bredcrumb

41 ఏళ్ల వయసులో త్రిష సోయగాలు.. సిల్క్ చీరలో కైపెక్కిస్తోన్న విశ్వంభర బ్యూటీ

By Siva Kodati
| Published: Saturday, April 19, 2025, 23:09 [IST]

సినీ నటి త్రిష కృష్ణన్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా చీరలో ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి

Trisha Krishnan photos
1/5

దాదాపు 25 ఏళ్లుగా వెండితెరను ఏలుతున్నారు చెన్నై చిన్నది త్రిష కృష్ణన్. ఆమెతో పాటు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారంతా ఫేడ్ అవుట్ కాగా త్రిష మాత్రం ఇప్పటికీ నెంబర్‌వన్‌గా వెలుగొందుతున్నారు . భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటీమణుల్లో త్రిష కూడా ఒకరు.
Trisha Krishnan photos
2/5

ప్రశాంత్ - సిమ్రన్ జంటగా నటించిన జోడీ అనే సినిమాతో 1999లో సినీరంగ ప్రవేశం చేశారు త్రిష. నాటి నుంచి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో నటించారు. ఒకదశలో వరుస ఫ్లాప్స్ వచ్చి ఆమె కెరీర్ ముగిసినట్లేనని అంతా అనుకున్నారు.
Trisha Krishnan photos
3/5

పెళ్లి చేసుకుని జీవితంలో స్ధిరపడాలని అనుకుని ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. అయితే అనూహ్యంగా ఈ పెళ్లి రద్దయ్యింది. కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష.. వరుస హిట్స్‌తో దుమ్మురేపింది. ఆమె దూకుడు చూసి సినీ ప్రముఖులు సైతం షాక్ అయ్యారు.
Trisha Krishnan photos
4/5

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర, కమల్ హాసన్‌తో థగ్‌లైఫ్ సినిమాలలో నటిస్తున్నారు. దాదాపు 16 ఏళ్ల క్రితం స్టాలిన్ చిత్రంలో చిరంజీవితో నటించిన త్రిష మరోసారి మెగాస్టార్‌లో రొమాన్స్ చేస్తోంది. ఇటీవలే థగ్‌లైఫ్ ఈవెంట్‌లోనూ తళుక్కుమని మెరిసింది.
Trisha Krishnan photos
5/5

కోలీవుడ్ అగ్రనటుడు, ఇళయ దళపతి విజయ్‌తో త్రిష సీక్రెట్‌గా ప్రేమాయణం నడుపుతున్నట్లుగా ఎప్పటి నుంచో గాసిప్స్ వస్తున్నాయి. వీటిని ఖండించిన త్రిష.. అసలు తనకు పెళ్లిపై మంచి అభిప్రాయం లేదని పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చని బాంబు పేల్చారు.
X