By
Siva Kodati
| Published: Wednesday, June 24, 2026, 09:52 [IST]
హైదరాబాద్‌లో పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, బుచ్చిబాబు సానా, అనిల్ రావిపూడి తదితరులు హాజరయ్యారు
1/11
PEDDI Mega Blockbuster Event: మెగా కాంపౌండ్‌కు అలాంటివి తెలియదు.. పెద్ది ఈవెంట్‌లో చిరంజీవి | Ram Charans PEDDI Mega Blockbuster Event Photos - Filmibeat Telugu
/photos/feature/ram-charans-peddi-mega-blockbuster-event-photos-fb108418.html
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన మూవీ పెద్ది. జూన్ 19న వరల్డ్ వైడ్‌గా రిలీజై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. పెద్దికి ఇప్పటి వరకు 400 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో జూన్ 23న పెద్ది సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.
2/11
PEDDI Mega Blockbuster Event: మెగా కాంపౌండ్‌కు అలాంటివి తెలియదు.. పెద్ది ఈవెంట్‌లో చిరంజీవి | Ram Charans PEDDI Mega Blockbuster Event Photos - Filmibeat Telugu
/photos/feature/ram-charans-peddi-mega-blockbuster-event-photos-fb108418.html#photos-1
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, సుకుమార్ తదితరులు ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిస్ట్రిబూటర్లకు, ఎగ్జిబిటర్లకు, చిత్ర యూనిట్‌కు చిరంజీవి చేతులు మీదుగా జ్ఞాపికాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మెగా అభిమానులు హాజరయ్యారు.
3/11
PEDDI Mega Blockbuster Event: మెగా కాంపౌండ్‌కు అలాంటివి తెలియదు.. పెద్ది ఈవెంట్‌లో చిరంజీవి | Ram Charans PEDDI Mega Blockbuster Event Photos - Filmibeat Telugu
/photos/feature/ram-charans-peddi-mega-blockbuster-event-photos-fb108418.html#photos-2
చిరు మాట్లాడుతూ.. కష్టపడితే ఏదైనా సాధ్యం, అందుకు ప్రతిఫలంగా మమ్మల్ని ప్రేక్షకులు తమ హృదయాలలో పెట్టుకున్నారని చిరు అన్నారు. పెద్ది లాంటి సినిమాలు ఎన్నో రావాలి.. చిత్ర పరిశ్రమ సుభిక్షంగా ఉండాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. బడ్జెట్‌కు వెనకడుగు వేయకుండా సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పెద్దిని నిర్మించిన నిర్మాత వెంకట సతీశ్ కిలారును చిరు అభినందించారు.
4/11
PEDDI Mega Blockbuster Event: మెగా కాంపౌండ్‌కు అలాంటివి తెలియదు.. పెద్ది ఈవెంట్‌లో చిరంజీవి | Ram Charans PEDDI Mega Blockbuster Event Photos - Filmibeat Telugu
/photos/feature/ram-charans-peddi-mega-blockbuster-event-photos-fb108418.html#photos-3
పెద్ది సినిమాను చూస్తుంటే భావోద్వేగానికి గురయ్యాను. ఇలాంటి అనుభూతి వచ్చే సినిమాలు చాలా అరుదుగా రిలీజ్ అవుతాయి. కథలోని పాత్రలు అనుభవించే బాధను నేను కూడా అనుభవించానని చిరు చెప్పారు. ఈ కథకు రామ్ చరణ్ మాత్రమే న్యాయం చేయగలరని నమ్మని దర్శకుడు బుచ్చిబాబు సానాకి ధన్యవాదలు తెలిపారు చిరంజీవి.
