bredcrumb

నా పని అయిపోయిందన్నారు... మా ఇంటి బంగారం ఈవెంట్‌లో సమంత ఎమోషనల్

By Siva Kodati
| Published: Thursday, June 25, 2026, 09:19 [IST]

హైదరాబాద్‌లో జరిగిన మా ఇంటి బంగారం సక్సెస్ సెల్రబేషన్స్‌లో తన కెరీర్‌పై వచ్చిన కామెంట్స్‌పై హీరోయిన్ సమంత ఎమోషనల్ అయ్యారు. 

Maa Inti Bangaram Team Success Celebrations
1/9

బీవీ నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ ఘన విజయం సాధించింది. జూన్ 19న విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 50 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సమంత స్టార్ పవర్ ఏంటో చూపించింది. అన్ సీజన్‌లో రిలీజై భారీ విజయం అందుకోవడంపై ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Maa Inti Bangaram Team Success Celebrations
2/9

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌నపై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరులు మా ఇంటి బంగారం మూవీని నిర్మించారు. గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, మంజూష, చైతన్య కృష్ణ, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, శ్రీలక్ష్మీ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా.. ఓం ప్రకాష్ సినిమాటోగ్రాఫర్‌గా, ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. 

Maa Inti Bangaram Team Success Celebrations
3/9

సినిమా ఘన విజయం సాధించడంతో మా ఇంటి బంగారం చిత్ర యూనిట్ జూన్ 24న హైదరాబాద్‌లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సమంత, రాజ్ నిడిమోరు, నందినీ రెడ్డి, శ్రీముఖి, హిమాంక్ దువ్వూరు తదితరులు హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

Maa Inti Bangaram Team Success Celebrations
4/9

సమంత మాట్లాడుతూ.. ఈ విజయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాను. ఇలాంటి విజయం ప్రతి ఆర్టిస్ట్ కోరుకుంటారు. ప్రతి సినిమాకు ఇంకా ఏదైనా కొత్తగా చేయాలి, సక్సెస్‌లో మన కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలని అనుకుంటారు. సినిమా చేసేటప్పుడు బడ్జెట్ పరిమితులతో చాలా తక్కువ రోజుల్లోనే చేశాం. ఒక్కరోజులోనే బస్ ఫైట్స్, ఫిల్లర్ సీన్స్ అన్నీ చేశాం. ప్రీ రిలీజ్‌తోనే రికవరీ అవ్వాలని అనుకున్నాం.. ఎందుకంటే ఫస్ట్ డే రోజున ఎన్ని టికెట్లు సేల్ అవుతాయో తెలియదు కదా అని అన్నారు.

Maa Inti Bangaram Team Success Celebrations
5/9

మూడేళ్ల తర్వాత తెలుగులో సినిమా చేస్తున్నాను.. ఇదంతా బోనస్‌గా వచ్చింది. ఓ స్టార్ హీరోని ఎలా హైప్ చేస్తారో .. మా టీమ్ అంతా కలిసి హీరోయిన్‌ని హైప్ చేసింది. స్క్రిప్ట్‌లో కమర్షియల్ హంగులు ఉండేలా రాజ్ గారు డిజైన్ చేశారు. ఈ సినిమాలో నటించిన మంజూష లాగే నా బెస్ట్ ఫ్రెండ్ మేఘన ఉంటుంది. చిన్నప్పటి నుంచి బాగా వాడుకుంటానని సమంత తెలిపారు.

Maa Inti Bangaram Team Success Celebrations
6/9

రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. హిందీలో ఎన్నో చేశాను.. ఫ్యామిలీ మెన్ తదితర  చిత్రాలు ఎంతో వైడ్‌గా వెళ్లాయి. కానీ నాకు ఈ సినిమాకు వచ్చినంత పేరు ఎక్కడా రాలేదు. మా వాళ్లంతా తిరుపతిలో ఇప్పుడు లేచారు... ఎంత బాగా తీశావురా అని అడుగుతున్నారు. మా ఇంటి బంగారం సినిమా ప్రతి ఇంటిలోకి వెళ్లిందని చెప్పారు.

Maa Inti Bangaram Team Success Celebrations
7/9

హీరోయిన్‌గా ఎన్నో కమర్షియల్ సినిమాలు చేశాను.. ఒక చోటే ఆగిపోతే నేనేం చేయగలనో నాకు తెలియదు, జీవితంలో డౌన్‌ఫాల్ చూశాను.. సమంత సీన్ అయిపోయిందని, హీరోయిన్‌గా ఇక కష్టమని కూడా రాశారు. వాటికి నేనేం బాధపడలేదు.. ఎందుకంటే ఒకదశలో అవి నిజమే. కానీ ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ గట్టిగా కొట్టాలని ఛాలెంజ్‌గా తీసుకుని కమ్ బ్యాక్ ఇచ్చా. పోస్టర్ రిలీజ్ దగ్గరి నుంచి మార్కెటింగ్, కంటెంట్ ఇలా ప్రతి దానిలో నా టీమ్ నూటికి నూరు శాతం ది బెస్ట్ ఇచ్చింది అని సమంత తెలిపారు.

Maa Inti Bangaram Team Success Celebrations
8/9

లేడీ ఫ్యాన్స్ నాకెప్పుడూ ఇన్‌స్పిరేషన్. దేవుడు నన్ను ఈ పొజిషన్‌లో పెట్టాడు, దానిని నిలబెట్టుకోవడానికి ప్రతిరోజూ కష్టపడుతూనే ఉంటా. సినిమా చూస్తున్న వారిని మీకేం నచ్చిందని అడిగితే సమంత ఫైట్స్ నచ్చాయని చెబుతున్నారు. ఆ మాటలు విన్నప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తోందని సమంత ఎమోషనల్ అయ్యారు. 

Maa Inti Bangaram Team Success Celebrations
9/9

మా ఇంటి బంగారం సక్సెస్ అయ్యింది కదా మరి పెళ్లెప్పుడు చేసుకుంటున్నావని శ్రీముఖిని మీడియా ప్రతినిధులు అడగ్గా.. పెళ్లి నుంచి నేను ఎస్కేప్ అవ్వను. దేవుడు కనుక రాసిపెడితే అవుతుందని శ్రీముఖి తెలిపారు. 

X