bredcrumb

నాగబంధం అనేది సినిమా కాదు.. ఓ ఎక్స్‌పీరియన్స్.. హీరో విరాట్ కర్ణ

By Siva Kodati
| Published: Wednesday, July 1, 2026, 20:51 [IST]

అభిషేక్ నామా దర్శకత్వంలో నభా నటేష్, విరాట్ కర్ణ జంటగా నటించిన భారీ బడ్జెట్ మూవీ నాగబంధం. జూలై 3న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. హైదరాబాద్‌లో జూలై 1వ తేదీన నాగబంధం మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ కార్యక్రమం జరిగింది. 

Nagabandham Movie Pre Release
1/8

ఫాంటసీ, గ్రాఫిక్స్ ప్రధానంగా ఉన్న సినిమాలకు ప్రస్తుత కాలంలో మంచి ఆదరణ లభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వస్తోన్న మూవీ నాగబంధం. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని సంపద, బ్రహ్మకమలం, నాగబంధం ఇతివృత్తంగా ఈ సినిమాను తెరెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

Nagabandham Movie Pre Release
2/8

అభిషేక్ పిక్చర్స్, నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డిలు నాగబంధం మూవీని నిర్మించగా.. ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, దక్ష నగార్కర్, మహేశ్ మంజ్రేకర్, జగపతి బాబు, అనసూయ, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించారు.

Nagabandham Movie Pre Release
3/8

ఎస్ సౌందర్ రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. జునైద్ కుమార్, అభిలు సంగీతం అందించారు. ఆర్‌సీ ప్రణవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా జూలై 3న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ జూలై 1వ తేదీన హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. చిత్ర యూనిట్ మొత్తం ఈ కార్యక్రమానికి తరలివచ్చింది.

Nagabandham Movie Pre Release
4/8

హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి  పనిచేశా. మీ గుండెల్లో చోటు సంపాదించుకోవడానికి 100 శాతం కష్టపడ్డా. మార్నింగ్  సెట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి షూట్ పూర్తి చేసే వరకు అభిషేక్ సార్ జాగ్రత్తలు తీసుకున్నారు. మేం రెండేళ్లు కష్టపడితే  ఆయన నాలుగు సంవత్సరాలు ఈ సినిమా కోసం పనిచేశారు అని విరాట్ కర్ణ చెప్పారు.

Nagabandham Movie Pre Release
5/8

మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఆయన చూపించారు. నాగబంధం అనేది ఓ సినిమా కాదు.. ఓ ఎక్స్‌పీరియన్స్. మన ఇండియన్ కల్చర్‌‌ని మనమంతా థియేటర్స్‌లో సెలబ్రేట్ చేసుకోవాలి. అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నారు విరాట్ కర్ణ.

Nagabandham Movie Pre Release
6/8

ఇందులో నా క్యారెక్టర్ పేరు రాగసాధు. సెకండ్ మూవీకే ఇంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ రావడం అంటే ఛాలెంజింగ్‌గా ఫీలయ్యాను. చేస్తావా? చేయవా? అని కాకుండా ఎందుకు చేయలేదని ఆలోచించా. సినిమా అయ్యాక ఓ కసి మీద ఉన్నోడికి ఇలాంటి స్క్రిప్ట్ వస్తే ఏం చేయగలడో అని చూపించారు. 100 శాతం ఎఫర్ట్ పెట్టి సినిమా చేశాను. లెజెండ్స్ ఎన్టీఆర్, చిరంజీవి సార్‌లు గతంలో లార్డ్ శివ క్యారెక్టర్ చేశారు. నాకు సెకండ్ సినిమాకి రావడం అంటే  శివుడి ఆశీస్సుల వల్లేనని విరాట్ కర్ణ చెప్పారు.

Nagabandham Movie Pre Release
7/8

అఖండ చేసేటప్పుడు బాలయ్య బాబు గారిని దగ్గరి నుంచి చూశాను. క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు నాన్ వెజ్ తినరు. నా జీవితంలో నాకు అలాంటి నాగసాధు క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను కూడా రోజూ పొద్దున్నే మూడింటికి లేచి శివుడికి అభిషేకం చేయడం, గుడి ఊడిచి, తుడిచేవాడిని. శివుడికి దగ్గరవ్వాలని అనిపించింది. 41 రోజులు ఆయనకి అభిషేకం చేశానని విరాట్ కర్ణ తెలిపారు.

Nagabandham Movie Pre Release
8/8

హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఒక్క జోనర్‌కే పరిమితం కాదు. దీనిలో అడ్వెంచర్ ఉంది, యాక్షన్ ఉంది, థ్రిల్లర్ ఉంది, మిస్టరీ ఉంది. అద్భుతమైన టీమ్‌తో పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా వెనుక ఉన్న మేజిషియన్ అభిషేక్ సార్. జూలై 3న  నాగబంధం మూవీని థియేటర్లలో చూడాలని నభా నటేష్ తెలిపారు.

X