మెగాస్టార్ చిరంజీవితో ఈ ఏడాది సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారితో మూవీతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి. చిరంజీవితో హిట్ తర్వాత అనిల్ రావిపూడి నెక్ట్స్ ఎవరితో సినిమా చేస్తారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి.


Click it and Unblock the Notifications
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాతలు దిల్‌రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు
మెగాస్టార్ చిరంజీవితో ఈ ఏడాది సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారితో మూవీతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి. చిరంజీవితో హిట్ తర్వాత అనిల్ రావిపూడి నెక్ట్స్ ఎవరితో సినిమా చేస్తారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి.
విక్టరీ వెంకటేష్, నాగార్జున తదితర హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే చివరికి మరోసారి వెంకటేష్‌తోనే సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు అనిల్. ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా మరో హీరోగా నటిస్తున్నారని ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు. దాంతో నందమూరి - దగ్గుబాటి హీరోలతో మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు అనిల్ రావిపూడి.
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబోలో ఇది ఐదో సినిమా. వీరిద్దరి కలయికలో ఇప్పటికే ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు సినిమాలు ఘన విజయాలు సాధించాయి. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
జూలై మొదటి వారంలో వెంకటేష్- కళ్యాణ్‌రామ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని ఫిలింనగర్ టాక్. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మహానటి కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతిశెట్టి హీరోయిన్లుగా ఎంపికయ్యారు. అలాగే కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించనున్నారు.
తన సినిమాలకు ప్రమోషన్స్ విషయంలో వినూత్నంగా ఆలోచించే అనిల్ రావిపూడి.. తన కొత్త సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపిక చేసినట్లు ప్రకటించేందుకు వెరైటీగా ఓ వీడియోను విడుదల చేశారు. హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన వివాహా భోజనంబు మూవీలో బ్రహ్మానందం- సుత్తి వీరభద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన ఐకానిక్ సీన్‌కు స్పూఫ్‌గా జీవీ ప్రకాష్ కుమార్‌ను గీత రచయిత అనంత్ శ్రీరామ్‌లను ఇసుకలో పాతిపెట్టి ఫన్ క్రియేట్ చేశాడు.
తొలి నుంచి తన సినిమాలకు సంగీత దర్శకులను మార్చడం అనిల్ రావిపూడికి అలవాటు. తొలుత సాయి కార్తీక్, ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్, ఎస్ఎస్ థమన్, భీమ్స్ సిసిరోలియోలతో ఆయన కలిసి పనిచేశారు. ఇప్పుడు కెరీర్‌లో తొలిసారిగా జీవీ ప్రకాష్ కుమార్‌ను రంగంలోకి దించడం చర్చనీయాంశమైంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్- నందమూరి కళ్యాణ్ రామ్‌ల మూవీ ఓపెనింగ్ ఎప్పుడు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ జూన్ 18న హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలైంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాతలు దిల్‌రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో హీరో హీరోయిన్లపై తొలి షాట్ చిత్రీకరించగా.. ఈ సినిమా ఘన విజయం సాధించాలంటూ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. దిల్‌రాజు, ఆయన సోదరుడు శిరీష్‌లు స్క్రిప్ట్ అందించి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమాను అనిల్ రావిపూడి ఎలా చిత్రీకరిస్తారోనని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే తన మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో మరోసారి ప్రేక్షకులను ఆయన అలరిస్తారని అంటున్నారు.
కెరీర్ ప్రారంభం నుంచి నేటి వరకు అపజయం అనేది లేకుండా వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి.. మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుని ఈ సెంటిమెంట్‌ను కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారు. తనకు డైరెక్టర్‌గా తొలి అవకాశం కల్పించిన నందమూరి కళ్యాణ్‌రామ్‌తో, హీరోగా ఎక్కువ విజయాలు అందించిన వెంకటేష్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూపించేందుకు అనిల్ రావిపూడి ఎలాంటి కసరత్తు చేశారో వెండితెర మీద చూడాల్సిందే.