By
Siva Kodati
| Published: Thursday, July 2, 2026, 11:01 [IST]
ప్రముఖ దర్శకుడు మెహర్ రమేశ్ కుమార్తె మోహన- అనిరుధ్‌ల వివాహం జూన్ 1వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ సహా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
1/3
ఘనంగా మెహర్ రమేశ్ కుమార్తె వివాహం.. హాజరైన చిరంజీవి, పవన్, వెంకటేష్ | Meher Ramesh’s Daughter Mohana Tied The Knot With Anirudh. Chiranjeevi And Pawan Kalyan Others Attend The Ceremony - Filmibeat Telugu
/photos/feature/meher-rameshs-daughter-mohana-tied-the-knot-with-anirudh-chiranjeevi-and-pawan-kalyan-others-attend-the-ceremony-fb108620.html
టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ కుమార్తె మోహన వివాహం- అనిరుధ్‌తో జూలై 1వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. మాజీ ఐఏఎస్ అధికారి, ప్రముఖ నేత తోట చంద్రశేఖర్ కుమారుడే అనిరుధ్. ఇటీవలే మోహన- అనిరుధ్‌ల నిశ్చితార్థం ఐటీసీ కోహినూర్‌లో ఘనంగా జరగ్గా.. తాజాగా పెళ్లి జరిగింది.
2/3
ఘనంగా మెహర్ రమేశ్ కుమార్తె వివాహం.. హాజరైన చిరంజీవి, పవన్, వెంకటేష్ | Meher Ramesh’s Daughter Mohana Tied The Knot With Anirudh. Chiranjeevi And Pawan Kalyan Others Attend The Ceremony - Filmibeat Telugu
/photos/feature/meher-rameshs-daughter-mohana-tied-the-knot-with-anirudh-chiranjeevi-and-pawan-kalyan-others-attend-the-ceremony-fb108620.html#photos-1
ఈ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ తదితర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంపతులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన సతీమణి అన్నా లెజ్‌నోవా దంపతులు ఈ వివాహానికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
3/3
ఘనంగా మెహర్ రమేశ్ కుమార్తె వివాహం.. హాజరైన చిరంజీవి, పవన్, వెంకటేష్ | Meher Ramesh’s Daughter Mohana Tied The Knot With Anirudh. Chiranjeevi And Pawan Kalyan Others Attend The Ceremony - Filmibeat Telugu
/photos/feature/meher-rameshs-daughter-mohana-tied-the-knot-with-anirudh-chiranjeevi-and-pawan-kalyan-others-attend-the-ceremony-fb108620.html#photos-2
నిర్మాత అల్లు అరవింద్, విక్టరీ వెంకటేష్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణంరాజు, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్, వైసీపీ నేత అంబటి రాంబాబు, అశ్వినీదత్, ఏఎం రత్నం, బన్నీవాసు, మురళీ మోహన్, ప్రభుదేవా, యాంకర్ సుమ కనకాల తదితరులు హాజరయ్యారు.