5/11
PEDDI Mega Blockbuster Event: మెగా కాంపౌండ్‌కు అలాంటివి తెలియదు.. పెద్ది ఈవెంట్‌లో చిరంజీవి | Ram Charans PEDDI Mega Blockbuster Event Photos - Filmibeat Telugu
/photos/feature/ram-charans-peddi-mega-blockbuster-event-photos-fb108418.html#photos-4
గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలంలో రామ్ చరణ్ నటన ఓ స్థాయిలో ఉంటుంది. మళ్లీ రంగస్థలం లాంటి సినిమా చరణ్‌కు రావాలంటే ఎన్నేళ్లు పడుతుందో అనుకున్నా.. కానీ రామ్ చరణ్ చాలా అదృష్టవంతుడు, ఆయనకి త్వరగానే ఇలాంటి సినిమా వచ్చింది. సినిమా కోసం ఎలా కష్టపడాలో, ఎంత శ్రమించాలో చరణ్ నిరూపించారు. ఇది నేషనల్ అవార్డ్‌ని తెచ్చిపెట్టే స్థాయి నటన అని చిరంజీవి ప్రశంసించారు.
6/11
PEDDI Mega Blockbuster Event: మెగా కాంపౌండ్‌కు అలాంటివి తెలియదు.. పెద్ది ఈవెంట్‌లో చిరంజీవి | Ram Charans PEDDI Mega Blockbuster Event Photos - Filmibeat Telugu
/photos/feature/ram-charans-peddi-mega-blockbuster-event-photos-fb108418.html#photos-5
ఇటీవల ప్రధాన మంత్రితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. చరణ్‌ని న్యూఏజ్ మెగాస్టార్ అని అన్నారని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. బిడ్డలు ఎదిగినప్పుడు పొందే ఆనందం అంతా ఇంతా కాదు.. రంగస్థలం తర్వాత కొంత ఆ ఆనందాన్ని అనుభవించగా.. పెద్ది తర్వాత వంద శాతం పుత్రోత్సాహాన్ని ఆస్వాదిస్తున్నానని చిరంజీవి పొంగిపోయారు.
7/11
PEDDI Mega Blockbuster Event: మెగా కాంపౌండ్‌కు అలాంటివి తెలియదు.. పెద్ది ఈవెంట్‌లో చిరంజీవి | Ram Charans PEDDI Mega Blockbuster Event Photos - Filmibeat Telugu
/photos/feature/ram-charans-peddi-mega-blockbuster-event-photos-fb108418.html#photos-6
బద్ధకం, వాయిదాలు మెగా కాంపౌండ్‌లో వినిపించవు.. నా బిడ్డ పైకొచ్చినా సరే నేను మాత్రం జీవితాంతం నటిస్తాను, ఓపిక ఉన్నంత వరకు కష్టపడతాను. పేరు, డబ్బు కోసం కాదు.. పనిచేయడంలో ఉండే ఆనందమే వేరు. పెద్ది సినిమా కోసం శ్రమించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు చిరంజీవి.
8/11
PEDDI Mega Blockbuster Event: మెగా కాంపౌండ్‌కు అలాంటివి తెలియదు.. పెద్ది ఈవెంట్‌లో చిరంజీవి | Ram Charans PEDDI Mega Blockbuster Event Photos - Filmibeat Telugu
/photos/feature/ram-charans-peddi-mega-blockbuster-event-photos-fb108418.html#photos-7
రామ్ చరణ్ మాట్లాడుతూ.. పెద్దితో నా గుండెల్లో నిలిచిపోయే విజయాన్ని అందించారు. ఇకపై రామ్ చరణ్ అనే పేరుని మరిచిపోయి పెద్ది అనే గుర్తుపెట్టుకుంటారేమో. నా కూతురు క్లీంకార నన్ను ముందు నాన్న.. నాన్న అని పిలిచేది కానీ పెద్ది విడుదల తర్వాత పెద్ది నాన్న అని పిలుస్తోందని చరణ్ అన్నారు.
9/11
PEDDI Mega Blockbuster Event: మెగా కాంపౌండ్‌కు అలాంటివి తెలియదు.. పెద్ది ఈవెంట్‌లో చిరంజీవి | Ram Charans PEDDI Mega Blockbuster Event Photos - Filmibeat Telugu
/photos/feature/ram-charans-peddi-mega-blockbuster-event-photos-fb108418.html#photos-8
పెద్ది సినిమా నా జీవితాన్ని మార్చేసింది. నా కెరీర్‌లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలపై లభించిన ప్రేమ, అభిమానం వేరు.. పెద్ది వేరు. ఇలాంటి జ్ఞాపకాన్ని ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబుకు థ్యాంక్స్ చెప్పారు రామ్ చరణ్.