bredcrumb

Lenin Movie: లెనిన్ కోసం ఫస్ట్ టైం మాట తప్పా... అక్కినేని నాగార్జున

By Siva Kodati
| Published: Wednesday, July 8, 2026, 19:37 [IST]

అఖిల్‌ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లెనిన్ మూవీ జూలై 10న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. జూలై 8న చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది.

Lenin Pre Release Press meet Photos
1/5

కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన మూవీ జూలై 10న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. అన్ని సినిమాలకు కష్టపడుతూనే ఉంటాం. కానీ అఖిల్‌లో ఒక పెయిన్ ఉంది, దానికి ఈ కథకు కోఆర్డినేషన్ సెట్ అయ్యింది. నిర్మాతను కాబట్టే ఇన్వాల్వ్ అయ్యాను.. నేను కనుక ప్రొడ్యూసర్‌ని కాకపోతే అంతగా పట్టించుకునేవాడిని కాదు. సెట్‌లో తీసిన సీన్స్‌ని నాకు ఇంటి దగ్గర చూపించేవారు. సినిమాకు భాగ్యశ్రీయే మెయిన్ సోల్. ఇలాంటి సినిమా హ్యాండిల్ చేయడం చాలా కష్టం. నేను తీసిన ముందు మాకు నచ్చాలి, అంతేకానీ ఓటీటీ కోసమో? ఎవరి కోసమో సినిమాను ముందు పెట్టకూడదని నాగార్జున తెలిపారు.

Lenin Pre Release Press meet Photos
2/5

ఇప్పటి వరకు నేను డేట్ ఇస్తే తప్పలేదు.. మూడు నెలల్లో సినిమా రిలీజ్ చేస్తానంటే చేస్తా. కానీ లెనిన్ టెక్నీషియన్స్ వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు. జూన్ 26న సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయాం. మాకు మరో 2 వారాలు టైం ఇవ్వాలని అడగటంతో ఓకే చెప్పాను. చివరిసారిగా నేను ఇన్వాల్వ్ అయి చేసిన సినిమా మనం.. అది నాన్నగారి కోసం చేశా, ఆయన తండ్రి, ఈయన బిడ్డ. ఇది అఖిల్ కోసం ఇంత ఇన్వాల్వ్ అయి చేశా. ప్రతి తండ్రి తన బిడ్డ కోసం పడే కష్టమే నేను కూడా పడ్డానని నాగార్జున తెలిపారు.

Lenin Pre Release Press meet Photos
3/5

అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. ప్రతి సినిమాను 100 శాతం నమ్మే చేస్తాం, కానీ తెలుగు ప్రేక్షకుల మూలాలకి కనెక్ట్ అయ్యుండాలి. ఈ సినిమా కమర్షియల్‌గా ఆలోచించలేదు, ఈ స్క్రిప్ట్‌కి చాలా రెస్పెక్ట్ ఇచ్చాం. నా కోసం చాలామంది పనిచేశారు. షూటింగ్ సందర్భంగా చాలా సవాళ్లు ఎదురయ్యాయి. కొన్ని వర్క్ షాప్స్‌కి అటెండ్ అయ్యాం. కంటెంట్ రేపు మాట్లాడుతుంది, ఈ స్టోరీకి నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయా. ఈ సినిమాకి ముందు నుంచే గత మూడేళ్లుగా కామ్ అయిపోయానని అఖిల్ తెలిపారు.

Lenin Pre Release Press meet Photos
4/5

భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. భాగ్యశ్రీ క్యారెక్టర్ నా మనసుకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇలాంటి పాత్రను పోషించడం చాలా ఈజీ. వ్యక్తిగతంగా నేను నా కుటుంబం, ఫ్రెండ్స్‌తో అలాగే ఉంటున్నా. ఈ ఎనర్జీతోనే సెట్‌లో నడుచుకున్నా, నందూ సార్ బాగా గైడ్ చేశారు. శ్రీలీల ప్లేస్‌లో తనకు అవకాశం దక్కడంపై భాగ్యశ్రీ స్పందిస్తూ.. అంతా డెస్టినీ, నిజంగానే ఇలాంటి పాత్ర దక్కినందుకు అదృష్టవంతురాలిని అని ఆమె పేర్కొన్నారు.

Lenin Pre Release Press meet Photos
5/5

థమన్ మాట్లాడుతూ.. అఖిల్‌ కామ్ అయిపోయారని అంటున్నారు, ఆయనకు పెళ్లయ్యింది. ఆటోమేటిక్‌గా లైఫ్ కామ్ అయిపోతుంది. బరువు, బాధ్యతలతో పాటు కామ్‌నెస్ వచ్చేస్తుంది. అఖిల్ గారు చాలా ఎమోషన్స్‌ని అలా దాచేశారు. కథను నాకు పంపించినప్పుడు అస్సలు వదలొద్దు అని చెప్పాను అని థమన్ అన్నారు.

X