bredcrumb

HanuMan 3D Re Release: ఎంతో పుణ్యం చేసుకున్నా.. హనుమాన్ 3డీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తేజ సజ్జా

By Siva Kodati
| Published: Sunday, June 21, 2026, 19:48 [IST]

జూన్ 25న హనుమాన్ 3డీలో రీ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జూన్ 21న చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. సాయిదుర్గా తేజ్, తేజా సజ్జా, అమృత అయ్యర్ తదితరులు పాల్గొన్నారు

HanuMan 3D Re-Release Trailer Launch Event
1/5

రెండేళ్ల క్రితం సంక్రాంతికి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై గ్లోబల్ స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించిన తెలుగు సినిమా హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 350 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీతో టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌లలో ఒకరిగా నిలవగా.. తేజ సజ్జా హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 

HanuMan 3D Re-Release Trailer Launch Event
2/5

వసూళ్లతో పాటు జాతీయ చలన చిత్ర అవార్డులలోనూ హనుమాన్ మూవీ సత్తా చాటి తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ నేపథ్యంలో హనుమాన్ మూవీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అది కూడా 3డీ ఫార్మాట్‌లో జూన్ 25న హనుమాన్ 3డీ వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో విడుదల కానుంది. 

HanuMan 3D Re-Release Trailer Launch Event
3/5

హనుమాన్ 3డీ రీ రిలీజ్‌ను పురస్కరించుకుని హైదరాబాద్‌లో జూన్ 21న చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మెగా హీరో సాయిదుర్గా తేజ్ ముఖ్య అతిథిగా విచ్చేయగా.. హీరో తేజా సజ్జా, హీరోయిన్ అమృత అయ్యర్ తదితరులు హాజరయ్యారు. 

HanuMan 3D Re-Release Trailer Launch Event
4/5

ఈ సందర్భంగా సాయితేజ్ మాట్లాడుతూ.. హనుమాన్‌లో లాస్ట్ 20 మినిట్స్ నాకు బాగా చూడాలనిపిస్తోంది. నా బెస్ట్ ఫ్రెండ్ హనుమంతుడు.. మీరంతా జూన్ 25న సినిమాను చూడండి. బైక్ నడిపితే హెల్మెట్ పెట్టుకోండి.. మీకు ఆడవాళ్లు కనిపిస్తే రెస్పెక్ట్ ఇవ్వండి అని సాయి విజ్ఞప్తి చేశారు. సంబరాల ఏటి గట్టు రిలీజ్‌పై యాంకర్ ప్రశ్నించగా.. మంచి సినిమా తీయాలని మేమంతా కాస్త ఆలస్యమైనా కష్టపడుతున్నాం. ఖచ్చితంగా ఈ ఇయర్‌లో వచ్చేస్తామని సాయితేజ్ అన్నారు.

HanuMan 3D Re-Release Trailer Launch Event
5/5

హీరో తేజ సజ్జా మాట్లాడుతూ.. మీతో పాటే నేను కూడా ఫస్ట్ టైం హనుమాన్ త్రీడీని ఆస్వాదిస్తున్నాను. దీని కోసం చాలా కష్టపడ్డారు. ఇది థియేటర్స్‌లో మళ్లీ పిల్లల్ని, ఫ్యామిలీని ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తున్నాను. అమృతగారు, నిరంజన్ గారిని అందరినీ చాలా రోజుల తర్వాత కలవడంతో మళ్లీ టెన్త్ క్లాస్ రీ యూనియన్‌కి వచ్చినట్లుగా ఉంది. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి సినిమా దొరకదు. తేజ్ గారు, నిరంజన్ గారి కాంబోలో వస్తున్న సంబరాల ఏటి గట్టు మూవీకి ఆల్‌ ది బెస్ట్ చెప్పారు తేజా సజ్జా. 

X