By
Siva Kodati
| Published: Friday, June 26, 2026, 09:13 [IST]
కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న ఎన్‌బీకే 112 మూవీ గ్రాండ్ లాంచ్ పూజా కార్యక్రమాలతో మొదలైంది. అమరావతిలో జూన్ 25న ఈ కార్యక్రమం జరిగింది. మంత్రి నారా లోకేష్, నందమూరి తేజస్విని హాజరయ్యారు
1/7
NBK 112 Movie: ముద్దుల మావయ్యపై క్లాప్ కొట్టిన అల్లుడు.. ఎన్‌బీకే 112 గ్రాండ్ ఓపెనింగ్ | Nandamuri Balakrishna- Koratala Siva's NBK 112 Movie Grand Opening Pooja Ceremony - Filmibeat Telugu
/photos/feature/nandamuri-balakrishna-koratala-sivas-nbk-112-movie-grand-opening-pooja-ceremony-fb108474.html
నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ వయసులోనూ కుర్రాళ్లను మించి దూసుకెళ్తున్నారు. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమా చేస్తున్న ఆయన ఆ మూవీని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఆలోపు మరో మూవీని సెట్స్ మీదకి తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించనున్నారు. కొరటాల చెప్పిన కథ నచ్చడంతో దానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
2/7
NBK 112 Movie: ముద్దుల మావయ్యపై క్లాప్ కొట్టిన అల్లుడు.. ఎన్‌బీకే 112 గ్రాండ్ ఓపెనింగ్ | Nandamuri Balakrishna- Koratala Siva's NBK 112 Movie Grand Opening Pooja Ceremony - Filmibeat Telugu
/photos/feature/nandamuri-balakrishna-koratala-sivas-nbk-112-movie-grand-opening-pooja-ceremony-fb108474.html#photos-1
బాలయ్య నుంచి అనుమతి రాగానే సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లేందుకు కొరటాల వేగంగా పావులు కదిపారు. ఈ క్రమంలోనే జూన్ 25న NBK 112 సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. అమరావతిలో బాలయ్య - కొరటాల మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
3/7
NBK 112 Movie: ముద్దుల మావయ్యపై క్లాప్ కొట్టిన అల్లుడు.. ఎన్‌బీకే 112 గ్రాండ్ ఓపెనింగ్ | Nandamuri Balakrishna- Koratala Siva's NBK 112 Movie Grand Opening Pooja Ceremony - Filmibeat Telugu
/photos/feature/nandamuri-balakrishna-koratala-sivas-nbk-112-movie-grand-opening-pooja-ceremony-fb108474.html#photos-2
NBK 112 మూవీ ఓపెనింగ్ కార్యక్రమానికి బాలయ్య అల్లుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ క్లాప్ కొట్టగా, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వీరితో పాటు బాలకృష్ణ చిన్నకుమార్తె తేజస్విని, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, దర్శకుడు గోపీచంద్ మలినేని తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
4/7
NBK 112 Movie: ముద్దుల మావయ్యపై క్లాప్ కొట్టిన అల్లుడు.. ఎన్‌బీకే 112 గ్రాండ్ ఓపెనింగ్ | Nandamuri Balakrishna- Koratala Siva's NBK 112 Movie Grand Opening Pooja Ceremony - Filmibeat Telugu
/photos/feature/nandamuri-balakrishna-koratala-sivas-nbk-112-movie-grand-opening-pooja-ceremony-fb108474.html#photos-3
NBK 112 మూవీని ఎల్ఎల్‌వీ సినిమాస్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలయ్య ఇమేజ్‌కు తోడు కొరటాల మార్క్ సామాజిక సందేశంతో ఉండే బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను 150 నుంచి 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు టాక్. 2027 సమ్మర్ కానుకగా ఎన్‌బీకే 112 రిలీజ్ కానుంది.
5/7
NBK 112 Movie: ముద్దుల మావయ్యపై క్లాప్ కొట్టిన అల్లుడు.. ఎన్‌బీకే 112 గ్రాండ్ ఓపెనింగ్ | Nandamuri Balakrishna- Koratala Siva's NBK 112 Movie Grand Opening Pooja Ceremony - Filmibeat Telugu
/photos/feature/nandamuri-balakrishna-koratala-sivas-nbk-112-movie-grand-opening-pooja-ceremony-fb108474.html#photos-4
తన జీవితంలో ఎప్పుడూ సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లలేదని, ఈ అద్భుత అవకాశం ఇచ్చిన ముద్దుల మావయ్య జై బాలయ్యకు ధన్యవాదాలు. బాలకృష్ణ గారి నాయకత్వంలో సినీ పరిశ్రమను అమరావతిలో ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. సినిమాతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా ప్రోత్సహించేలా సీఎం చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారని లోకేష్ తెలిపారు.
6/7
NBK 112 Movie: ముద్దుల మావయ్యపై క్లాప్ కొట్టిన అల్లుడు.. ఎన్‌బీకే 112 గ్రాండ్ ఓపెనింగ్ | Nandamuri Balakrishna- Koratala Siva's NBK 112 Movie Grand Opening Pooja Ceremony - Filmibeat Telugu
/photos/feature/nandamuri-balakrishna-koratala-sivas-nbk-112-movie-grand-opening-pooja-ceremony-fb108474.html#photos-5
బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఒక పెద్ద సినిమాకు క్లాప్ కొట్టి 20 ఏళ్లు అవుతోంది. అన్నేళ్ల తర్వాత మళ్లీ ఒక పెద్ద సినిమాను ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో సినీ పరిశ్రమను అభివృద్ది చేయాలని సీఎం చంద్రబాబు, సోదరుడు పవన్ కళ్యాణ్ గారు సంకల్పించారు. రాష్ట్రం విడిపోయినా, కలిసున్నా చలనచిత్ర పరిశ్రమకు విజయవాడే రాజధాని అని బాలయ్య తెలిపారు.
7/7
NBK 112 Movie: ముద్దుల మావయ్యపై క్లాప్ కొట్టిన అల్లుడు.. ఎన్‌బీకే 112 గ్రాండ్ ఓపెనింగ్ | Nandamuri Balakrishna- Koratala Siva's NBK 112 Movie Grand Opening Pooja Ceremony - Filmibeat Telugu
/photos/feature/nandamuri-balakrishna-koratala-sivas-nbk-112-movie-grand-opening-pooja-ceremony-fb108474.html#photos-6
NBK 112 మూవీ కథ, నటీనటులు, సాంకేతిక నిపుణుల, షూటింగ్ షెడ్యూల్ తదితర వివరాలు తెలియాల్సి ఉంది. గోపీచంద్ మలినేని మూవీని త్వరగా పూర్తి చేసి కొరటాల మూవీ సెట్స్‌లో బాలయ్య జాయిన్ అవుతారని అంటున్నారు. లేనిపక్షంలో రెండు సినిమాల షూటింగ్స్‌ని ఏకకాలంలో నిర్వహించేలా బాలయ్య ప్లాన్ చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.