bredcrumb

ఖుష్బూ కుమార్తె పెళ్లిలో తమన్నా- త్రిష సందడి.. పెళ్లికూతురితో చెలికత్తెలంటూ ఫోజులు

By Siva Kodati
| Published: Saturday, June 27, 2026, 20:13 [IST]

ఖుష్బూ, తమిళ దర్శకుడు సుందర్ సీ దంపతుల పెద్ద కుమార్తె అవంతిక వివాహం శ్రవణ్ శ్రీనివాసన్‌తో గోవాలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తమన్నా భాటియా, త్రిషా కృష్ణన్‌లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. 

Khushboo Sundars daughter Avantika Marriage
1/10

అలనాటి నటి ఖుష్బూ, తమిళ దర్శకుడు సుందర్‌ల కుమార్తె అవంతిక- శ్రావణ్‌ శ్రీనివాసన్‌ల వివాహం జూన్ 25న గోవాలో జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు, ఇతర  సెలబ్రిటీలు హాజరయ్యారు. తాజాగా మిల్కీబ్యూటీ తమన్నా ఈ వేడుకలో పాల్గొన్నట్లుగా తెలియజేస్తూ దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. 

Khushboo Sundars daughter Avantika Marriage
2/10

తమన్నా భాటియా- ఖుష్బూల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సుందర్ దర్శకత్వంలో అర్ణామలై అనే సినిమాలో తమన్నా నటించారు. ఇందులో రాశీ ఖన్నా కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. నాటి నుంచి సుందర్ కుటుంబంతో తమన్నాకు అనుబంధం ఉంది.

Khushboo Sundars daughter Avantika Marriage
3/10

శ్రవణ్ - అవంతికల పెళ్లికి తమన్నాని కూడా ఆహ్వానించారు ఖష్బూ - సుందర్. దాంతో తమన్నా వైట్ కలర్ డ్రెస్‌లో స్వయంగా తయారు చేసుకున్న ఆభరణాలను ధరించి హాజరయ్యారు. ఈ సందర్భంగా కోలీవుడ్ అగ్రనటి త్రిషతో కలిసి తమన్నా సందడి చేశారు. సెల్ఫీలు దిగుతూ హల్ చల్ చేశారు. ఈ మేరకు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

Khushboo Sundars daughter Avantika Marriage
4/10

అద్భుతమైన క్షణాలు అంటూ తమన్నా భాటియా ఈ ఫోటోల గురించి రాసుకొచ్చారు. మనం ఎంత దూరంలో ఉన్నా, అప్పుడప్పుడు కలుస్తున్నా సరే కొందరితో మనకు ఎప్పుడూ ఒక అనుబంధం ఉంటుంది. ఈ ప్రయాణంలో పరిచయమయ్యే స్నేహితులు అత్యంత విలువైన వారు అని తమన్నా చెప్పారు. 

Khushboo Sundars daughter Avantika Marriage
5/10

స్నేహితులంటే మనకు కుటుంబమే. ఎట్టకేలకు బృందా అక్కతో ఫోటోలు దిగగలిగాను. అలాగే ఏదో ఒకరోజు నేను స్వయంగా తయారు చేసుకున్న నగలు ధరిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. పెళ్లికూతురికి చెలికత్తెలమంటూ అవంతిక తదితరులతో ఉన్న ఫోటోలను తమన్నా భాటియా పంచుకున్నారు.

Khushboo Sundars daughter Avantika Marriage
6/10

ఇదిలాఉండగా ఇటీవల దక్షిణాది చిత్ర పరిశ్రమపై తమన్నా భాటియా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దక్షిణాదిలో మేల్ డామినేషన్ ఎక్కువ, హీరోయిన్లను అక్కడ గౌరవంగా చూపించరని ఈ విషయంలో బాలీవుడ్ చాలా బెటర్ అని మిల్కీ బ్యూటీ వ్యాఖ్యానించింది. 

Khushboo Sundars daughter Avantika Marriage
7/10

బాలీవుడ్‌లో గ్లామర్ షో చేసేవారు, నటనకు ప్రాధాన్యత ఇచ్చేవారు.. ఇలా రెండు రకాల హీరోయిన్లు ఉంటారు. ఈ రెండు చేయడానికి హిందీ పరిశ్రమ అవకాశం కల్పిస్తుంది. రెండు చేయగలిగితే బాలీవుడ్ సూపర్‌స్టార్స్‌ను చేస్తుంది. కానీ  దక్షిణాదిలో మాత్రం గ్లామర్ షో, డ్యాన్స్‌, నటనతో సమన్వయం చేయగలిగిన వారే స్టార్లుగా ఎదుగుతారని తమన్నా వ్యాఖ్యానించింది. 

Khushboo Sundars daughter Avantika Marriage
8/10

అలాగే ఐటెం సాంగ్స్ చేయడంపైనా తమన్నా భాటియా స్పందించింది. సినిమాలతో పోలిస్తే ఐటెం సాంగ్సే ప్రజలకు బాగా గుర్తుంటాయి. కత్రినా కైఫ్, కరీనా కపూర్‌లు గతంలో చేసిన చమ్మక్ చల్లో, షీలాకీ జవానీ వంటి పాటలు బాగా పాపులర్ అయ్యాయని.. సినిమాలు హిట్ కాకపోయినా వీటిని జనం గుర్తుపెట్టుకున్నారని మిల్కీ బ్యూటీ పేర్కొంది.

Khushboo Sundars daughter Avantika Marriage
9/10

తమన్నా భాటియా వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. నీకు జీవితాన్ని, క్రేజ్‌ను ఇచ్చింది దక్షిణాది పరిశ్రమే. ఇక్కడ 80 సినిమాలు చేస్తే హిందీలో కేవలం 15 సినిమాలు మాత్రమే చేశావు. కేవలం కొన్ని ఐటెం సాంగ్స్ కోసం దక్షిణాది పరిశ్రమను కించపరచడం మీ స్థాయికి తగదంటూ నెటిజన్లు చురకలంటిస్తున్నారు. 

X