By
Rajesh Karampoori
| Published: Saturday, July 4, 2026, 19:54 [IST]
Deepa Thomas: 'రావు బహద్దూర్' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది మలయాళ నటి దీపా థామస్ . ఈ అమ్మడు లేటెస్ట్ లుక్ చూసి నెటిజన్లు ఫుల్ ఫిదా అవుతున్నారు. దీపా థామస్ తన క్యూట్ స్మైల్, స్టన్నింగ్ లుక్స్, చార్మింగ్ ప్రెజెన్స్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది. మీరు కూడా ఓ లూక్కేయండి.
1/6
మహేష్ మెచ్చిన కొత్త హీరోయిన్.. రావు బహద్దూర్ భామ స్టన్నింగ్ ఫోటోలు వైరల్! | Deepa Thomas Photo Gallery: Meet The Kerala Beauty Making Her Tollywood Debut With Rao Bahaddur - Filmibeat Telugu
/photos/feature/deepa-thomas-photo-gallery-meet-the-kerala-beauty-making-her-tollywood-debut-with-rao-bahaddur-fb108678.html
తెలుగు సినీ పరిశ్రమలో మరో కేరళ భామ అడుగుపెట్టింది. మలయాళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దీపా థామస్. హీరో సత్యదేవ్ నటించిన 'రావు బహద్దూర్' సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టారు. దర్శకుడు మహా తెరకెక్కించిన ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పించారు.
2/6
మహేష్ మెచ్చిన కొత్త హీరోయిన్.. రావు బహద్దూర్ భామ స్టన్నింగ్ ఫోటోలు వైరల్! | Deepa Thomas Photo Gallery: Meet The Kerala Beauty Making Her Tollywood Debut With Rao Bahaddur - Filmibeat Telugu
/photos/feature/deepa-thomas-photo-gallery-meet-the-kerala-beauty-making-her-tollywood-debut-with-rao-bahaddur-fb108678.html#photos-1
ఇటీవల 'రావు బహద్దూర్' సినిమా చూసిన మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా చిత్రబృందాన్ని ప్రశంసించారు. ముఖ్యంగా సత్యదేవ్ నటనతో పాటు హీరోయిన్ దీపా థామస్ ప్రదర్శనను కూడా ప్రత్యేకంగా కొనియాడారు. సినిమాలో ఆమె పోషించిన 'రేణుక' పాత్ర ఎంతో సహజంగా, భావోద్వేగంగా ఉందని ప్రశంసించడంతో ఒక్కసారిగా దీపా థామస్ పేరు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సూపర్ స్టార్ నుంచి వచ్చిన ఈ ప్రశంసలు ఆమె కెరీర్‌కు మంచి బూస్ట్‌గా మారనున్నది.
3/6
మహేష్ మెచ్చిన కొత్త హీరోయిన్.. రావు బహద్దూర్ భామ స్టన్నింగ్ ఫోటోలు వైరల్! | Deepa Thomas Photo Gallery: Meet The Kerala Beauty Making Her Tollywood Debut With Rao Bahaddur - Filmibeat Telugu
/photos/feature/deepa-thomas-photo-gallery-meet-the-kerala-beauty-making-her-tollywood-debut-with-rao-bahaddur-fb108678.html#photos-2
ఇక 'రావు బహద్దూర్' సక్సెస్ ఈవెంట్‌లో దీపా థామస్ చేసిన ప్రసంగం కూడా అందరినీ ఆకట్టుకుంది. "ఈ తరం అత్యుత్తమ నటుల్లో సత్యదేవ్ ఒకరు. ఆయనతో కలిసి నటించడం నా అదృష్టం. ఈ సినిమాలో ఆయన నటనకు తప్పకుండా అవార్డు వస్తుంది" అంటూ ప్రశంసించారు. అలాగే దర్శకుడు మహా తనకు ఆడిషన్ అవకాశం ఇచ్చిన రోజు జీవితంలో మరిచిపోలేని క్షణమని, 'రేణుక' పాత్రను తనకు ఇవ్వడం జీవితాంతం గుర్తుండిపోయే వరమని భావోద్వేగంగా చెప్పారు.
4/6
మహేష్ మెచ్చిన కొత్త హీరోయిన్.. రావు బహద్దూర్ భామ స్టన్నింగ్ ఫోటోలు వైరల్! | Deepa Thomas Photo Gallery: Meet The Kerala Beauty Making Her Tollywood Debut With Rao Bahaddur - Filmibeat Telugu
/photos/feature/deepa-thomas-photo-gallery-meet-the-kerala-beauty-making-her-tollywood-debut-with-rao-bahaddur-fb108678.html#photos-3
కేరళకు చెందిన దీపా థామస్ వృత్తిరీత్యా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత అనుకోకుండా మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ఈ తరుణంలో మిస్ సౌత్ ఇండియా సెకండ్ రన్నరప్ టైటిల్ సాధించారు. అనంతరం మలయాళంలో 'వైరస్','హోమ్, మోహన్ కుమార్ ఫ్యాన్స్, పెరుమాని వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
5/6
మహేష్ మెచ్చిన కొత్త హీరోయిన్.. రావు బహద్దూర్ భామ స్టన్నింగ్ ఫోటోలు వైరల్! | Deepa Thomas Photo Gallery: Meet The Kerala Beauty Making Her Tollywood Debut With Rao Bahaddur - Filmibeat Telugu
/photos/feature/deepa-thomas-photo-gallery-meet-the-kerala-beauty-making-her-tollywood-debut-with-rao-bahaddur-fb108678.html#photos-4
తెలుగు హీరోల్లో నాని, మహేష్ బాబు అంటే తనకు ఎంతో అభిమానమని దీపా ఇప్పటికే వెల్లడించారు. మహేష్ బాబును కలిసే అవకాశం వస్తే ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్ అడుగుతానని సరదాగా చెప్పారు. సినిమాలతో పాటు ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చే దీపా, ఇటీవల సొంతంగా ఒక క్లాతింగ్ బ్రాండ్‌ను కూడా ప్రారంభించారు. భవిష్యత్తులో క్రీడాకారిణి పాత్రతో పాటు ఓ స్ఫూర్తిదాయక వ్యక్తి బయోపిక్‌లో నటించాలనే కోరిక ఉందని వెల్లడించారు.
6/6
మహేష్ మెచ్చిన కొత్త హీరోయిన్.. రావు బహద్దూర్ భామ స్టన్నింగ్ ఫోటోలు వైరల్! | Deepa Thomas Photo Gallery: Meet The Kerala Beauty Making Her Tollywood Debut With Rao Bahaddur - Filmibeat Telugu
/photos/feature/deepa-thomas-photo-gallery-meet-the-kerala-beauty-making-her-tollywood-debut-with-rao-bahaddur-fb108678.html#photos-5
ప్రస్తుతం 'రావు బహద్దూర్'పై పెరుగుతున్న అంచనాలతో పాటు మహేష్ బాబు ప్రశంసలు కూడా దీపా థామస్‌కు బూస్ట్ ని ఇచ్చాయి. సినిమా విజయవంతమైతే టాలీవుడ్‌లో ఆమెకు వరుస అవకాశాలు రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే సహజ నటన, అందం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్న ఈ కేరళ భామ, 'రావు బహద్దూర్'తో తెలుగు ప్రేక్షకుల మనసులు కూడా గెలుచుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.