు కనిపిస్తోంది. శని, ఆదివారాలలో ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నాం. పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్‌లో ఈ సినిమాను చూడండి. నెక్ట్స్ వీక్ మేమే షాకయ్యే నెంబర్స్‌తో మీ ముందుకు వస్తామని రవిశంకర్ అన్నారు. బుచ్చిబాబు రాయడంతో పాటు మా హీరో రామ్ చరణ్ బాగా నటించారు. ప్రతి ఒక్కరూ ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా థియేటర్ నుంచి బయటికి వచ్చాక అందరూ పెద్ది పెద్ది అనే అంటారని బుచ్చిబాబు చెప్పారు.. ఇప్పుడు అది నిజమైందని అన్నారు. తెలుగు సినిమాలో ఇంత వరకు చూపించని స్పోర్ట్స్ చూపించారు అని రవిశంకర్ తెలిపారు.