bredcrumb

Nagabandham: విజువల్‌ వండర్‌గా ‘నాగబంధం’..సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నభా-ఐశ్వర్య!

By Rajesh Karampoori
| Published: Friday, June 19, 2026, 20:53 [IST]

Nagabandham Trailer: విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ ట్రైలర్ అద్భుతమైన విజువల్స్, మైథోలాజికల్ ఫాంటసీ, ట్రెజర్ హంట్ అంశాలతో ఆకట్టుకుంటోంది. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుండగా, జూలై 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Nagabandham Trailer
1/6

Nagabandham Trailer: టాలీవుడ్‌లో మైథోలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ జానర్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

Nagabandham Trailer
2/6

 ఎన్‌ఐకె స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ సినిమాలో జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్ష నగార్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైథాలజీ, ఫాంటసీ, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కిన ‘నాగబంధం’ జూలై 3న ప్రేక్షకులకు గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు సిద్ధమైంది.

Nagabandham Trailer
3/6

ఈ చిత్రంలో నాగసాధువులు, దైవిక శక్తులు, శివతత్వం, అలౌకిక రక్షణ వ్యవస్థ అయిన ‘నాగబంధం’ వంటి అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్లు, ఫాంటసీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా కనిపిస్తున్నాయి.

Nagabandham Trailer
4/6

హీరోయిన్ ఐశ్వర్య మీనన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ‘ఖిలాడి’, ‘స్పై’, ‘భజే వాయు వేగం’ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె, ఈ సినిమాతో మరోసారి తన నటనను చాటుకునేందుకు సిద్ధమవుతోంది.

Nagabandham Trailer
5/6

 మరో హీరోయిన్ నభా నటేష్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ‘నన్ను దోచుకుందువటే’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘డిస్కో రాజా’, ‘మ్యాస్ట్రో’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నభా, ‘డార్లింగ్’ తర్వాత ఈ భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Nagabandham Trailer
6/6

తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన ఓ పురాతన రహస్యం, ‘బ్రహ్మ కమలం’ అనే శక్తివంతమైన దైవిక వస్తువు చుట్టూ కథ తిరుగుతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. మిస్టరీ, ట్రెజర్ హంట్, ఆధ్యాత్మిక అంశాలను మేళవించి కథను రూపొందించారు.

X