bredcrumb

ఘనంగా ఖుష్బూ సుందర్ కుమార్తె పెళ్లి... వేదికపై చిరంజీవి, నాగ్, వెంకీ సందడి

By Siva Kodati
| Updated: Friday, June 26, 2026, 22:36 [IST]

బీజేపీ నేత, అలనాటి నాటి ఖుష్బూ, తమిళ దర్శకుడు సుందర్ సీ దంపతుల పెద్ద కుమార్తె అవంతిక వివాహం శ్రవణ్ శ్రీనివాసన్‌తో గోవాలో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఖుష్బూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

Khushboo Sundars daughter Avantika Marriage
1/12

కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ, దర్శకుడు సుందర్‌ల కుమార్తె అవంతిక- శ్రావణ్‌ శ్రీనివాసన్‌ల వివాహం జూన్ 25న గోవాలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, అనిల్ కపూర్, జాకీష్రాఫ్‌ తదితరులు కుటుంబ సమేతంగా ఈ పెళ్లికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

Khushboo Sundars daughter Avantika Marriage
2/12

శ్రవణ్- అవంతికలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు వీరి వివాహానికి అంగీకరించడంతో గోవాలో వీరి పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశారు ఖుష్బూ- సుందర్. ప్రధాని నరేంద్రమోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సహా సినీ, రాజకీయ ప్రముఖులను ఈ పెళ్లికి ఆహ్వానించారు.

Khushboo Sundars daughter Avantika Marriage
3/12

అవంతిక - శ్రవణ్‌ల పెళ్లికి చిరంజీవి- సురేఖ, నాగార్జున - అమల, వెంకటేష్- నీరజ దంపతులు సాంప్రదాయబద్ధంగా ముస్తాబై సందడి చేశారు. ఇక తమ మిత్రులు బాలీవుడ్ దిగ్గజాలు అనిల్ కపూర్, జాకీష్రాఫ్‌లను చాలారోజుల తర్వాత కలుసుకోవడంతో వీరంతా ఫోటోలు దిగుతూ, అల్లరి చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. 

Khushboo Sundars daughter Avantika Marriage
4/12

ఇక కోలీవుడ్ అగ్రనటి త్రిష కూడా అవంతిక- శ్రవణ్‌ల పెళ్లికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పక్కనే కూర్చొని కనిపించారు. కోలీవుడ్ ప్రముఖులు చాలామంది ఈ వివాహానికి హాజరుకాలేదు. ప్రధానంగా సీఎం విజయ్ రాకపోవడం.. త్రిష ఒక్కరే హాజరుకావడం హాట్ టాపిక్‌గా మారింది. 

Khushboo Sundars daughter Avantika Marriage
5/12

పెళ్లికి సంబంధించిన ఫోటోను ఖుష్బూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్బంగా తమ కుమార్తె పెళ్లి వేడుక గురించి తెలియజేస్తూ ఆమె ఎమోషనల్ అయ్యారు. ఈ క్షణంలో మాటలు రావడం లేదు.. మేం అనుభవిస్తున్న ఆనందాన్ని వ్యక్తపరచడానికి మాటలు సరిపోవు అని ఖుష్బూ రాసుకొచ్చారు. 

Khushboo Sundars daughter Avantika Marriage
6/12

ఒకదశలో ఖుష్బూకు పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పడంతో తనను మరిచిపోయి మరో పెళ్లి చేసుకోమని సుందర్‌కి చెప్పారట. కానీ ఆయన మాత్రం పిల్లలు పుట్టకపోయినా పర్లేదు కానీ ఖుష్బూని వదులుకునే ప్రసక్తే లేదని తేల్చేశారట. భగవంతుడి ఆశీస్సులతో వీరికి అవంతిక, ఆనందిత కలిగారు. 

Khushboo Sundars daughter Avantika Marriage
7/12

తల్లిదండ్రులుగా.. మా కుటుంబం ఎప్పుడూ మా గుండెల్లోనే ఉంటుంది. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని మేం నమ్ముతాం. అవంతిక- శ్రవణ్‌ల వివాహం జూన్ 25న అట్టహాసంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుక మా గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. అవంతిక - శ్రవణ్‌ల వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని, కొత్త జంటకి మీ ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నామని ఖుష్బూ ఆకాంక్షించారు.

Khushboo Sundars daughter Avantika Marriage
8/12

చిరంజీవితో ఖుష్బూ హీరోయిన్‌గా నటించనప్పటికీ స్టాలిన్ సినిమాలో ఆయనకు అక్కగా కీలకపాత్ర పోషించారు. 80ల నాటి నటీనటుల ఆత్మీయ కలయికలతో తరచుగా పాల్గొంటూ వస్తున్నారు చిరంజీవి- ఖుష్బూ. అలాగే హైదరాబాద్‌లో ఏ కార్యక్రమం జరిగినా ఖచ్చితంగా చిరంజీని ఖచ్చితంగా కలుస్తారు ఖుష్బూ. 

Khushboo Sundars daughter Avantika Marriage
9/12

ఇక అక్కినేని నాగార్జునతో ఖుష్బూ పలు చిత్రాలలో హీరోయిన్‌గా నటించారు. శాంతి క్రాంతి, కిరాయి దాదా, కెప్టెన్ నాగార్జునతో పాటు హిందీ చిత్రాలు  క్రాంతికి ఆగ్, రౌడీ ది సూపర్‌ హీరో చిత్రాలలో నటించారు ఖుష్బూ. నాగార్జునతో నాటి నుంచి నేటి వరకు అదే స్నేహాన్ని కొనసాగిస్తున్నారు ఈ సీనియర్ నటి.

X