By
Siva Kodati
| Published: Sunday, July 5, 2026, 19:28 [IST]
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, ఆయ్ వంటి వరుస హిట్స్‌తో ఊపు మీదున్న జూనియర్ ఎన్టీఆర్ బావమరిది, యువ హీరో నార్నే నితిన్ తన 5వ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్ లాంచ్ అయ్యింది.
1/5
కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో నార్నే నితిన్ మూవీ.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్ లాంచ్ | KVN Productions - Narne Nithiin Movie Was Launched With A Grand Pooja Ceremony - Filmibeat Telugu
/photos/feature/kvn-productions-narne-nithiin-movie-was-launched-with-a-grand-pooja-ceremony-fb108690.html
దక్షిణ భారతదేశంలో బడా నిర్మాణ సంస్థగా వెలుగొందుతోంది కేవీఎన్ ప్రొడక్షన్స్. వెంకట్ కే నారాయణ ఆధ్వర్యంలో ఈ సంస్థ భారీ చిత్రాలను నిర్మిస్తోంది. కేడీ ది డెవిల్, బాలన్ ది బాయ్‌లు ఇప్పటికే రిలీజ్ కాగా.. భారీ చిత్రాలైన జననాయగన్, టాక్సిక్‌లు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మెగా 158 మూవీతో కేవీఎన్ ప్రొడక్షన్స్ టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.
2/5
కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో నార్నే నితిన్ మూవీ.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్ లాంచ్ | KVN Productions - Narne Nithiin Movie Was Launched With A Grand Pooja Ceremony - Filmibeat Telugu
/photos/feature/kvn-productions-narne-nithiin-movie-was-launched-with-a-grand-pooja-ceremony-fb108690.html#photos-1
ఇకపై తెలుగులో స్టార్ హీరోలతో భారీ చిత్రాలు చేసేందుకు వెంకట్ కే నారాయణ ప్లాన్ చేస్తున్నారు. అలాగే చిన్న హీరోలు, దర్శకులను ప్రోత్సహించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తూ.. టాలీవుడ్‌లో జెండా పాతాలని కేవీఎన్ ప్రొడక్షన్స్ భావిస్తోంది. ఇప్పటికే పలువురు హీరోలు, దర్శకులతో వెంకట్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ఫిలింనగర్ టాక్.
3/5
కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో నార్నే నితిన్ మూవీ.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్ లాంచ్ | KVN Productions - Narne Nithiin Movie Was Launched With A Grand Pooja Ceremony - Filmibeat Telugu
/photos/feature/kvn-productions-narne-nithiin-movie-was-launched-with-a-grand-pooja-ceremony-fb108690.html#photos-2
దీనిలో భాగంగా యంగ్ హీరో నార్నే నితిన్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనుంది కేవీఎన్ ప్రొడక్షన్స్. మ్యాడ్, ఆయ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాల హిట్స్‌తో మంచి ఊపులో ఉన్నారు నార్నే నితిన్. ఇక తాజా చిత్రం విషయానికి వస్తే.. జూనియర్ ఫేమ్ దర్శకుడు రాధాకృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి వివేక్- మెర్వీన్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. రామ మారుతి ఎం సినిమాటోగ్రాఫర్‌గా, నిరంజన్ దేవరమానె ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
4/5
కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో నార్నే నితిన్ మూవీ.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్ లాంచ్ | KVN Productions - Narne Nithiin Movie Was Launched With A Grand Pooja Ceremony - Filmibeat Telugu
/photos/feature/kvn-productions-narne-nithiin-movie-was-launched-with-a-grand-pooja-ceremony-fb108690.html#photos-3
నార్నే నితిన్ కెరీర్‌లో ఇది 5వ సినిమా. ఇందులో ఆయన సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బుట్టబొమ్మ ఫేమ్ అనిఖా సురేంద్రన్‌తో పాటు కన్నడ నటి మేఘా శెట్టిలు నితిన్‌తో ఆడిపాడనున్నారు. ఈ సినిమా టైటిల్, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు తెలియాల్సి ఉంది.
5/5
కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో నార్నే నితిన్ మూవీ.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్ లాంచ్ | KVN Productions - Narne Nithiin Movie Was Launched With A Grand Pooja Ceremony - Filmibeat Telugu
/photos/feature/kvn-productions-narne-nithiin-movie-was-launched-with-a-grand-pooja-ceremony-fb108690.html#photos-4
జూన్ 5వ తేదీ ఆదివారం హైదరాబాద్‌లో నార్నే నితిన్- కేవీఎన్ ప్రొడక్షన్స్ మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కే నారాయణ క్లాప్ కొట్టగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, కళ్యాణ్ శంకర్ తొలి షాట్‌ను డైరెక్ట్ చేశారు.