bredcrumb

టాలీవుడ్ బిజీ బిజీగా రితికా నాయక్.. క్రేజీ ప్రాజెక్ట్స్ లో మిరాయ్ బ్యూటీ

By Srikanth Nuthi
| Published: Saturday, August 30, 2025, 21:41 [IST]

ప్రస్తుతం మిరాయ్ చిత్రంతో సెప్టెంబర్ 12న ప్రేక్షకులను అలరించబోతోంది.  అందుకు బ్యూటీఫుల్ గా ఫొటోషూట్లు చేస్తోంది.

Actress Ritika Nayak
1/5

యంగ్ అండ్ బ్యూటీపుల్ హీరోయిన్ రితికా నాయక్ తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపును తెచ్చుకుంటుంది. తన క్రేజ్ ను మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటించే అవకాశం దక్కించుకుంటోంది. 

Actress Ritika Nayak
2/5

27 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ నార్త్ లో పుట్టి పెరిగింది. ఢిల్లీలో 1997 అక్టోబర్ 27న జన్మించింది. ఒడియా ఫ్యామిలీకి చెందిన ఆమె ఢిల్లీలోనే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంది. విమెన్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకుంది. 

Actress Ritika Nayak
3/5

ఇక 2019 నుంచి సినీ రంగంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. తొలుత మోడల్ గా 12వ సీజన్ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ 2019లో టైటిల్ ను దక్కించుకుంది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం మల్టిపుల్ ఆడిషన్స్ ఇచ్చింది. 

Actress Ritika Nayak
4/5

2022లో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం అనే చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. తన పెర్ఫామెన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. 

Actress Ritika Nayak
5/5

ప్రస్తుతం మిరాయ్ చిత్రంతో సెప్టెంబర్ 12న ప్రేక్షకులను అలరించబోతోంది. ఆ తర్వాత  ఆనంద్ దేవరకొండ సరసన డ్యూయెట్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన కూడా VT15లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. మరోవైపు బ్యూటీఫుల్ ఫొటోలను పంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+