bredcrumb

Nagabandham: నాగబంధంపై నెగిటివ్ రివ్యూలతో కుట్ర... హీరో విరాట్ కర్ణ షాకింగ్ కామెంట్స్

By Siva Kodati
| Published: Tuesday, July 7, 2026, 09:01 [IST]

విరాట్ కర్ణ, నభా నటేష్ జంటగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన నాగబంధం మూవీ జూలై 3న వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఈ సందర్భంగా జూలై 6న హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

Nagabandham Movie Success Meet
1/4

అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ, నభా నటేష్ జంటగా నటించిన మూవీ నాగబంధం. జూలై 3న వరల్డ్ వైడ్‌గా విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ జూలై 6న హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు తరలివచ్చారు.

Nagabandham Movie Success Meet
2/4

విరాట్ కర్ణ మాట్లాడుతూ.. ఫస్ట్ టైం కొత్త డైరెక్టర్, కొత్త హీరో, కొత్త ప్రొడ్యూసర్ కలిసి సినిమా తీశాం. మమ్మల్ని నమ్మి ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. కొంతమంది ఆడియన్స్ అయితే స్క్రీన్ మీద అనంత పద్మనాభ స్వామి స్క్రీన్ మీద కనిపిస్తే చెప్పులు తీసేసి మరి చూస్తున్నారు. కొంతమంది మాత్రం సినిమాను చూడొద్దని నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. మనందరం ఇక్కడే పనిచేసుకుంటున్నాం.. మీ రివ్యూ మీరు ఇవ్వండి, చూడాలా? వద్దా? అనేది మాత్రం ప్రేక్షకుల ఇష్టం. హరహర మహాదేవ అనే స్లోగన్‌తో థియేటర్స్ నిండిపోతున్నాయి. ఇంతకంటే ఎమోషన్ ఏం కావాలి. కొత్త డైరెక్టర్ అయినప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని విరాట్ కర్ణ చెప్పారు.

Nagabandham Movie Success Meet
3/4

దర్శకుడు అభిషేక్ నామా మాట్లాడుతూ.. ప్రతి సినిమాకు విమర్శలు, నెగిటివ్ రివ్యూలు వస్తాయని తెలుసు. కానీ ఆడియన్స్ రివ్యూలు మాత్రమే అల్టీమేట్. సినిమాలో కొన్ని మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు.. ఫస్టాఫ్‌లో సాంగ్, క్లైమాక్స్‌ లెంగ్త్ ఎక్కువైందంటే అది కూడా ట్రిమ్ చేశాం. కొందరు పనిగట్టుకుని సినిమా రిలీజ్ కాకుండా రివ్యూ ఎలా ఇస్తారో నాకు కూడా తెలియదు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరం రెండున్నరేళ్లు, పగలు రాత్రి కష్టపడ్డాం. 

పెయిడ్ రివ్యూల్ని నమ్మొద్దు, నిజమైన రివ్యూలు మాత్రమే నమ్మండి. నాగబంధం అనేది ఫిక్షనల్ స్టోరీ కాదు.. ఆఫ్ఘన్స్ ఇండియాకు వచ్చారు, 1747లో మధురైని నాశనం చేశారు. అప్పుడు ఆదిశంకరాచార్యులు నాగసాధువులు అనే వర్గాన్ని సృష్టించి భారతదేశంలో ఉన్న ఆలయాల్ని రక్షించే బాధ్యతల్ని అప్పగించారు. ఇది కల్పితం కాదు. హిందువుల్ని ఎలా దారుణంగా చంపారో నేను 10 శాతం మాత్రమే చూపించాను అని అభిషేక్ నామా అన్నారు.

Nagabandham Movie Success Meet
4/4

హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డాం. ఆడియన్స్ ఇస్తున్న ఎనర్జీ, వాళ్లు ఇస్తున్న రివ్యూలే మన గెలుపు. రెండు రోజుల నుంచి థియేటర్స్‌కి కూడా వెళ్లి చూస్తున్నాం. ఒక అబ్బాయి శనివారం ఈ సినిమా చూసి.. వాళ్ల అమ్మ, అమ్మమ్మ ఇతర బంధువుల్ని తీసుకుని రెండోసారి థియేటర్‌కు వచ్చారు. తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్.. దానితో పాటు కర్ణాటక, నార్త్ సైడ్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని నభా నటేష్ పేర్కొన్నారు. 

X